40 గంటలు వీడియో గేమ్ ఆడి చనిపోయాడు!

Posted By: Staff

40 గంటలు వీడియో గేమ్ ఆడి చనిపోయాడు!

ఏకంగా నలభై గంటల పాటు నిద్రాహారాలు మాని వీడియో గేమ్ ఆడి మృత్యువాతపడిన ఓ టీనేజర్ ఉధంతం తైవాన్‌లో సంచలనం రేకెత్తించింది. దర్యాప్తు నిర్వహించిన స్థానిక పోలీసులు మృతిని పేరు తెలియాల్సి ఉందని, అతని ఇంటి పేరు మాత్రం ‘చువాంగ్’గా గుర్తించామని తెలిపారు. సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే... తైవాన్‌లోని ఓ ఇంటర్నెట్ సెంటర్‌కు చువాంగ్ ఈ నెల13న వచ్చాడు. వీడియో గేమ్ ఆడటం ప్రారంభించిన చువాంగ్ ఆటలో నిమగ్నమై కూర్చున్న చోటు నుంచి లేవకుండా 40 గంటలు గడిపాడు. 15వ తేదీని సదురు నెట్ సెంటర్ ఉద్యోగి చువాంగ్‌ను గమనించి పలకరిద్దామని యత్నించగా కుర్చీలోంచి కిందపడిపోయాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting