Home
News

సైబర్‌ నేరగాళ్లు కోటి పది లక్షల రూపాయలు దోచుకొనేందుకు ప్రయత్నించారు.. కానీ 25 నిమిషాల్లోనే..!!

సైబర్‌ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయితే తెలంగాణలో సైబర్‌ నేరాల (Cyber crime) కట్టడి చేసేందుకు ఏర్పాటైన తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (TSCCB) తాజాగా సైబర్‌ నేరస్తులకు నగదు చేరకుండా కీలకంగా వ్యవహరించింది. సంబంధిత వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ఏకంగా కోటి పది లక్షల రూపాయలు సైబర్ నేరస్తులకు చేరకుండా నిలిపేసేలా పనిచేసింది.

ఎప్పుడైనా సైబర్‌ నేరాల బారిన పడితే ఆందోళన చెందకుండా సంబంధిత వర్గాలను అప్రమత్తం చేయాలని ఈ కథనం ద్వారా తెలుస్తోంది. ఈ ఘటన వివరాలను తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ( Telangana Cyber Security Bureau ) డైరెక్టర్‌ శిఖా గోయల్‌ వెల్లడించారు. ఈ ఘటన పూర్తి వివరాలు మీకోసం.

Telangana cyber security bureau prevent

మూడు మెసెజ్‌లు.. రూ.1.10 కోట్లు.. :
హైదరాబాద్‌ నాచారం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఏప్రిల్‌ 27 ఉదయం 10.09 గంటల నుంచి 10.11 నిమిషాల మధ్యలో 3 మెసేజ్‌లు వచ్చాయి. అయితే మొదటి మెసెజ్‌లో రూ.50 లక్షలు, రెండో మెసెజ్‌లో మరో రూ.50 లక్షలు, మూడో మెసేజ్‌లో రూ.10 లక్షల నగదు వేరే బ్యాంకు ఖాతాకు బదిలీ జరిగినట్లు తెలిసింది.

సైబర్‌ క్రైం హెల్ప్‌లైన్‌ నంబర్‌కు సమాచారం :
తన ప్రమేయం లేకుండా తన బ్యాంకు అకౌంట్‌ నుంచి ఏకంగా కోటి పది లక్షల రూపాయలు ఇతరుల ఖాతాకు బదిలీ కావడం పై బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే వెంటనే కుటుంబ సభ్యుల సాయంతో బ్యాంకు అధికారులను సమాచారం అందించి అప్రమత్తం చేశారు. అనంతరం సైబర్‌ క్రైం హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 1930 కు సమాచారం అందించారు.

రంగంలోకి తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో.. :
దీంతో సంబంధిత సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మరియు తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రంగం లోకి దిగింది. నగదు బదిలీ అయిన బెంగుళూరు లోని యాక్సిస్‌ మరియు HDFC బ్యాంకు అధికారులను అప్రమత్తం చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలను CFCFRMS ( సిటిజన్ ఫైనార్షియల్‌ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్ట్‌మ్‌ ) పోర్టల్‌ లో అప్‌లోడ్‌ చేసింది.

ఆ రూ.10 వేలు మాత్రమే :
దీంతో అనధికారికంగా బదిలీ అయిన ఖాతాల నుంచి నగదును విత్‌ డ్రా చేయకుండా బ్యాంకులు చర్యలు తీసుకున్నాయి. అయితే ఈ లోపలే ఆ ఖాతా నుంచి కేవలం రూ.10,000 మాత్రమే విత్‌ డ్రా అయ్యాయి. ఈ రెండు బ్యాంకు అకౌంట్లు సజావుద్దీన్‌, సలీముద్దీన్‌ కు చెందినవిగా గుర్తించారు. అయితే ఈ నగదు ఎలా బదిలీ అయ్యాయనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

25 నిమిషాల్లోపే..!
నగదు బదిలీ అయిన కేవలం 25 నిమిషాల్లోపే సైబర్‌ నేరస్తులు ఆ నగదును విత్‌డ్రా చేయకుండా నిలిపేశారు. దీనిపై తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ సిబ్బందిని అభినందించారు. ఇలాంటి ఘటనల్లో ఆందోళన చెందకుండా సంబంధిత విభాగాలకు ముందస్తుగా అప్రమత్తం చేయడం ముఖ్యమని గుర్తించాలని సూచించారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Telangana cyber security bureau prevent illegal transfer of RS 1.10 crore in Hyderabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X