హైదరాబాద్‌లో మరో ఐటీ క్లస్టర్, త్వరలో లక్షన్నర కొత్త ఉద్యోగాలు

Posted By: BOMMU SIVANJANEYULU

ఐటీ హబ్‌గా గుర్తింపుతెచ్చుకన్న భాగ్యనగరం హైదరాబాద్‌లో మరో ఐటీ క్లస్టర్ ఏర్పాటు కాబోతోంది. హైదరాబాద్‌లోని బద్వేల్ ప్రాంతంలో కొత్తగా ఐటీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం తెలిపారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాన్ని కేటీఆర్ సందర్శించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

30 వరకు ఐటీ కంపెనీలు ఆసక్తి..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐటీ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన త్వరలోనే ముఖ్యమంత్రి చేతులమీదగా జరుగుతుందని అన్నారు. ఈ కస్టర్‌లో కంపెనీలను ఏర్పాటు చేసేందుకు 30 వరకు జాతియ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతన్నాయని కేటీఆర్ తెలిపారు. వీటితో ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే రానున్న 5 సంవత్సరాల్లో 1.25 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు వీలుంటుందని ఆయన అన్నారు.

అన్నిరకాల మౌళిక వసతులతో..

కొత్తగా ఏర్పాటు కానున్న క్లస్టర్‌లో అన్ని రకాల మౌళిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చాలా వరకు ఐటీ కంపెనీలు హైటెక్ సిటీ అలానే గచ్చిబౌలీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐటీ కారిడార్‌లలో కొలువుతీరి ఉండగా, మరికొన్ని మాత్రం ఉప్పల్ ఏరియా నుంచి రన్ అవుతున్నాయి.

లీడింగ్ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌..

గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, సిస్కో వంటి బహుళ జాతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌ను లీడింగ్ డెస్టినేషన్‌గా ఎంపిక చేసకుని ఇక్కడ కూడా తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి.

ముంబైలో సందడి చేసిన Sophia రోబోట్

సాఫ్ట్‌వేర్ దగ్గర నుంచి కన్సల్టింగ్ సంస్థల వరకు..

హైదరాబాద్‌లో ఒక్క ఐటీ ఆధారిత సర్వీసులు మాత్రమే కాదు, బీపీఓ (బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్) ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెందుతోంది. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీల దగ్గర నుంచి సాప్ట్‌వేర్ కన్సల్టింగ్ సంస్థల వరకు ఇటీ ఇంకా ఇతర టెక్నాలజీ సర్వీసుల పై ఆధారపడుతూ తమ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాయి.

1990 నుంచే ఐటీ కంపెనీల రాక..

హైదరాబాద్‌లో 1990 నుంచి ఐటీ కంపెనీల హడావుడి మొదలైంది. అప్పటి నుంచే ఐటీ కంపెనీలు నగరంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాయి. ఇన్ఫోసిస్ టెక్నాలజీ లిమిటెడ్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎమ్, డెల్, ఆమోజన్, ఒరాకిల్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ప్రముఖ కంపెనీలు భాగ్యనగరంలో ఏర్పాటయ్యాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This information technology hub will have another IT corridor with the Telangana government deciding to develop a new cluster in Budvel area, it was announced on Wednesday.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot