Home
News

ఇంటర్నెట్ కేఫ్ వ్యాన్ : ఇక జాబ్ అప్లయి మరింత సులువు

By Gizbot Bureau

మీరు ఉద్యోగానికి అప్లయి చేస్తున్నారా..అయితే ఎలా అప్లయి చేయాలో తెలీడం లేదా.. లేకుంటే ఉద్యోగానికి అప్లయి చేసే సమయంలో ఫారాలు అన్నీ ఓ చోట దొరకడం లేదా... ఇలాంటి వాటికి ఇకపై చెక్ పెట్టేయండి. ఎందుకంటే ఇప్పుడు నేరుగా మీరున్న చోటుకే mobile Internet service van వచ్చేస్తుంది. మీరు అప్లయి చేయాల్సిన ఉద్యోగానికి సంబంధించి అన్ని వివరాలు ఈ వ్యాన్ లో ఉంటాయి. సింపుల్ గా మీరు అప్లయి చేస్తే చాలు. జెరాక్స్, ప్రింటింగ్ కోంస ఎక్కడికీ పోనవసరం లేదు. కుప్లంగా చెప్పాలంటే ఇది E-Net సర్వీసు.. ఇంతకీ ఎక్కడ ఉంది. ఎవరు స్టార్ట్ చేశారు. ఈ స్మార్ట్ లుక్కేసుకోండి.

mobile Internet service van 

mobile Internet service van 

ఖమ్మంకు చెందిన అలీష్ బాబు హైదరాబాద్ లో mobile Internet service van ద్వారా E-Net సర్వీసును స్టార్ట్ చేశారు. ఈ వ్యాను మీరున్నచోటుకే వచ్చి ఉద్యోగానికి సంబంధించిన అని డాక్యుమెంట్లను తిరిగే అవసరం లేకుండా వ్యాను ద్వారానే చేసిపెడుతోంది. అంటే మీరు ఏ ఉద్యోగానికి అప్లయి చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉంటే చాలు. ఈ వ్యానులోను ఉద్యోగానికి అప్లయి చేయవచ్చు.

వ్యానులో ఏం ఉంటాయి

వ్యానులో ఏం ఉంటాయి

ఈ వ్యానులో కంప్యూటర్, ఇంటర్నెట్ సర్వీసు, జెరాక్స్ మిషన్, ప్రింటర్ వంటి సదుపాయాలు ఉంటాయి. మీరు వ్యానులో కూర్చుని మొత్తం వివరాలను ఫిల్ చేయవచ్చు. అలాగే నకలును జత చేయవచ్చు. బయటకు ఎక్కడకు వెళ్లనవసరం లేకుండా ఉద్యోగ అప్లికేషన్ ని పూర్తి చేయవచ్చు. దీనికోసం వారు కొంత ఛార్జ్ చేస్తారు.

ఆలోచన ఎలా వచ్చింది?

ఆలోచన ఎలా వచ్చింది?

ఇది అతని అనుభవంలోనుంచి వచ్చిన ఆలోచనగా చెప్పవచ్చు. అలీష్ బాబు ఉద్యోగానికి అప్లయి చేస్తున్నప్పుడు అర్జంటుగా తన ఒరిజినల్ డాక్యుమెంట్ కి ఫోటో కాపీ అవసరం అయింది. మొత్తం ఖమ్మం అంతా తిరిగినా ఎక్కడ ఆయనకు అది దొరకలేదు. దగ్గరలో ఒక షాపు ఉంటే దానికి కరెంట్ లేదు. దీంతో అతను ఈ ఉద్యోగానికి అప్లయి చేయలేకపోయాడు. కేవలం ఫోటో కాపీ లేకపోవడం వల్ల ఉద్యోగం చేజారిపోయిందని బాధపడ్డాడు. తనలా ఎవరికి కాకూడదని నిర్ణయించుకున్నాడు.

బ్యాంకు లోన్ 

బ్యాంకు లోన్ 

ఆలోచన వచ్చిందే తడవుగా బ్యాంకు అధికారులను సంప్రదించాడు. తనకున్న ఆలోచనను వారికి చెప్పి లోన్ కావాలని అడిగాడు. బ్యాంకు అధికారులు ఇతని ఆలోచచను మెచ్చుకుని వెంటనే లోన్ అప్రూవ్ చేశారు. లోన్ అప్రూవ్ కావడంతో వెంటనే తన బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ వ్యాపారానికి అతను పెట్టిన పెట్టుబడి రూ. 6.5 లక్షలు. ఈ విషయాలు అన్నీ New Indian Expressలో ప్రచురితం అయ్యాయి. 

Best Mobiles in India

English summary
Telangana Man's Internet Cafe Inside A Van Helps Youth In Remote Areas Apply For Jobs Online
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X