హైదరాబాద్‌ అంతంటా 3000 వై-ఫై హాట్‌స్పాట్‌లు

సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రపంచదేశాలతో పోటీపడుతోన్న హైదరాబాద్‌కు వరల్డ్-క్లాస్ ఐటీ ఫెసిలిటీస్‌ను కల్పించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'హైదరాబాద్ సిటీ వై-ఫై ప్రాజెక్టు'ను ప్రారంభించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రస్తుతం 1000 హాట్‌స్పాట్‌లకు ఉచిత వై-ఫై..

Hy-Fiగా పిలవబడుతోన్న ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతానికి నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 1000 హాట్‌స్పాట్‌లకు ఉచిత వై-ఫైను అందిస్తారు. త్వరలోనే మరో 2000 హాట్‌స్పాట్‌లకు వై-ఫై కనెక్టువిటీని పెంచుతారు.ఈ ప్రాజెక్ట్ సిటీ పరిధిలోని 3000 హాట్‌స్పాట్ లోకేషన్‌లను కవర్ చేస్తుంది.

కొంత టెక్నాలజీలను అందిపుచ్చుకోవటంలో జీహెచ్ఎంసీ టాప్..

ఈ ప్రాజెక్ట్ ఆవిష్కరణ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో కొంత టెక్నాలజీలను ఇంప్లిమెంట్ చేసేందుకు జీహెచ్ఎంసీ ఎల్లపుడు ముందుంటుందని, తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ వై-పై సౌకర్యంతో స్థానికులకు మాత్రమే కాకుండా నగరానికి వచ్చే ఎంతో మంది పర్యాటకులకు ఇంటర్నెట్ అవసరాలు తీరుతాయని అన్నారు.

అవసరమైతే మరిన్ని లోకేషన్‌లలో వై-ఫై హాట్ స్పాట్స్...

కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ నగరంలో 3,000 పబ్లిక్ లోకేషన్‌లను గుర్తించామని, వాటిలో 1000 హాట్‌స్పాట్‌లలో ఇప్పటికే నెట్‌వర్క్‌ను ఇన్‌స్టాల్ చేసామని, మిగిలిన 2,000 లోకేషన్‌లలో నెట్‌వర్క్‌ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ జరుగుతోందని ఆయన తెలిపారు.

ప్రాజెక్టు నిమిత్తం రూ.300 కోట్ల ఖర్చు..

ఈ ప్రాజెక్టు నిమిత్తం రూ.300 కోట్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు చేస్తోంది. ఈ వై-ఫై హాట్‌స్పాట్‌ల వద్ద 5ఎంబీపీఎస్ నుంచి 10 ఎంబీపీఎస్ స్పీడుతో రోజుకు 30 నిమిషాల పాటు ఉచిత ఇంటర్నెట్‌ను పొందే వీలుంటుంది. ఆ తరువాతి నుంచి రీఛార్జ్ చేయించుకోవల్సి ఉంటుంది. వై-ఫై లొకేషన్‌లకు సంబంధించిన వివరాలను జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Telangana launches Hy-Fi for free Wi- Fi with over 1000 hotspots. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot