టెక్నాలజీని ఉపయోగించే విషయంలో దూసుకెళ్తున్న తెలంగాణ పోలీసు యంత్రాంగం
అంది వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకొని మరింత వేగంగా తెలంగాణ పోలీసు యంత్రాంగం ముందుకు దూసుకెళుతోంది.
అంది వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకొని మరింత వేగంగా తెలంగాణ పోలీసు యంత్రాంగం ముందుకు దూసుకెళుతోంది.ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. మోస్ట్ వాంటెడ్ నేరస్తులు, పాతనేరస్తులు, తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులు, అదృశ్యమైన చిన్నారులను గుర్తించేందుకు ఈ టెక్నాలజీ ముఖ్య భూమికను పోషిస్తుందని డీజీపీ మహేందర్‌రెడ్డి గారు తెలిపారు.అదే విధంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన kiki చాలెంజ్‌పై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకివెళ్తే.....

TSCOP యాప్‌కు....
తెలంగాణ రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయంలో గురువారం ఈ వ్యవస్థను డీజీపీ మహేందర్‌రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సర్వీస్‌ను TSCOP యాప్‌కు అనుసంధానించినట్లు అయన వెల్లడించారు.

యాప్‌లో ఇప్పటి వరకు లక్ష మంది పాతనేరస్తుల......
ఈ యాప్‌లో ఇప్పటి వరకు లక్ష మంది పాతనేరస్తుల ఫొటోలు, అదృశ్యమైన వారి ఫొటోలు, దేశవ్యాప్తంగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఫొటోలు అందుబాటులోకి తీసుకొచ్చారు. CCTNS ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నిందితుల ఫొటోలను సైతం చెక్ చేసుకునే సౌకర్యం ఇందులో కల్పించారు.

ఫొటోను తీసుకొని యాప్‌లో సర్వర్‌కు కనెక్ట్ చేస్తే......
తనిఖీ చేసేటప్పుడు ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తి దొరికితే సంబంధిత వ్యక్తి ఫొటోను తీసుకొని యాప్‌లో సర్వర్‌కు కనెక్ట్ చేస్తే 30 సెకన్లలో ఆ వ్యక్తి పాతనేరస్తుడైనా లేక అదృశ్యమైన వ్యక్తి అయినా వెంటనే తెలిసిపోతుంది.కాగా ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల్లోని నేరస్తుల ఫొటోలు, దర్యాప్తు సంస్థల మోస్ట్‌వాంటెడ్, అరెస్ట్‌చేసిన వారి ఫొటోలు ఎప్పటికప్పుడు TSCOP యాప్ లో అప్‌డేట్ అవుతుంటాయి.

సిస్టమ్‌ను ఆధారాలుగా పేర్కొనలేమని.....
అయితే ఈ టెక్నాలజీ ద్వారా గుర్తించిన నిందితుల చార్జిషీట్ దాఖలులో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఆధారాలుగా పేర్కొనలేమని డీజీపీ మహేందర్‌రెడ్డి గారు తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా......
దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్న క్రెడిట్ తెలంగాణ పోలీసులకు దక్కనుంది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన.....
అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన kiki చాలెంజ్‌పై డీజీపీ మహేందర్‌రెడ్డి గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి చాలెంజ్‌ను స్వీకరించిన వారి పై కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని అయన హెచ్చరించారు.

kiki చాలెంజ్ అంటే ఏమిటి....
kiki చాలెంజ్ అనేది ప్రాథమికంగా ఒక పాటకు డాన్సు చేయడం. అయితే, అది మామూలుగా అయితే కిక్కేముంటుంది? కదులుతున్న కారులోంచి తలుపు తీసుకుని కిందకు దిగుతారు. కారు మ్యూజిక్ ప్లేయర్ లోంచి డ్రేక్ పాడిన ఆల్బం ‘కీకీ డూ యూ లవ్ మీ ఆర్ యూ ఎవాయిడింగ్' అనే పాట మోగుతుంటుంది. దానికి కింద ఉన్నవాళ్లు డాన్సు చేస్తూ ముందుకు కదులుతుంటారు. కారు కూడా నెమ్మదిగా కదులుతుంటుంది. కారు నడిపేవాళ్లు తమ ఫోన్ లో దాన్ని వీడియో తీస్తారు.


Click it and Unblock the Notifications








