తెలంగాణ పోలీస్ యాప్ సహాయంతో నాలుగేళ్ళ తరువాత బాలిక ఆచూకీ ఎలాగో తెలుసా ?
అధునాతన టెక్నాలజీతో పలు కీలక కేసులను చాకచాక్యంగా పరిష్కరిస్తూ తెలంగాణ పోలీసులు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
అధునాతన టెక్నాలజీతో పలు కీలక కేసులను చాకచాక్యంగా పరిష్కరిస్తూ తెలంగాణ పోలీసులు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఇటీవలే ఫెషియల్ రికగ్నైజేషన్ టూల్ సహాయంతో తప్పిపోయిన వారిని సొంతవారి చెంతకు చేరుస్తున్న తెలంగాణ పోలీసులు మరో కేసును విజయవంతంగా చేధించారు. తాజాగా మతిస్థిమితం లేని ఓ బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ విషయాన్ని మహిళా భద్రత విభాగం చీఫ్ స్వాతి లక్రా ట్విటర్ ద్వారా వెల్లడించారు.ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే

2014లో బోడా రమా దేవి అనే మతిస్థిమితం లేని ఓ బాలిక....
2014లో బోడా రమా దేవి అనే మతిస్థిమితం లేని ఓ బాలిక ఇంట్లో నుంచి తప్పిపోయింది. తన తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఇల్లు ఖాళీగా ఉన్నందున, ఆమె బయటికి వెళ్ళిపోయింది అయితే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్లలేకపోయింది.

ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు...
ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు కాని ఆ బాలికను గుర్తించలేకపోయారు .అప్పటి నుంచి ఆమెను ఘట్‌కేసర్‌లోని చైల్డ్ హోమ్‌లో ఉంచారు.

తాజాగా ఫెషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ తో....
తాజాగా ఫెషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ తో ఆ బాలిక వివరాలు సేకరించే ప్రయత్నం చేసిన పోలీసులు అందులో విజయం సాధించారు. ఆ బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

తప్పి పోయిన వాళ్ళు కనిపించినప్పుడు వారిని దగ్గర లో...
ఇప్పుడు ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది అందువల్ల మీకు ఎవరైనా తప్పి పోయిన వాళ్ళు కనిపించినప్పుడు వారిని దగ్గర లో ఉన్న మీ సేవ కు తీసుకొని వెళ్లి ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయించండి వారి డీటెయిల్స్ లభిస్తాయి. తరువాత మీరు పోలీసులుకు చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








