పోగొట్టుకున్న ఫోన్‌లను తిరిగి బాధితులకు అప్పగిస్తున్న తెలంగాణ పోలీస్.. ఎలా సాధ్యమవుతోంది..?
మొబైల్ దొంగిలించబడినా లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నా.. ఆ ఫోన్ మళ్లీ వియోగదారుడికి చేరడం చాలా కష్టం. అంతేకాకుండా ఫోన్ సహా అందులోకి డేటా కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణ పోలీస్ మాత్రం ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ తరహా ఫోన్ల ను రికవరీ చేస్తోంది. అంతేకాకుండా ఫోన్‌ల రికవరీలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నట్లు డీజీపీ కార్యాలయం (Telangana Police) ప్రకటన విడుదల చేసింది. 206 రోజుల్లో 21,193 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు తెలిపింది.
కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ 2023 మే 17 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విభాగానికి తెలంగాణ నుంచి సీఐడీ అదనపు డీజీ శిఖాగోయల్ నోడల్ అధికారిగా ఉన్నారు. జనవరి 1 నుంచి జులై 25 వరకు 21,193 ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.

ఈ వెబ్‌సైట్‌లలో ఫిర్యాదు చేయండి : పోగొట్టుకున్న ఫోన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ (CEIR) లో నమోదు చేస్తారు. ఈ ఫోన్‌ను ఎవరైనా వినియోగించేందుకు ప్రయత్నం చేస్తే వారిని ట్రాక్ చేసి, ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటారు. అనంతరం బాధితులకు అందిస్తారు. ఫోన్ పోగుట్టుకున్నప్పుడు www.tspolice.gov.in లేదా www.ceir.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
తెలంగాణలోని 780 పోలీస్ స్టేషన్ లలో ఈ CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు సీఐడీ అదనపు డీజీ శిఖా గోయల్ వెల్లడించారు. ఈ వివరాలను సీఐడీ రాష్ట్ర కార్యాలయం నుంచి పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. తొలి దశలో పైలెట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో ఈ వ్యవస్థ పనిచేస్తోందని చెప్పారు.
గత వారంలోనే 1000 కి పైగా మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసినట్లు సీఐడీ అదనపు డీజీ శిఖా గోయల్ తెలిపారు. సగటున రోజుకు 82 ఫోన్‌లను రికవరీ చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గరిష్ఠంగా 3808, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2174, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2030 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు.
ఫోన్ పోగొట్టుకున్న బాధితులు నేరుగా CEIR పోర్టల్ లేదా తెలంగాణ పోలీస్ వెబ్‌ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అందుకు మీ కొన్ని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. IMEI వంటి వివరాలతో మీ ఫోన్‌ను ట్రాక్ చేయనున్నారు. మీ ఫోన్‌ను ఎవరైనా, ఎక్కడ నుంచైనా వినియోగిస్తే.. సంబంధిత అధికారుల ద్వారా వాటిని స్వాధీనం చేసుకుంటారు. అనంతరం బాధితులకు అప్పగిస్తారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








