వాట్సాప్‌తో ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రజలకు అవగాహన ఇస్తున్న తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు..

|

భారతీయ అధికారులు ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌ను విస్తృతంగా ఆదరిస్తున్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మరియు NGOలు కూడా ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి వాట్సాప్‌ వేదికను అధికంగా ఉపయోగిస్తున్నాయి. తాజాగా ఈ కోవలోకి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా చేరారు. ఏదైనా వాహనం మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఉన్న యజమానులకు క్లిష్టమైన సమాచారాన్ని అందించడానికి ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌ను ఉపయోగించాలని హైదరాబాద్‌లోని ట్రాఫిక్ పోలీసు విభాగం నిర్ణయించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్‌ నగరంలో వాహనదారులు ఎవరైనా సరే డ్రైవింగ్‌లో ఉల్లంఘనలకు పాల్పడితే కనుక వాహనదారులకు తెలియజేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. వారు తమ బకాయిలను క్లియర్ చేయకపోతే కనుక డిమాండ్ చేసే పెనాల్టీల గురించి వివరాలను కూడా వాట్సాప్‌లోనే అందిస్తారు. హైదరాబాద్ పోలీసులు వాహన యజమానులకు ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి వాట్సాప్‌ను ఉపయోగించడానికి ముందుగా సాధారణ టెక్స్ట్‌లను ఉపయోగించారు. తెలంగాణ టుడే నివేదిక ప్రకారం రవాణా శాఖ ద్వారా ఫోన్ నంబర్లు మరియు ఇంటి అడ్రసులకు యాక్సెస్ అందించబడింది. ఈ డేటాను ఉపయోగించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ అప్లికేషన్‌లో ఉల్లంఘన వివరాలను పంపుతారు.

8K వీడియో స్ట్రీమింగ్ కోసం అనువైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు...8K వీడియో స్ట్రీమింగ్ కోసం అనువైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు...

వాహనదారులు

వాహనదారులు డ్రైవింగ్‌లో చేసే అన్ని రకాల అన్ని ఉల్లంఘనల యొక్క చలాన్‌లను పోస్ట్ మరియు మెసేజ్ ద్వారా పంపడానికి ట్రాఫిక్ పోలీసులు వారి కంట్రోల్ రూమ్‌ను ఉపయోగిస్తారు. పోలీసు సిబ్బంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వెబ్‌సైట్‌లో ఇ-చలాన్ వివరాలను ఉల్లంఘన మరియు జరిమానాలతో పాటు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారు. ట్రాఫిక్ పోలీసులు వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత వారు తాజా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబందించిన జరిమానాలను సంబంధిత వినియోగదారులకు మెసేజ్ రూపంలో పంపుతారు. అలాగే వారు వినియోగదారులకు పోస్టల్ చలాన్ కూడా పంపుతారు.

వాట్సాప్
 

వినియోగదారులు ఈ క్లిష్టమైన సమాచారాన్ని స్వీకరించగల మాధ్యమాలలో వాట్సాప్ కూడా తాజాగా చోటు దక్కించుకున్నది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో చలాన్‌ను చెల్లించడం గురించిన వివరాలను కూడా పొందుతారు. ఆన్‌లైన్‌ మార్గాన్ని ఎంచుకోకపోతే కనుక వారు ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్‌లో తమ యొక్క చలాన్‌ను చెల్లించవచ్చు. "మేము ఇమెయిల్ ద్వారా చలానా యొక్క వివరాలను తెలియజేయాలని ప్లాన్ చేస్తున్నాము అయితే వాహన యజమానులందరికీ ఇమెయిల్ అకౌంటులు లేనందున వాట్సాప్ ని వినియోగిస్తున్నాము అని సీనియర్ అధికారి తెలిపారు."

చలాన్‌లు

ఆన్‌లైన్ ప్రపంచంలో చలాన్‌లు చెల్లించడానికి వివిధ మాధ్యమాలలో అనేక రకాల పద్ధతులు విస్తరించినప్పటికీ సరైన సమయంలో అవసరమైన వివరాలను పొందడంలో కొంతమంది వినియోగదారులు విఫలమవుతూ ఉంటారు. అటువంటి వినియోగదారులకు సరైన వివరాలను అందించడానికి మరియు వాహనదారుల నుండి పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను వసూలు చేయడానికి ట్రాఫిక్ పోలీసు విభాగం ప్రత్యేక డ్రైవ్‌లను కూడా నిర్వహిస్తోంది. సకాలంలో చలాన్‌ల చెల్లింపును ప్రోత్సహించడానికి పోలీసు శాఖ ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌లను కూడా ఉపయోగిస్తుంది.

Best Mobiles in India

English summary
Telangana State Traffic Police Using Whatsapp to Educating People on Traffic Violations

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X