Home
News

IPL 2020ను ఉచితంగా చూడటానికి టెల్కోల ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...

కరోనా కారణంగా ఇండియాలో మార్చి నెలలో లాక్ డౌన్ మొదలయింది. దాదాపుగా 5 నెలల తరువాత లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఇప్పుడు జనాలు ఫ్రీగా తిరగగలుగుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్నందున క్రికెట్ అభిమానులకు ఒక పండుగ వాతావరణం ముందుకు వచ్చినట్లు అయింది.

IPL 2020 13వ సీజన్

IPL 2020 13వ సీజన్

IPL యొక్క 13వ సీజన్ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ముంబై ఇండియన్ (ఎంఐ) మధ్య అబుదాబి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 7:30 PM IST నుండి జరుగుతుంది. మీరు ఈ మ్యాచ్ ను ఉచితంగా ఎలా చూడాలి అని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఉపయోగిస్తున్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లతో చూడవచ్చు. రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ రెండూ తన వినియోగదారులకు డిస్నీ + హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ ను తన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా అందిస్తున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

IPL 2020 ను ఉచితంగా చూడటానికి జియో యొక్క ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు

IPL 2020 ను ఉచితంగా చూడటానికి జియో యొక్క ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో తన వినియోగదారులకు డిస్నీ + హాట్‌స్టార్ విఐపి యొక్క OTT ప్రయోజనంను మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో పుష్కలంగా అందిస్తున్నాయి. ఇవి ఐపిఎల్‌ను ప్రసారం చేయడంలో మీకు సహాయపడతాయి. జియో కొద్ది రోజుల క్రితం ప్రీపెయిడ్ ప్లాన్‌లను జియో క్రికెట్ కేటగిరీ కింద విడుదల చేసింది. 56 రోజుల చెల్లుబాటుతో రూ.499 ధర వద్ద లభించే జియో క్రికెట్ ప్యాక్ ఎటువంటి SMS లేదా వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని అందించదు కానీ మీకు రోజువారీ 1.5GB డేటాను అందిస్తుంది. దానితో పాటు ఒక సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ విఐపి యొక్క చందాను ఉచిత ప్రయోజనాలలో చేర్చబడిన జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ చందాను అందిస్తుంది.

IPL 2020 కోసం జియో రూ.777 రీఛార్జ్ ప్లాన్‌

IPL 2020 కోసం జియో రూ.777 రీఛార్జ్ ప్లాన్‌

ఐపిఎల్‌ను ఉచితంగా చూడటానికి జియో యొక్క రూ.777 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 84 రోజుల చెల్లుబాటుతో రోజువారి 1.5GB డేటా ప్రయోజనంతో పాటు 5GB బోనస్ డేటాను కూడా అదనంగా అందిస్తుంది. ఇది జియో-టు-నాన్ జియో కాలింగ్ కోసం 3,000 FUP నిమిషాలతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ ప్లాన్ జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ చందాతో పాటు డిస్నీ + హాట్స్టార్ VIP చందాను ఒక సంవత్సర చెల్లుబాటు కాలానికి ఉచితంగా కూడా అందిస్తుంది.

IPL 2020 ను ఉచితంగా చూడటానికి ఎయిర్‌టెల్ యొక్క ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు

IPL 2020 ను ఉచితంగా చూడటానికి ఎయిర్‌టెల్ యొక్క ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ వినియోగదారులు కూడా ఐపిఎల్ 2020 ను ఉచితంగా చూడటానికి ఎయిర్‌టెల్ అందించే ప్లాన్‌లలో 599 రూపాయల ప్లాన్‌ ఒకటి. ఇది 56 రోజుల చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. దానితో పాటు కస్టమర్కు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలు కూడా అదనంగా లభిస్తాయి. ఈ ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్ విఐపి యొక్క OTT ప్రయోజనంను ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి ఉచితంగా అందిస్తుంది కాబట్టి మీరు ఈ ప్లాన్‌తో ఐపిఎల్‌ను హాయిగా చూడవచ్చు.

IPL 2020 కోసం ఎయిర్‌టెల్ లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌

IPL 2020 కోసం ఎయిర్‌టెల్ లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌

ఐపిఎల్ 2020 ను ఉచితంగా చూడటానికి ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎంచుకోగల తదుపరి ప్లాన్ రూ.2,698. ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటాను 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. మీరు దీర్ఘకాలిక యాక్సిస్ తో ఒక ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మంచి ఎంపిక అవుతుంది. ఇది రోజుకు 100 ఎస్ఎంఎస్ తో పాటు ఉచిత వాయిస్ కాలింగ్ మరియు డిస్నీ + హాట్స్టార్ విఐపి యొక్క ఉచిత చందాను కూడా అందిస్తుంది, తద్వారా మీరు ఐపిఎల్ 2020 ను ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా చూడవచ్చు.

Best Mobiles in India

English summary
Telco's Best Prepaid Plans to Watch IPL 2020 at Free of Cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X