కుంటిసాకులు చెప్పకండి, టెలికాం దిగ్గజాలను ఆడేసుకున్నకేంద్రం !
ఇప్పటిదాకా కాల్ డ్రాప్స్ పై కుంటి సాకులు చెబుతున్నారని ఇకపై అలాంటి సాకులు చెప్పే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని టెలికాం దిగ్గజాలకు కేంద్రం గట్టిగా నొక్కి చెప్పింది.
ఇప్పటిదాకా కాల్ డ్రాప్స్ పై కుంటి సాకులు చెబుతున్నారని ఇకపై అలాంటి సాకులు చెప్పే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని టెలికాం దిగ్గజాలకు కేంద్రం గట్టిగా నొక్కి చెప్పింది. వినియోగదారులను ఇబ్బందిపెడుతున్న కాల్ డ్రాప్స్ సమస్యపై టెలికాం ఆపరేటర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు టెలికాం శాఖ (డాట్) సెక్రటరీ అరుణ సుందరరాజన్ మాట్లాడుతూ ఈ సమస్యపై మీరు ఎటువంటి చ్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని ఆమె పరోక్షంగా తెలిపారు.

కాల్ సరిగా కనెక్ట్ కాక..
వినియోగదారులు ఓ నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు కాల్ చేయాలంటే ప్రధానంగా ఎదుర్కునే సమస్య కాల్ డ్రాప్ సమస్య. కాల్ సరిగా కనెక్ట్ కాక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంపైనే కేంద్రం సీరియస్ గా స్పందించింది.

టెలికాం శాఖ (డాట్) సెక్రటరీ అరుణ సుందరరాజన్
మొబైల్ టవర్ల ఏర్పాటులో ఇబ్బందులున్నాయనో లేక మరొకటో సాకులు చెప్పొద్దని తెగసి చెప్పింది. కేంద్రం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నది టెలికాం శాఖ (డాట్) సెక్రటరీ అరుణ సుందరరాజన్ అన్నారు.

ఇలాగే కొనసాగడానికి వీల్లేదని..
డ్రాప్స్ సమస్య ఇలాగే కొనసాగడానికి వీల్లేదని దిద్దుబాటు చర్యలు తీసుకోక తప్పదని, ఈ విషయం పరిశ్రమకు స్పష్టం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆమె తెలిపారు.

జనవరి 21 న ట్రాయ్ నివేదిక
కాల్ డ్రాప్ ఫార్ములా ఆధారిత మొబైల్ సేవల నాణ్యతపై జనవరి 21 న టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నివేదిక అందగానే పరిశ్రమ వర్గాలతో డాట్ భేటీ కానున్నట్లు అరుణ వెల్లడించింది. ప్రజల వ్యతిరేకత కారణంగా మొబైల్ ఆపరేటర్లు కొన్ని చోట్ల టవర్ల ఏర్పాటులో సమస్యలు ఎదుర్కోవటానికి నిజమే అయినా ... కాల్ డ్రాప్స్కి అది సాకుగా చూపరాదని అరుణ స్పష్టంచేసింది.

మొబైల్ కాల్స్ అంతరాయాలను ..
మొబైల్ కాల్స్ అంతరాయాలను నిరోధించేలా ట్రాయ్ తెచ్చిన నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చాయి. ఆ తరువాత తొలిసారిగా డిసెంబరు త్రైమాసిక పరిణామాలపై ట్రాయ్ త్వరలో నివేదిక ఇవ్వనుంది. కొత్త నిబంధనల ప్రకారం మొబైల్ టవర్ల స్థాయిలో కాల్స్ నాణ్యతను పరిశీలించనున్నారు.

రూ .10 లక్షల దాకా జరిమానా..
ప్రమాణాలు పాటించకపోతే టెల్కోల పై గరిష్టంగా రూ .10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు. ఈ సమస్యను అధిగమించేందుకు అలాగే టెల్కోలు తమ ఇనప్రాస్ట్రక్చర్ ని మెరుగుపరుచుకునేందుకు మరింతగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.


Click it and Unblock the Notifications








