ఉచిత ఆఫర్ల కోసం చూస్తున్నారా..?

Written By:

మీరు ఉచిత ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా...జియో లాగా మరో టెలికం వస్తే బావుండని అనుకుంటున్నారా..అయితే మీ ఆశలకు ఇకపై గండిపడినట్లే.. టెలికం కంపెనీలు కష్టాలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఉచిత ఆఫర్లకు రాంరాం చెప్పనున్నాయి. ఈ నేపథ్యంలో కనీస ధరలను ఫిక్స్‌ చేయాల్సిందిగా టెలికం ఆపరేటర్లు మార్కెట్‌ రెగ్యులేటరీని ఆశ్రయించాయి.

ఈ వీడియో చూస్తే మొబైల్ ముట్టుకోరు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెలికాం ఆపరేటర్లు

డేటా ,వాయిస్ కాల్స్ రెండింటికీ కనీస ఫ్లోర్ ధరను నిర్ణయించాలని కోరతూ కొన్ని టెలికాం ఆపరేటర్లు భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ను ఆశ్రయించాయి.

కనీస ఫ్లోర్ ధర

దీంతో ట్రాయ్‌ జూలై 21 న 'కనీస ఫ్లోర్ ధర' అంశంపై అన్ని సర్వీసు ప్రొవైడర్ల అభిప్రాయాలు, వాదనలు కోరనుంది. దీంతో ఉచితడేటా, వాయిస్‌ సేవలకు త్వరలోనే ముగింపు పడనుందా అనే ఊహాగానాలు పరిశ్రమ వర్గాల్లో నెలకొన్నాయి.

ఆర్థిక నష్టాలను

పరిశ్రమ ఆర్థిక నష్టాలను, పెరుగుతున్న ఆర్ధిక ఒత్తిడిని నొక్కి చెప్పిన ఐడియా గత నెలలో రెగ్యులేటర్‌ ఇండస్ట్రీ పరిశ్రమలు, అంతర్ మంత్రిత్వ గ్రూపు (ఐఎంజీ) భేటీ సందర్భంగా ఫ్లోర్ ధర నిర్ణయం డిమాండ్‌ను ప్రస్తావించింది.

రిలయన్స్ జియో రాక

టెలికాం సెక్టార్ లోకి రిలయన్స్ జియో రాక మొత్తం ఆర్థిక పరిస్థితినే మార్చి వేసింది. ఉచిత డేటా, వాయిస్ కాల్స్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి ఇతర దిగ్గజ కంపెనీలను పలు ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వాటి లాభాలను, ఆదాయాలను భారీగా ప్రభావితం చేసింది.

ప్రధానంగా టెలికాం మేజర్‌ భారతీఎయిర్‌టెల్‌ను

అంతేకాదు ఆయా కంపెనీల మొత్తం టారిఫ్‌ ప్లాన్లలో పెను మార్పులకు నాంది పలికింది. ప్రధానంగా టెలికాం మేజర్‌ భారతీఎయిర్‌టెల్‌ను బాగా దెబ్బ కొట్టింది. ఐడియా, వొడాఫోన్‌, ఆర్‌కామ్‌ ఇదే వరుసలో ఉన్న సంగతి తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Telcos ask TRAI to fix floor price for voice call, data Read More At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot