అదే జరిగితే కాల్ రేట్లు డబల్..?

Posted By: Staff

అదే జరిగితే కాల్ రేట్లు డబల్..?

 

టెలికాం రెగ్యులేటరీ అధారటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వైఖరి పట్ల టెల్కోల అసంతృప్తి రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. తాజాగా ట్రాయ్, 2జీ స్పెక్ట్రమ్‌కు నిర్ణియించిన బేస్‌ధర ప్రతిపాదనల పట్ల టెలికం కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. ఈ సిఫారసులు అమలైతే టారిఫ్‌లు 20-25% పెరుగుతాయని మొన్నటిదాకా చెప్పిన టెల్కోలు టారిఫ్‌లు ఏకంగా 100% పెరుగుతాయని హెచ్చరించాయి.

ఈ నేపధ్యంలో టెలికం కంపెనీలు అధినేతలు బుధవారం టెలికాం మంత్రి కపిల్ సిబల్‌, హోంశాఖ మంత్రి పి. చిదంబరంతో సమావేశమయ్యారు. ఈ భేటిలో ట్రాయ్ ప్రతిపాదనలను అమలు చేయరాదని టెల్కోలు కోరినట్లు తెలుస్తోంది. తమ విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోకపోతే, న్యాయపోరాటాన్ని తీవ్రతరం చేయాలని, వేలంలో పాల్గొనరాదని కూడా టెల్కో లు భావిస్తున్నాయి. 2008లో 2జీ స్పెక్ట్రమ్ ధరను దాదాపు రూ.380 కోట్లుగా నిర్ణయించారు. తాజాగా 2జీ స్పెక్ట్రమ్‌కు బేస్ ధరను రూ.3,692 కోట్లుగా ట్రాయ్ ప్రతిపాదించడంతో రభస మొదలైంది.

ప్రీపెయిడ్ యూజర్లే టార్గెట్..?

న్యూఢిల్లీ: దేశంలో 90శాతం పైగా ఉన్న ప్రీపెయిడ్ యూజర్లకు ఇక పై మొబైల్ వినియోగం మరింత భారం కానుంది. మొబైల్ రీచార్జ్ కూపన్ల ప్రాసెసింగ్ ఫీజును 50 శాతానికి పెంచే ప్రతిపాదన పై టెలికం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆమోదముద్ర వేసింది. దింతో రూ.20, అంతకు మించిన టాపప్ వోచర్ల ప్రాసెసింగ్ ఫీజు పై పరిమితి గరిష్టంగా రూ.3కు పెరుగుతుంది. ప్రస్తుతానికి ఇది రూ.2గా ఉంది. రూ.20కంటే తక్కువ విలువ కలిగిన రీచార్జ్ కూపన్‌ల పై ప్రాసెసింగ్ ఫీజు రూ.2గానే ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot