Rs.400 బడ్జెట్‌ ధరలో లాంగ్ టర్మ్ ప్లాన్‌లను అందిస్తున్న టెల్కోలు

|

టెలికాం ఆపరేటర్లు ఈ నెల మొదటిలో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం టారిఫ్ పెంపును ప్రకటించారు. మూడు టెల్కోలు- భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మరియు రిలయన్స్ జియో టారిఫ్ ధరలను 40% కంటే ఎక్కువ పెంచాయి. పునర్విమర్శకు ముందు ఆపరేటర్లు 70 రోజుల చెల్లుబాటు ప్రణాళికను కేవలం 299 రూపాయల ధరలకు అందించేవారు.

లాంగ్ టర్మ్ వాలిడిటీ

ఆ రోజులు పోయినప్పటికీ వినియోగదారులు బడ్జెట్‌లో కొన్ని లాంగ్ టర్మ్ వాలిడిటీ ప్రణాళికలను పొందవచ్చు. ఉదాహరణకు వొడాఫోన్ ఐడియా మరియు రిలయన్స్ జియో 84 రోజుల వాలిడిటీతో వరుసగా రూ.379 మరియు రూ.329 దరల వద్ద దీర్ఘకాలిక ప్లాన్ లను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ అటువంటి ప్లాన్‌ను అందించడం లేదు. ఎయిర్‌టెల్ ఆపరేటర్ నుండి వచ్చిన ఉత్తమ ప్లాన్లలో 399 రూపాయల ప్లాన్ ఉంది. ఇది రీఛార్జ్ చేసిన తేదీ నుండి 56 రోజుల చెల్లుబాటుతో అన్ని ప్రయోజనాలను అందిస్తుంది.

 

కాపీరైట్ క్లెయిమ్ కోసం యూట్యూబ్ లో కొత్త టూల్స్కాపీరైట్ క్లెయిమ్ కోసం యూట్యూబ్ లో కొత్త టూల్స్

ప్రీపెయిడ్ ప్లాన్

పునర్విమర్శ తర్వాత మొత్తం ప్రీపెయిడ్ ప్లాన్ల సంఖ్య తీవ్రంగా వచ్చింది. కాని ఆపరేటర్లు నెమ్మదిగా మొత్తం ప్లాన్లను వారి యొక్క విభాగంలో నుండి మరింత పెంచడానికి కొత్త ప్లాన్ లను జోడిస్తున్నారు. పునర్విమర్శ తర్వాత టెలికాం ఆపరేటర్లు అందిస్తున్న లాంగ్ టర్మ్ ప్లాన్ల యొక్క వాలిడిటీ గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

రైల్వే టికెట్ కోసం రైల్వే టికెట్ కోసం "బుక్ నౌ పే లేటర్" ఫీచర్ ను మొదలెట్టిన IRCTC

రిలయన్స్ జియో ప్లాన్‌లు

రిలయన్స్ జియో ప్లాన్‌లు

రిలయన్స్ జియో రూ .329 మరియు రూ.1,299 దరల వద్ద రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇవి వాటి బడ్జెట్‌పై దీర్ఘకాలిక వాలిడిటీను అందిస్తాయి. రూ.329 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో అందుబాటులోకి వస్తున్నది. అలాగే రూ.1,299 ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇక రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందిస్తున్న ప్రయోజనాల విషయానికొస్తే రిలయన్స్ జియో యొక్క రూ.329 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జియో-టు-జియోకు అపరిమిత వాయిస్ కాల్స్, 3,000 నాన్-జియో నిమిషాలు, 1000 ఎస్ఎంఎస్ లను మరియు మొత్తం కాలానికి 6GB 4G డేటాను అందిస్తుంది. దీని యొక్క మొత్తం చెల్లుబాటు కాలం 84 రోజులు. ఈ ప్లాన్ ద్వారా JioTV, JioCinema వంటి సంస్థ యొక్క ప్రసిద్ధ యాప్ లకు యాక్సిస్ ను ఉచితంగా పొందవచ్చు.

 

Jio VS BSNL న్యూ ఇయర్ ప్లాన్స్... ఈ ఆఫర్ల పోటీలో గెలుపు ఎవరిదీ?Jio VS BSNL న్యూ ఇయర్ ప్లాన్స్... ఈ ఆఫర్ల పోటీలో గెలుపు ఎవరిదీ?

వోడాఫోన్ ప్లాన్‌లు

వోడాఫోన్ ప్లాన్‌లు

లాంగ్ టర్మ్ వాలిడిటీతో బడ్జెట్‌ ధరలో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించే విషయానికి వస్తే వోడాఫోన్ ఈ జాబితాలో అందరి కంటే ముందుగా ఉంటుంది. ప్రస్తుతం 379 రూపాయల ధర వద్ద బడ్జెక్ట్ ధరలో ఒక ప్లాన్ ను అందిస్తున్నది. వోడాఫోన్ ఐడియా యొక్క రూ.379 రీఛార్జ్ ప్లాన్ భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాల్స్, 1000 ఎస్‌ఎంఎస్‌లు మరియు 6GB 2G / 3 జి / 4 జి డేటాను 84 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వొడాఫోన్ వినియోగదారులు 499 రూపాయల విలువైన వోడాఫోన్ ప్లే యాప్ కు ఉచిత యాక్సిస్ ను పొందుతారు. అలాగే ఇది ZEE5 కంటెంట్‌ను కూడా అందిస్తుంది.

 

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం MNP 10 కొత్త నిబంధనలుమొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం MNP 10 కొత్త నిబంధనలు

వోడాఫోన్

తాజా పునర్విమర్శకు ముందు వోడాఫోన్ 70 రోజుల చెల్లుబాటుతో 299 రూపాయలకు చౌకైన టారిఫ్ ప్లాన్‌ను అందించేది. ఇప్పుడు కూడా టెల్కో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను 56 రోజుల చెల్లుబాటుతో రూ.300 ధర కింద అందిస్తున్నది. వోడాఫోన్ నుండి కొత్తగా ప్రారంభించిన రూ .269 రీఛార్జ్ ప్లాన్ ఎటువంటి FUP పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్, 4GB డేటా, 600 SMSలను అందిస్తుంది.

 

 

VoWiFi సర్వీసును షియోమి ఫోన్‌లలో యాక్టివేట్ చేయడం ఎలా?VoWiFi సర్వీసును షియోమి ఫోన్‌లలో యాక్టివేట్ చేయడం ఎలా?

ఎయిర్‌టెల్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ప్లాన్‌లు

చివరగా భారతి ఎయిర్టెల్ విషయానికి వస్తే ఈ జాబితాలో ఇతర రెండు టెల్కోలతో పోలిస్తే తక్కువగా ఆకట్టుకునే ఆపరేటర్లను కలిగి ఉన్నది. ఎయిర్‌టెల్ సంస్థ రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా లాగా రూ .329 లేదా రూ .379 లాంగ్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టలేదు. దీర్ఘకాల చెల్లుబాటుతో ఎయిర్‌టెల్ యొక్క పోర్ట్‌ఫోలియోలో వున్న చౌకైన ప్లాన్ 399 రూపాయల ప్లాన్. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 1.5 జిబి డేటా మరియు 56 రోజుల వ్యవధిలో రోజుకు 100 ఎస్ఎంఎస్ లు. యూజర్లు షా అకాడమీ, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం సభ్యత్వం మరియు ఫాస్టాగ్‌లో రూ .100 క్యాష్‌బ్యాక్‌పై ఉచిత నాలుగు వారాల కోర్సును కూడా పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Telcos Offering Long Term Plans at Budget Price Rs.400

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X