Home
News

టెలికం ఆపర్లేటర్లకు బీబీఎంపీకి మధ్యన ముదురుతున్న కేబుల్ వార్

కర్ణాటక రాజధాని బెంగుళూరులో టెలికకం కేబుల్ వార్ మొదలైనట్లుగా తెలుస్తోంది. బెంగుళూరులో టెలికాం ఆపరేటర్లకు అలాగే బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీకు మధ్య కేబుల్ వ్యవహారంలో వార్ నడుస్తోంది. బెంగుళూరు

కర్ణాటక రాజధాని బెంగుళూరులో టెలికకం కేబుల్ వార్ మొదలైనట్లుగా తెలుస్తోంది. బెంగుళూరులో టెలికాం ఆపరేటర్లకు అలాగే బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీకు మధ్య కేబుల్ వ్యవహారంలో వార్ నడుస్తోంది. బెంగుళూరు వాసులు బయట ఎక్కడంటే అక్కడ పడవేసిన డిజిటల్ కేబుల్స్ మూలంగా కాల్ డ్రాప్స్ , ఇంటర్నెట్ సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో COAI దీనిపపై తీవ్రంగా స్పందించింది.

టెలికం ఆపర్లేటర్లకు బీబీఎంపీకి మధ్యన ముదురుతున్న కేబుల్ వార్

ఈ ఫిర్యాదులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాలని లేకుంటే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని టెలికం ఆపరేటర్లను Bruhat Bengaluru Mahanagara Palike (BBMP)లను హెచ్చరించింది. అయితే దీనిపై ఎవరికి వారు భిన్నంగా స్పందిస్తుండటంతో పరిస్థితి మరింతగా ముదిరినట్లు తెలుస్తోంది.

అనేక సమస్యలు

అనేక సమస్యలు

బెంగుళూరు నగరంలోని Sarjapur Road, Whitefield, Marathahalli, and Bellandur ఏరియాల్లో కుప్పలు తెప్పలుగా కేబుల్ వైర్లు బయటకు విసిరివేయబడి ఉన్నాయి. దీంతో అక్కడ అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అక్కడి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ సర్వీసులు, కాల్ డ్రాప్స్ వంటి సమస్యలు వస్తున్నాయని దీనికి కారణం డిజిటల్ కేబుల్స్ ని ఇలా పడేయడమేనని వారు చెబుతున్నారు.

 

 

 BBMP వాదన

BBMP వాదన

దీనిపై BBMP స్పందిస్తూ మేము బయట ఉన్న కేబుల్స్ మాత్రమే కట్ చేశామని అండర్ గ్రౌండ్ లో ఉన్న వాటిని కట్ చేయలేదని చెబుతోంది. బయట ఉన్న కేబుల్స్ తగ్గించాలని మేము ఎప్పటినుంచో చెబుతున్నప్పటికీ టెలికం కంపెనీలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెబుతోంది. కేబుల్స్ ను అండర్ గ్రౌండ్ లోకి మార్చుకోవాలని చెప్పినప్పటికీ టెల్కోలు వినడం లేదని దీనివల్ల మాకు ఇబ్బందులు ఎదురువతున్నాయని వాదిస్తోంది.

కాయ్ స్పందన

కాయ్ స్పందన

బిబిఎంపీ క్లయిమ్ పై COAI director general Rajan S Mathews స్పందిస్తూ రోడ్ వర్క్ స్టార్టవుతున్నప్పుడు వైర్లు కట్ చేసిన మాట వాస్తవమేనని వర్క్ పూర్తయిన తరువాత వాటిని సరిచేయకుండా అలా వదిలేయడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని తెలిపారు. అయితే వాటిని అండర్ గ్రౌండ్‌లోకి మార్చేందుకు కంపెనీల నుంచి బిబిఎంపి డబుల్ ఫీజు అడిగిందని అందువల్లే ఆలస్యమవుతోందని చెబుతున్నారు. పర్మిషన్ ఇంకా ఇవ్వలేదని రోడ్ వర్క్ పూర్తయితే ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని తెలిపారు.

అండర్ గ్రౌండ్‌లోకి మార్చుకునేందుకు పర్మిషన్

అండర్ గ్రౌండ్‌లోకి మార్చుకునేందుకు పర్మిషన్

మేము పర్మిషన్ ఇవ్వడం లేదనేది అవాస్తవమని గతేడాది కేబుల్స్ ని అండర్ గ్రౌండ్‌లోకి మార్చుకునేందుకు పర్మిషన్ ఇచ్చామని executive engineer (OFC)Dharam Prasad చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తున్నారు. రోడ్ వర్క్ అనేది వారికి ఎటువంటి అడ్డంకి కాదని దానికి దీనికి సంబంధం లేదని కావాలనే వారు ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. డ్రైనేజి పనులు కూడా పూర్తయినప్పటికీ కేబుల్ ఆపరేట్లరు కేబుల్స్ విషయంలో కేర్ తీసుకోలేదని మండిపడ్డారు.

అనధికారికంగా ఉన్నందువల్లే

అనధికారికంగా ఉన్నందువల్లే

స్థానిక మున్సిపల్ బాడీ, టెలికం ప్లేయర్స్ ఇద్దరి మధ్య పేమెంట్ ఇష్యూస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బయట ఉన్న టెలికం కేబుల్స్ తగ్గించాలని, వాటిని అండర్ గ్రౌండ్‌లోకి మార్చుకోవాలని బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) గతేడాది ఆదేశాలు జారీ చేసింది. అయితే, టెలికం ప్రొవైడర్ల వాదన మరోలా ఉంది. రోడ్డు కన్‌స్ట్రక్షన్ వర్క్ కారణంగా ఆ వైర్లు గ్రౌండ్ పైకి వచ్చాయని, వాటికి ఇదివరకే ఫీజు చెల్లించామని చెబుతున్నాయి. బీబీఎంపీ మాత్రం.. అసలు ఆ కేబుల్స్ అనధికారికంగా ఉన్నందువల్లే కట్ చేశామని చెప్పడం గమనార్హం.

తగిన రుసుము చెల్లించి

తగిన రుసుము చెల్లించి

అనధికార కేబుల్స్ కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నామని, కేబుల్స్‌ను రెగ్యులరైజ్ చేసుకోవాలని తాము పలుమార్లు టెలికం కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశామని, నియమ నిబంధనలు పాటించాలని చెప్పామని, కానీ వారు (టెలికం కంపెనీలు) తమ హెచ్చరికలను లెక్క చేయలేదని, దీంతో తాము వాటిని కట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తమకు అంతకుమించిన ఆప్షన్ లేదని ఓ అధికారి అన్నారు. టెలికం కంపెనీలకు ఇప్పటికి కూడా అవకాశముందని, వారు తగిన రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. చాలా కేబుల్స్ ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. ఇవి ప్రమాదాలకు కారణం అయ్యాయని చెప్పారు

More from GizBot

Best Mobiles in India

English summary
Telecom companies, BBMP lock horns over cutting overhead cables
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X