ఇండియా ఉద్యోగులను రోడ్డు మీదకు తెచ్చిన చైనా కంపెనీ !

By Hazarath
|

చైనా దిగ్గజం హువాయి ఇండియాలోని తన ఉద్యోగులను ఇంటికి సాగనంపేసింది. మల్టినేషనల్‌ నెట్‌వర్కింగ్‌, టెలికమ్యూనికేషన్స్‌ ఈక్విప్‌మెంట్‌ అండ్‌ సర్వీసెస్‌ రంగంలో దూసుకుపోతున్న హువాయికి టెలికాం రంగంలో జరుగుతున్న పరిణామాలు కొంచెం ఆందోళనను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విలీన కన్సాలిడేషన్‌తో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటోంది.

 

గిజ్‌బాట్ కాంటెస్ట్‌లో పాల్గొనండి, Honor 7X గెలుపొందండి !గిజ్‌బాట్ కాంటెస్ట్‌లో పాల్గొనండి, Honor 7X గెలుపొందండి !

 విలీన కన్సాలిడేషన్‌తో

విలీన కన్సాలిడేషన్‌తో

టెలికాం ఇండస్ట్రీలో నెలకొన్న విలీన కన్సాలిడేషన్‌తో హువాయి తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించేసింది.పనితీరు, నెట్‌వర్క్‌ నిలిపివేత, టెలికాం వ్యాపారాలు పడిపోవడం వంటి ఆధారంగా ఉద్యోగులను కంపెనీని వీడాలని చెప్పినట్టు ఓ అధికారి చెప్పారు.

వొడాఫోన్‌-ఐడియా విలీనం..

వొడాఫోన్‌-ఐడియా విలీనం..

ముఖ్యంగా వొడాఫోన్‌-ఐడియా విలీనం, టెలికాం రంగ వ్యాప్తంగా ఆర్థిక ఒత్తిడి నెలకొనడం హువావే ఉద్యోగులపై ప్రతికూల ప్రభావాన్ని చూపించినట్టు కంపెనీ వర్గాలు చెప్పాయి.

కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ..

కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ..

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఉద్యోగులు కోతను చూస్తున్నామని, సుమారు 30 శాతం మంది ఉద్యోగులు కంపెనీ నుంచి బయటకి వెళ్లిపోయారని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కొంతమంది ఉద్యోగులను ఫీల్డ్‌ టీమ్స్‌లో మళ్లీ నియమించుకున్నట్టు తెలిసింది.

మంచి పనితీరు కనబర్చే వారికి ..
 

మంచి పనితీరు కనబర్చే వారికి ..

మంచి పనితీరు కనబర్చే వారికి తాము అన్ని వనరులు సమకూరుస్తామని, అదే సమయంలో పనిచేయని వారిపై కూడా చర్యలుంటాయని హువావే ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జే చెన్‌ తెలిపారు.

జియో మార్కెట్‌లోకి ప్రవేశించిన అనంతరం..

జియో మార్కెట్‌లోకి ప్రవేశించిన అనంతరం..

రిలయన్స్‌ జియో మార్కెట్‌లోకి ప్రవేశించిన అనంతరం టెలికాం పరిశ్రమ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వొడాఫోన్‌, ఐడియాలు విలీనమవుతున్నాయి. ఈ విలీనం అనంతరం తమకు మరింత స్పష్టత రావాల్సి ఉందని చెన్‌ చెప్పారు.

ఉద్యోగుల కోత విధించిన అనంతరం..

ఉద్యోగుల కోత విధించిన అనంతరం..

కాగా ఉద్యోగుల కోత విధించిన అనంతరం సేల్స్‌, సప్లయ్‌ చైన్‌, ఆర్‌ అండ్‌ డీ, నెట్‌వర్క్‌ ఇంజనీరింగ్‌ ఫంక్షన్స్‌ వ్యాప్తగా 8వేల మందికి పైగా ఉద్యోగులున్నారు.

Best Mobiles in India

English summary
Telecom jobs loss: Huawei India cuts down workforce by 30% More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X