ఫోన్ నంబర్లు వాడుతున్నారా.. రీఛార్జీతోపాటు వినియోగానికి కూడా ఛార్జీలు.. ట్రాయ్ కీలక ప్రతిపాదనలు.?
టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తాజాగా కీలక ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ మరియు ల్యాండ్ లైన్ నంబర్లకు ఫీజు వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిస్తోంది. ఫోన్ నంబర్లను విలువైన వనరులుగా భావిస్తున్న ట్రాయ్.. ఛార్జీలు విధించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత టెలికాం సంస్థల నుంచి ఛార్జీలు వసూలు చేయాలని ట్రాయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసుకొనే అవకాశం టెలికాం ఆపరేటర్లకు కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై ట్రాయ్ అందరి అభిప్రాయాలను కోరింది. ఇందుకు సంబంధించిన చర్చా పత్రాలను విడుదల చేసింది. అయితే ఈ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారనే అంశంపై ప్రస్తుతానికి ఎటువంటి స్పష్టత లేదు. సిమ్ కొనుగోలు సమయంలో లేదా సంవత్సరానికి ఫీజు వసూలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

గత సంవత్సరం డిసెంబర్‌లో అమల్లోకి వచ్చిన టెలికాం కొత్త చట్టం ప్రకారం ఫోన్ నంబర్లకు ఛార్జీలు వసూలు చేసుకొనే అవకాశం కలిగింది. దీని ఆధారంగా స్పెక్ట్రమ్ తరహాలో ఫోన్, ల్యాండ్‌లైన్ నంబర్లకు సంబంధించి యాజమాన్య హక్కులు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటాయి. వాటిని వినియోగానికి సంబంధించిన హక్కులు మాత్రమే టెలికాం సంస్థలకు ఉండనున్నాయి.
దీంతోపాటు ఎక్కువ కాలం పాటు రీఛార్జీ చేయని నంబర్లను రద్దు చేయకుండా కొన్ని టెలికాం సంస్థలు వేచి చూస్తున్నాయి. అటువంటి సంస్థలకు జరిమానా విధించాలని ట్రాయ్ భావిస్తోంది. వినియోగదారులను తగ్గకుండా ఉండేందుకు అటువంటి నంబర్‌లను రద్దు చేయడం లేదని ట్రాయ్ భావిస్తోంది.
సింగపూర్, బెల్జియం, కువైట్, బ్రిటన్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్, స్విట్జర్లాంట్, పోలాండ్, డెన్మార్క్, నైజీరియా వంటి దేశాలు ఇప్పటికే ఫోన్ నంబర్‌లు, ల్యాండ్‌లైన్ నంబర్లపై ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే భారత్‌లో ట్రాయ్ ప్రతిపాదనకు టెలికాం సంస్థలు ఎలా స్పందిస్తాయే వేచిచూడాల్సి ఉంది.
** ఇటీవల కాలంలో స్పామ్ కాల్స్ సమస్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఈ తరహా కాల్స్ నియంత్రణ పైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే గత నెలలో ట్రాయ్ కొన్ని మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిసింది. రిజిస్టర్ కాని మరియు అవసరం లేని కాల్స్ నియంత్రణకు సంబంధించిన వివరాలను ఇందులో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఇటువంటి స్పామ్ కాల్స్ కొన్ని బ్యాంకులు, జీవిత బీమా సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలు సహా ఇతర ప్రమోషనల్ కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఈ తరహా కాల్స్ ద్వారా ప్రయోజనం పొందుతున్న సంస్థలే వీటికి బాధ్యత వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా సంస్థ వీటిని ఉల్లంఘిస్తే జరిమానాలు కూడా విధించనున్నారని తెలుస్తోంది.
ఈ కాల్స్‌ను గుర్తించేందుకు వీలుగా మూడు వేర్వేరు సర్వీస్ నంబర్ సిరీస్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కమ్యూనికేషన్ కోసం 111, సర్వీస్ కాల్స్ కోసం 160, మార్కెటింగ్ కాల్స్ కోసం 140 నంబర్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications