మీకోసం 30 లక్షల ఉద్యోగాలు రెడీ !

Written By:

టెలికం ఇండస్ట్రీ మీ కోసం 30 లక్షల ఉద్యోగాలను రెడీ చేస్తోంది. నేడు టెల్కోల మధ్య తీవ్ర పోటీ ఉన్న తరుణంలో ఈ రంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. అయినప్పటికీ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రెడీ అయిందని, 2018 నాటికి 30 లక్షల ఉద్యోగాలు టెలికం రంగం కల్పించగలదని అసోచాం, కేపీఎంజీ ఒక సంయుక్త అధ్యయనంలో అంచనా వేశాయి.

టెల్కోలకు చుక్కలు, కాల్‌కట్ అయితే రూ. 10 లక్షల జరిమానా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4జీ టెక్నాలజీ

4జీ టెక్నాలజీ విస్తృతి చెందడం, డేటా వినియోగం పెరుగుతుండటం, డిజిటల్‌ వాలెట్లు.. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నట్లు అవి వివరించాయి.

ప్రతికూల ప్రభావం చూపుతున్న తరుణంలో

పోటీతో టారిఫ్‌లు పడిపోయి, ఆపరేటర్ల ఆదాయాలు.. లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపుతున్న తరుణంలో అసోచాం-కేపీఎంజీ ఆశావహ నివేదికను రూపొందించడం గమనార్హం.

యూజర్‌పై సగటు ఆదాయం తగ్గుతున్నప్పటికీ

యూజర్‌పై సగటు ఆదాయం తగ్గుతున్నప్పటికీ... టెలికం రంగం మెరుగ్గానే రాణించగలిగే అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీపై పెట్టుబడులు

పోటీని దీటుగా ఎదుర్కొనేందుకు కంపెనీలు తప్పనిసరిగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టక తప్పని పరిస్థితి నెలకొందని వివరించింది.

 

టెలికం రంగంలో

టెలికం రంగంలో ప్రస్తుతమున్న మానవ వనరులు.. సంఖ్యాపరంగాను, నైపుణ్యాలపరంగానూ రాబోయే డిమాండ్‌కు సరిపోకపోవచ్చని నివేదిక తెలిపింది.

2020 నాటికి

2020 నాటికి మొత్తం సిమ్‌ కనెక్షన్ల సంఖ్య ప్రస్తుతమున్న 110 కోట్ల నుంచి 140 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Telecom sector to generate 30 lakh jobs by 2018: Study Read more At gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting