పాపం.. పొట్టనపెట్టుకుంటున్నాయ్!

Posted By: Prashanth

పాపం.. పొట్టనపెట్టుకుంటున్నాయ్!

 

వాషింగ్‌టన్‌: కమ్యూనికేషన్ వ్యవస్ధను మరింత బలోపేతం చెయ్యటంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పబడిన టెలికాం టవర్లు స్వేచ్ఛగా విహరించే పక్షులకు ప్రాణసంకటంగా మారుతున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ టవర్ల మూలంగా యేటా సుమారుగా 70 లక్షల విహాంగాలు మృత్యువాతపడుతున్నాయని అధయనకర్తలు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, కెనడాల నుంచి మధ్య, దక్షిణ అమెరికాకు వలస వెళ్ళే పక్షులు వీటి బారిన పడుతున్నాయని పరిశోధకుల బృందం స్పష్టం చేసింది.

ఈ పరిశోధనను సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీలోని స్పేషియల్‌ సైన్సెస్‌ ఇన్సిట్యూట్‌కు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ట్రావిస్‌ లాంగ్‌కోర్‌ నేతృత్వం వహించారు. ఈ రెండు దేశాల్లో ఉన్న 84000 టెలికాం టవర్లలో కొన్ని 2000 అడుగుల ఎత్తును మించి ఉన్నాయి.

అయితే పక్షులు ఈ టవర్లమీదుగా ఎగిరే సమయంలో వీటిలో చిక్కుకొని అవి చనిపోతుండటంతోపాటు, కొన్ని నిర్మాణాలను నిలబడేలా చేసే సన్నని తీగల వల్ల కూడా పక్షులు మృత్యువాత పడుతున్నాయని ట్రావిస్‌ తెలిపారు. పొడవైన టవర్లు పక్షులకు ప్రాణసంకటంగా పరిణమించాయని లాంగ్‌కోర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting