ఎక్కువ సిమ్ కార్డులుంటే జైలు శిక్ష, జరిమానా.. అమల్లోకి వచ్చిన టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో కీలక నిబంధనలు!
టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 (Telecommunications Act 2023) దేశంలో జూన్ 26 నుంచి అమల్లోకి వచ్చింది. 1885 నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1933 నాటి ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టం స్థానంలో ఈ కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చట్టంలోని సెక్షన్‌లు 1, 2, 10 నుంచి 30, 42 నుంచి 44, 46, 47, 50 నుంచి 58, 61, 62 వరకు నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త చట్టం టెలికాం రంగంలో గణనీయమైన మార్పులు తీసుకొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం ప్రభుత్వానికి కీలక అధికారాలను కట్టబెట్టింది. భద్రత, నేరాల నియంత్రణ, పబ్లిక్ ఆర్డర్ సహా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో టెలికాం నెట్‌వర్క్ లేదా సేవలను తన నియంత్రణంలోకి తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు వినియోగదారుల ఫిర్యాదుల కోసం ప్రత్యేకమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తుంది.

ఈ కొత్త టెలికాం చట్టంలో సిమ్ కార్డుల జారీపై కఠిన నిబంధనలున్నాయి. ఒక గుర్తింపు కార్డుపై 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే రూ.50000 జరిమానా విధించనున్నారు. రెండోసారి కూడా అదే స్థాయిలో ఉంటే రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. దీంతోపాటు బయోమెట్రిక్ ద్వారానే కొత్త సిమ్ కార్డులు జారీచేస్తారు.
దీంతోపాటు నకిలీ సిమ్ కార్డులు కొనుగోలు చేసినా, విక్రయించినా, వినియోగించినా మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిమ్ కార్డు ద్వారా మోసాలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష మరియు జరిమానా విధించనున్నారు.
ఇందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి .. : ఏదైనా టెలికాం సంస్థ నెట్‌వర్క్ ను ఏర్పాటు చేయాలన్నా లేదా సర్వీసులు అందించాలన్నా లేదా రేడియా పరికరాలు ఉపయోగించాలన్నా.. ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందులో జాతీయ భద్రతతోపాటు భారతీయ సాంకేతికతను ప్రోత్సహిస్తుంది.
ఈ కొత్త టెలికాం చట్టం 2023 ప్రకారం యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ గ్రామీణ, మారుమూల మరియు పట్టణ ప్రాంతాల్లో సేవలకు విస్తరిస్తుంది. దీంతోపాటు ఈ కొత్త టెలికమ్యూనికేషన్స్ చట్టం.. టెలికాం సేవలు, సాంకేతికత పరిశోధన, అభివృద్ధికి నిధులు సమకూరుస్తుంది. రిమోట్ ఏరియాల్లో అవసరమైన టెలికాం సర్వీసులకు యాక్సెస్ ఉండేలా చూస్తుంది.
కొత్త టెలికాం కమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం యూజర్లకు మెరుగైన భద్రత, నాణ్యమైన సేవలను అందిస్తుంది. మరియు వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు అవాంచిత వాణిజ్య కమ్యూనికేషన్ నుంచి రక్షణ పొందుతుంది. గ్రామీణ ప్రాంతాలు, పూర్తి రిమోట్ ఏరియాలకు సరైన సర్వీసులు అందేలా చూస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








