Home
News

టెలికమ్యూనికేషన్‌ బిల్లు 2023కు పార్లమెంట్‌ ఆమోదం.. మెసేజ్‌లను ప్రభుత్వం చూసేందుకు వీలుకల్పించేలా ప్రతిపాదనలు!

కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు కల్పించే టెలికమ్యూనికేషన్‌ బిల్లు-2023ను (Telecommunications bill 2023) గురువారం పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ బిల్లును స్వల్పకాలిక చర్చ తర్వాత లోక్‌సభ బుధవారం ఆమోదం తెలపగా.. గురువారం మూజువాణీ ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టం అమల్లోకి రానుంది. 138 సంవత్సరాల క్రితం నాటి భారతీయ టెలిగ్రాఫ్‌ చట్టం సహా ప్రస్తుత చట్టాల స్థానంలో కొత్త బిల్లును తీసుకొచ్చారు.

ఈ బిల్లు ద్వారా జాతీయ భద్రత దృష్ట్యా టెలికాం సేవలను తాత్సాలికంగా నియంత్రించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. మరియు వేలం ప్రక్రియ లేకుండానే ప్రభుత్వం నేరుగా శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ కేటాయింపులు జరిపేందుకు వీలుకల్పిస్తుంది. ప్రజల భద్రత దృష్ట్యా, ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు, నేర నియంత్రణ, పబ్లిక్‌ ఎమర్జెన్సీ సమయాల్లో ప్రసారాలు నిలిపివేయడం మరియు మెసేజ్‌లను నియంత్రించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.

Telecommunications bill 2023

అయితే ఈ టెలికమ్యూనికేషన్‌ బిల్లు- 2023 పై పలువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో ప్రభుత్వ జోక్యానికి ఎక్కువ అవకాశం ఉందని ఆరోపించారు. దీనిపై కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. సుమారు 138 సంవత్సరాల నాటి పురాతన చట్టల స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు.

టెలికం రంగంలో ఎన్నో నిబంధనలతో కూడిన 100కు పైగా లైసెన్సులున్నాయని.. వాటన్నింటిని ఒకే అధికార వ్యవస్థ కిందికి తీసుకొచ్చినట్లు చెప్పారు. స్పెక్ట్రమ్‌ కేటాయింపులను మరింత పారదర్శకంగా నిర్వహించేలా బిల్లులో ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలున్నాయని చెప్పారు. కొన్ని ప్రత్యేక కేటగిరీలను మినహాయించి స్పెక్ట్రమ్‌ కేటాయింపులు అన్ని ఇకపై వేలం ద్వారానే జరుగుతాయని మంత్రి అశ్వినీవైష్ణవ్ తెలిపారు.

టెలికమ్యూనికేషన్‌ బిల్లు 2023లోని ముఖ్యాంశాలు : వాణిజ్య అవసరాలకు స్పెక్ట్రమ్‌లను వేలం ద్వారానే కేటాయించాలని జియో, వోడాఫోన్‌ ఐడియా సంస్థ కోరాయి. అయితే ఈ అభ్యర్ధనను తోసిపుచ్చి వేలం ప్రక్రియ లేకుండానే ప్రభుత్వం నేరుగా శాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ కేటాయింపులు జరిపేందుకు వీలుగా నిబంధనలను బిల్లులో పొందుపరిచారు.

* ప్రకృతి విపత్తులు, శాంతి భద్రతలు, దేశ ప్రయోజనాల కోసం టెలికాం నెట్‌వర్క్‌ను తాత్కాలికంగా ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు, ప్రసారాలను నిలిపేయవచ్చు మరియు మెసేజ్‌లను రహస్యంగా వినేందుకు వీలుంటుంది. కేంద్రం లేదా కేంద్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రత్యేక అధికారికి టెలికం నెట్‌వర్క్‌ను నియంత్రణలోకి తీసుకొనే అధికారం ఉంటుంది.

* ఇంటర్మెట్‌ ఆధారిత మెసేజ్‌లు, కాల్స్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించే గూగుల్‌ మీట్‌, టెలిగ్రామ్‌, వాట్సాప్‌ వంటి యాప్‌లను టెలికం చట్ట పరిధి నుంచి తొలగిస్తారు. ఈ యాప్‌లకు ఐటీ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. దీంతోపాటు ఓటీటీ యాప్‌లను ట్రాయ్‌ పరిధి నుంచి తొలగించేందుకు బిల్లులో ప్రతిపాదనలు చేశారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Telecommunications bill 2023 passed in parliment here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X