Telegram యాప్ ఫీచర్‌లో బయటపడ్డ లోపాల గురించి పూర్తి వివరాలు...

|

సోషల్ మీడియా యాప్ లను ఎక్కువగా వాడుతున్న వారికి టెలిగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ లో ఒక లోపాన్ని గుర్తించారు. వివరాలలోకి వెళితే యాప్ లోని ఒక ఫీచర్ నుండి హ్యాకర్లు వినియోగదారుల యొక్క ఖచ్చితమైన స్థానాన్ని సేకరించవచ్చు. అంటే వినియోగదారులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అన్న సమాచారాన్ని హ్యాకర్లకు తెలియజేయడానికి సహాయపడుతుంది. టెలిగ్రామ్‌లోని 'పీపుల్ నియర్' ఫీచర్‌ను ఉపయోగించి వినియోగదారుల యొక్క ప్రస్తుత స్థానంను ట్రాక్ చేయవచ్చు అని స్వతంత్ర పరిశోధకుడు అహ్మద్ హసన్ పేర్కొన్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టెలిగ్రామ్‌ ‘పీపుల్ నియర్’ ఫీచర్‌

టెలిగ్రామ్‌ ‘పీపుల్ నియర్’ ఫీచర్‌

ఆర్స్‌టెక్నికా యొక్క నివేదిక ప్రకారం టెలిగ్రామ్ వినియోగదారులను భౌగోళిక ప్రాంతంలో స్థానిక సమూహాలను సృష్టించడానికి అనుమతిస్తుంది. స్కామర్లు తరచూ అలాంటి సమూహాలను క్రాష్ చేయడానికి వారి స్థానాన్ని మోసగించి ఆపై నకిలీ బిట్‌కాయిన్ ఇన్వెస్టుమెంట్, హ్యాకింగ్ టూల్స్, దొంగిలించబడిన సామాజిక సెక్యూరిటీ నెంబర్స్ వంటి ఇతర మోసాలకు పాల్పడతారని హసన్ తన యొక్క ఇమెయిల్‌లో తెలిపారు.

హసన్ ఇమెయిల్

టెలిగ్రామ్‌లోని ‘పీపుల్ నియర్' ఫీచర్‌ను ముందస్తుగా అప్రమేయంగా ఆపివేయడం మంచిది. దీనిని ఆన్ చేసినప్పుడు ఇది సహాయక ఫీచర్‌గా ఉంటుంది. హసన్ ఇమెయిల్ ద్వారా టెలిగ్రామ్‌కు ఈ సమస్యను తెలిపిన తరువాత దానికి సమాధానంగా సంస్థ "సమీపంలోని వ్యక్తుల గ్రూపుల విభాగంలో ఉన్న వినియోగదారులు ఉద్దేశపూర్వకంగా తమ యొక్క స్థానాన్ని అందరితో పంచుకుంటున్నారు. అలాగే ఈ ఫీచర్ అప్రమేయంగా నిలిపివేయబడుతుంది. కొన్ని పరిస్థితులలో ఖచ్చితమైన స్థానాన్ని నిర్ణయించడం సాధ్యమని భావిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈ కేసు మా బగ్ బౌంటీ ప్రోగ్రామ్ పరిధిలోకి రాదు అని సూచించింది. "

టెలిగ్రామ్‌ సమస్య

ఖచ్చితంగా చెప్పాలంటే టెలిగ్రామ్‌కు ఇది ఒక సమస్య కాదని పేర్కొన్నప్పటికీ మీ ఖచ్చితమైన స్థాన వివరాలను అవాంఛిత ఆన్‌లైన్ స్టాకర్లకు ఇవ్వకుండా ఉండటానికి అవసరం లేనప్పుడు ఈ ఫీచర్ ను ఆపివేయడం చాలా మంచిది.

Best Mobiles in India

English summary
Telegram app ‘People Nearby’ Feature Facing Security problem

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X