టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్.. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు..!!
ప్రముఖ మెసెజింగ్ ప్లాట్‌ఫాం టెలిగ్రామ్ ఫౌండర్, సీఈవో పావెల్ దురోవ్ (Telegram CEO Pavel Durov Arrested) అరెస్ట్ అయ్యారు. పారిస్ లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. అజర్‌జైజాన్ నుంచి లే బోర్గట్ విమానాశ్రయానికి తన ప్రైవేట్ జెట్ లో చేరుకున్న వెంటనే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఫ్రెంట్ మీడియా వెల్లడించింది. ఇప్పటికే కొన్ని కేసుల్లో పావెల్ దురోవ్‌పై ఆరోపణలున్నాయి.
మనీలాండరింగ్, చీటింగ్, మాదక ద్రవ్యాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, చిన్నారులపై లైంగిక దాడులను నివారించేలా టెలిగ్రామ్ యాప్‌లో ఎలాంటి అప్‌డేట్‌లు లేకపోవడం సహా ఇతర కారణాలతో దురోవ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి టెలిగ్రామ్ యాప్‌లో మోడరేటర్లు లేకపోవడంతో నియంత్రణ కష్టమతోందని, ఈ అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలుస్తోంది.

మోసాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు సహా మరికొన్ని తీవ్రమైన ఆరోపణలు పావెల్ దురోవ్ పైన ఉన్నాయి. దీనిపై ఇప్పటికే అధికారులు వారెంట్ జారీ చేశారు. ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్ పై సంస్థ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ప్రాన్స్ ప్రభుత్వం కూడా అరెస్ట్ పై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే దురోవ్ అరెస్ట్ పై ఫ్రాన్స్‌లోని రష్యా ఎంబసీ స్పందించింది. పరిస్థితులపై అవగాహన కోసం చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్ పై సోషల్ మీడియా వేదికగా పలువురు స్పందిస్తున్నారు. పావెల్ దురోవ్‌కు మద్దతుగా ట్వీట్‌లు చేస్తున్నారు. అయితే చాలా ప్రభుత్వాలు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని దురోవ్ గతంలో వ్యాఖ్యానించారు. తాము ఓ తటస్ట వేదికగా ఉండాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
పావెల్ దురోవ్ (Pavel Durov Arrest) రష్యాలో జన్మించారు. 2014 లో రష్యాను విడిచిపెట్టారు. ఈ 39 ఏళ్ల బిలియనీర్ ప్రస్తుతం ఫ్రాన్స్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. 15.5 బిలియన్ డాలర్లతో అపర కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్‌ను 900 బిలియన్‌ల మంది వినియోగిస్తున్నారు.
టెలిగ్రామ్ ను రష్యాలో 2013 లో పావెల్ దురోవ్ స్థాపించారు. దరోవ్ కు చెందిన మరో యాప్ వీకొంటక్టే లో ప్రతిపక్షాల కమ్యూనిటీపై నిషేధం విధించాలన్న రష్యా ప్రభుత్వ ఒత్తిడితో 2014లో రష్యాకు దూరం అయ్యారు. ఈ యాప్ ను అనంతరం విక్రయించారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివాసం ఉంటున్నారు. టెలిగ్రామ్ పై రష్యా ప్రభుత్వం 2018 లో నిషేధం విధించి, 2021 లో ఎత్తివేసింది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








