టెలిగ్రామ్‌లో క్రిప్టోకరెన్సీ పేమెంట్లను చేయడానికి వీలుగా కొత్త ఫీచర్!!

|

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్ సంస్థ తన యొక్క యూజర్ల కోసం కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేసింది. ఈ కొత్త అభివృద్ధి బ్లాక్‌చెయిన్ లో మెసేజింగ్ యాప్‌కి కొత్తగా క్రిప్టో పేమెంట్ల ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే ఇతర టెలిగ్రామ్ వినియోగదారులకు క్రిప్టోకరెన్సీ యొక్క Toncoinని పంపడానికి అనుమతిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

టెలిగ్రామ్

సుమారు 550 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న టెలిగ్రామ్ AUS సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC) నుండి చట్టపరమైన సవాలును ఎదురుకున్న తర్వాత దాని స్వంత టోకెన్ కోసం దాని ప్లాన్‌ను గతంలో విరమించుకుంది. 2019లో టెలిగ్రామ్ తన టోకెన్‌ను అభివృద్ధి చేయడానికి $1.7 బిలియన్ల సేకరణ తరువాత దానిని చట్టవిరుద్ధమైన టోకెన్ సమర్పణగా పేర్కొంటూ SEC దావా వేసింది. టెలిగ్రామ్ తరువాత SECకి జరిమానా చెల్లించడమే కాకుండా పెట్టుబడిదారులకు మూలధనాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. అప్పటి నుండి టెలిగ్రామ్ యొక్క CEO పావెల్ దురోవ్ టెలిగ్రామ్ నుండి స్పష్టమైన మరియు స్వతంత్రంగా ఉన్న ప్రత్యేక స్పిన్-ఆఫ్ టోకెన్ టోన్‌కాయిన్‌ను ఆమోదించడానికి కృష్టి చేస్తున్నారు. దాని యొక్క ఫలితంగానే ఇప్పుడు టెలిగ్రామ్‌లో పేమెంట్స్ కోసం ఇప్పుడు క్రిప్టోకరెన్సీలను ప్రారంభించింది అని నివేదిక పేర్కొంది.

"టెలిగ్రామ్‌లోని ఈ ఫంక్షనాలిటీ వినియోగదారుని యొక్క బిజినెస్ పేమెంట్ల వరకు విస్తరిస్తుందని మేము అంచనా వేస్తున్నాము. తద్వారా ప్రజలు టెలిగ్రామ్ యాప్‌లోని బాట్‌ల ద్వారా టన్‌కాయిన్‌ను పంపడం ద్వారా అన్ని రకాల సేవలను సులభంగా పొందవచ్చు" అని TON ఫౌండేషన్ తెలిపింది. "టెలిగ్రామ్ లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త సర్వీసుతో మీరు ఇకపై అతిపెద్ద లేదా పొడవైన వాలెట్ అడ్రసులను నమోదు చేయాల్సిన అవసరం లేదు మరియు నిర్ధారణల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు" అని ఫౌండేషన్ ఫీచర్‌ను ప్రకటిస్తూ ట్వీట్‌లో పేర్కొంది.

టెలిగ్రామ్ ఇటీవలి కొత్త అప్‌డేట్‌లు
 

టెలిగ్రామ్ ఇటీవలి కొత్త అప్‌డేట్‌లు

టెలిగ్రామ్ సంస్థ ఇటీవల కొత్తగా మరొక అప్ డేట్ ను కూడా ప్రకటించింది. వీటిలో మ్యూట్ డ్యూరేషన్, యానిమేటెడ్ ఎమోజీలు మరియు మెరుగైన మెసేజ్ ట్రాన్సలేషన్లతో సహా అనేక కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. అలాగే కస్టమ్ నోటిఫికేషన్ సౌండ్స్ ఫీచర్ తో వినియోగదారులు ఏదైనా సౌండ్‌ని నోటిఫికేషన్ టోన్‌గా మార్చడానికి అనుమతిస్తుంది. ఇది యాప్‌లో కస్టమ్ అలర్ట్‌లను రూపొందించడానికి ఉపయోగించవచ్చు.

కస్టమ్ మ్యూట్ డ్యూరేషన్

** కస్టమ్ మ్యూట్ డ్యూరేషన్ సాయంతో టెలిగ్రామ్ లో నిర్దిష్ట వ్యవధికి నోటిఫికేషన్‌లను పాజ్ చేసే సామర్థ్యాన్ని కూడా జోడించింది. వినియోగదారులు ఒక గంట, 2 గంటలు, ఒక వారం, రెండు వారాలు, మూడు నెలలు మొదలైన అనేక రకాల ఎంపికల నుండి ఎంచుకోవచ్చు. ప్రతి చాట్‌లో అలర్ట్‌లను సవరించడానికి స్ట్రీమ్‌లైన్డ్ మెనూ ఉంటుందని టెలిగ్రామ్ చెబుతోంది.

** ప్రొఫైల్‌లలో కొత్త ఫీచర్లలో ఆటో- డెలిట్ మెను అనేది టెలిగ్రామ్ వ్యక్తిగత ప్రొఫైల్‌లలో ఆటో- డెలిట్ మెసేజ్ ఎంపికను ప్రారంభించడానికి ప్రయాణాన్ని కూడా సులభతరం చేసింది.

** ఫార్వార్డ్ చేసిన మెసేజ్లకు ప్రత్యుత్తరం యొక్క తాజా అప్‌డేట్‌తో వినియోగదారులు ఇతర చాట్‌లకు మెసేజ్ ని ఫార్వార్డ్ చేసినప్పుడు టెలిగ్రామ్ రిప్లై ప్రివ్యూలతో సహా ఉంటుంది. ఇది ఇతర వినియోగదారులు చేసే సంభాషణలో ఇతర వినియోగదారులకు మరింత సందర్భాన్ని ఇస్తుంది.

 

Best Mobiles in India

English summary
Telegram New Update Allows to Make Crypto Payments Other Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X