Telegram ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ధ‌ర భారీగా త‌గ్గింపు.. ఓ లుక్కేయండి!

|

ఇటీవ‌లి కాలంలో ర‌క‌ర‌కాల సోష‌ల్ మీడియా యాప్‌లు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అందులో భాగంగా Telegram అనే సోష‌ల్ మీడియా యాప్ కూడా వినియోగ‌దారుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం మ‌న దేశంలోని యువ‌త చాలా వ‌ర‌కు ఈ యాప్ బాగా అట్రాక్ట్ అయ్యార‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Telegram

యూత్ తాము ఎప్పుడు ఎక్క‌డ ఉన్నారు, ఏం చేస్తున్నార‌నే విష‌యాలు త‌మ మిత్రులు, లేదా కుటుంబ‌స‌భ్యుల‌తో పంచుకోవ‌డానికి ఈ Telegram బాగా ఉప‌యోగ‌డుతోంది. అన్నింటికీ మించి ఈ యాప్ దేశీయంగా రూపొందించిన‌ది కావ‌డం విశేషం. ఈ క్ర‌మంలో దీని వినియోగం బాగా పెరిగింది. కాగా, తాజాగా Telegram యాప్‌లో ఆ సంస్థ ప్రీమియం స‌ర్వీస్ ల‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ ప్రీమియం స‌ర్వీసుల యొక్క స‌బ్‌స్క్రిప్ష‌న్ ధ‌ర‌ను కంపెనీ భారీగా త‌గ్గించింది. దాదాపు 60శాతం మేర స‌బ్‌స్క్రిప్ష‌న్ ధ‌ర‌ను కంపెనీ త‌గ్గించింది. అందుకు సంబంధించిన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

టెలిగ్రామ్ ప్రీమియం యొక్క నెలవారీ సబ్‌స్క్రిప్షన్ సేవ ఇప్పుడు భారతదేశంలోని వినియోగదారులకు చౌకగా అందుబాటులోకి వ‌చ్చింది. కంపెనీ భారతదేశంలో ప్రీమియం ధరలలో మార్పును అధికారికంగా ప్రకటించింది. మరియు సవరించిన ధర ఇప్పటికే యాప్‌లో ప్రతిబింబిస్తుంది. ఆదాయాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా, టెలిగ్రామ్ కొత్త ఫీచర్‌లను జోడించి ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశంలో వినియోగదారులకు తొలిసారి ధర తగ్గింపు అందిస్తోంది.

Telegram

60శాతం త‌గ్గింపు!
టెలిగ్రామ్ వినియోగదారులకు వీకెండ్‌లో ఈ విధంగా నోటిఫికేషన్‌లను పంపింది. టెలిగ్రామ్ ప్రీమియం ఇప్పుడు మీ దేశంలో తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్ర‌స్తుతం దాదాపు 60శాతం త‌గ్గింపులో ప్రీమియం అందుబాటులో ఉంది. ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్‌ పొందిన సబ్‌స్క్రైబర్‌లు డజన్ల కొద్దీ ప్రత్యేక ఫీచర్‌లను అన్‌లాక్ పొందుతారు. ఇతర ప్రాంతాలలో టెలిగ్రామ్ ప్రీమియం ధరలను తగ్గించిందో లేదో కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

కేవలం రూ.179 కే:
భారతదేశంలో టెలిగ్రామ్ ప్రీమియం జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది. ప్రారంభం నుంచి దీని ప్రీమియం ధ‌ర రూ.469 గా ఉంది. అయితే, ఇప్పుడు దాదాపు 60శాతం కంటే త‌క్కువకు అందుబాటులో ఉంది. ప్ర‌స్తుతం దీని ప్రీమియం సేవ‌ల్ని నెలకు కేవ‌లం రూ.179 తో పొంద‌వ‌చ్చు.

టెలిగ్రామ్‌కు 700 మిలియన్ల మంది నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నారని కంపెనీ జూన్‌లో ప్రకటించింది. ఇది ప్రముఖ మెసేజింగ్ యాప్‌లు WhatsApp మరియు Facebook మెసెంజర్‌లతో పోటీపడుతుంది. వాట్సాప్‌కు 2 బిలియన్లకు పైగా మరియు ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌కు 1 బిలియన్ కంటే ఎక్కువ క్రియాశీల వినియోగదారులు ఉన్నారు.

Telegram

Telegram Premium తో ఎన్నో ఫీచ‌ర్లు:
ఈ Telegram Premium స‌ర్వీసులో భాగంగా Telegram త‌మ యాప్‌లో మ‌రిన్ని అప్‌డేట్స్ తీసుకువ‌చ్చింది. ప్రీమియం పొందిన స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు కొత్త‌ ఫీచ‌ర్లు అందుబాటులోకి వ‌చ్చాయని కంపెనీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ ప్రీమియం వినియోగ‌దారులు టెలిగ్రామ్ యాప్‌లో 4GB వ‌ర‌కు ఫైల్స్‌ను అప్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా వాయిస్ మెసేజ్‌ల‌ను టెక్స్ట్ రూపంలోకి మార్పిడి చేసుకోవ‌డానికి వినియోగ‌దారుల‌కు వెసులుబాటు క‌ల‌గ‌నుంది. అదేవిధంగా ఫైల్స్‌ను చాలా వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ ద్వారా యూజ‌ర్ల‌కు మ‌రిన్ని కొత్త‌ ఫీచ‌ర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ ప్ర‌కారం ప్రీమియం చెల్లించిన వారికి మాత్ర‌మే ఆ ఫీచ‌ర్లు అంద‌నున్నాయి.

Telegram

అదేవిధంగా, టెలిగ్రామ్ యాప్‌లో ఉన్న ఇత‌ర ఫీచ‌ర్లు కూడా చూడండి:
బ్లాగ్ పోస్ట్‌లో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. టెలిగ్రామ్ యాప్ వినియోగ‌దారులు వేగ‌వంత‌మైన డౌన్‌లోడ్ అనుభూతిని పొంద‌వ‌చ్చు. ఎక్కువ డేటా క‌లిగి ఉన్న ఫైల్స్ ను సైతం ఈ యాప్‌లో వేగంగా డౌన్‌లోడ్‌, అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ వినియోగ‌దారులు దాదాపు 1000 ఛానెల్స్ వ‌ర‌కు ఫాలో కావ‌చ్చు. దాంతో పాటు 20 చాట్ ఫోల్డర్స్ (ఒక్కో ఫోల్డ‌ర్‌లో 200 చాట్స్‌) క్రియేట్ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా ముఖ్య‌మైన 10 చాట్‌ల‌ను పిన్ చాట్ (పిన్ టూ చాట్) చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. వీటితో పాటు ప్రీమియం వినియోగ దారులు త‌మ‌కు న‌చ్చిన ముఖ్య‌మైన 10 స్టిక్క‌ర్ల‌ను సేవ్ చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తున్నారు. అలాగే యూజ‌ర్లు బ‌యోలో లాంగ‌ర్ డిస్క్రిప్ష‌న్‌తో పాటు ముఖ్య‌మైన లింక్‌ల‌ను పేస్ట్ చేసుకోవ‌చ్చు. ఇక GIF ఇమేజ్‌ల విష‌యానికి వ‌స్తే మ‌న‌కు న‌చ్చిన 400 GIF ల‌ను ఉప‌యోగించ వ‌చ్చు.

Best Mobiles in India

English summary
Telegram premium services subscription price reduced by 60percent.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X