లైసెన్సుల పై ప్రభుత్వం సమీక్షించాలి :టెలినార్

Posted By: Super

లైసెన్సుల పై ప్రభుత్వం సమీక్షించాలి :టెలినార్

 

న్యూఢిల్లీ: చట్ట ప్రకారం వచ్చిన పెట్టుబడులను రక్షించటానికి అన్ని రకాలైన చర్యలు తీసుకోవాలని యూనినార్‌లో ప్రధాన వాటాదారుగా ఉన్న నార్వే టెలికాం సంస్థ టెలినార్ ప్రభుత్వాన్ని కోరింది. లైసెన్సులను రద్దు చేయాలనటం సంస్థ పెట్టుబడులపై జరిగిన దాడి అని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 2జి లైసెన్సులను ప్రభుత్వం సమీక్షించాలని కోరుతోంది.

భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించటానికి టెలినార్ గ్రూప్ సిద్ధంగా ఉందని, చట్టబద్దమైన పెట్టుబడులను కాపాడుకోవటం తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ప్రభుత్వం దీనికి ఒక స్పష్టమైన ముగింపును ఇవ్వాలని కోరుకుంటున్నామని తెలిపింది. ప్రస్తుతం యూనినార్‌లో టెలినార్‌కు 67.25 శాతం వాటాలున్నాయి. ఇప్పటికే భారత్‌లో 6,100 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టినట్లు టెలినార్ తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot