రూ.146కే నెలంతా కాల్స్, రోజుకు 1జీబి ఇంటర్నెట్

త్వరలో భారతీ ఎయిర్‌టెల్‌లో విలీనం కాబోతోన్న టెలినార్ రెండు సరికొత్త ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. రూ.116, రూ.146 రేంజ్‌లలో అందుబాటులో ఉండే ఈ ప్లాన్‌లు ఆంధ్రప్రదేశ్, తెలింగాణ సర్కిళ్లతో పాటు గుజరాత్, మహారాష్ట్రా, గోవా, బిహార్, జార్కండ్, ఉత్తర్‌ప్రదేశ్ ఈస్ట్, ఉత్తర్‌ప్రదేశ్ వెస్ట్ సర్కిల్స్‌లో అందుబాటులో ఉంటాయి.

రూ.146కే నెలంతా కాల్స్, రోజుకు 1జీబి ఇంటర్నెట్

టెలినార్ యూజర్లు రూ.116 ప్యాక్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోవటం ద్వారా 28 రోజుల పాటు రోజుకు 1జీబి డేటా లభిస్తుంది. కాల్స్ విషయానికి వచ్చేసరికి రూ.116 ప్యాక్ లో ఉన్న టెలినార్ టు టెలినార్ నెట్‌వర్క్ మధ్య అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.

రూ.146కే నెలంతా కాల్స్, రోజుకు 1జీబి ఇంటర్నెట్

రూ.146 ప్యాక్‌లో ఉన్న వారికి టెలినార్ టు టెలినార్ అన్ లిమిటెల్ కాల్స్‌తో పాటు ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసుకునేందుకు 400 నిమిషాలు అందుబాటులో ఉంటాయి. ఉచిత రోమింగ్, ఉచిత మెసేజెస్ వంటి అదనపు సౌకర్యాలు ఈ ప్లాన్‌లలో లోపించాయి. టెలినార్‌కు దేశవ్యాప్తంగా 5.4 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.

English summary
Telenor latest Plans Launched at Rs.116, Rs.146. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting