రూ. 99లతో 9 గంటలకు పైగా టాక్ టైం

Written By:

టెలికం కంపెనీ టెలినార్ రూ .99 విలువ గల స్పెషల్ టారిఫ్ వోచర్‌ను 28 రోజుల కాల పరిమితితో ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఏదైనా ఇతర నెట్‌వర్క్‌కు 17,500 సెకన్ల లోకల్, ఎస్టీడీ టాక్‌టైంతో పాటు సొంత నెట్‌వర్క్‌కు 17,500 సెకన్ల టాక్‌టైంను ఇస్తోంది. ఈ నెల 27, 28 న మాత్రమే ఈ వోచర్ లభిస్తుంది.

రూ. 99లతో 9 గంటలకు పైగా టాక్ టైం

టెలినార్ వినియోగదారులు దీనిని సబ్ స్క్రైబ్ చేసుకోవాలంటే *222*7*99# కి డయల్ చేయవచ్చు. మొత్తం టాక్ టైం 35000 సెకన్లు కాగా ఇందులో 17000 ఉచిత సెకను ఏ నెట్ వర్క్ కైనా వాడుకోవచ్చు..మిగతా 17,500 సెకన్లు మాత్రం టెలినార్ నెట్ వర్క్ లో మాత్రమే వినియోగించుకోవడానికి వీలుంటుందని టెలినార్ ఏపీ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ తెలిపారు. ఇదిలా ఉంటే టెలినార్ అత్యంత తక్కువ ధరకే 4జీ సేవలను అందిస్తోంది. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: సిమ్‌కార్డ్ లేకుండానే ఇంటర్నెట్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సబ్ సే సస్తా’ అంటూ అందరికన్నా

‘సబ్ సే సస్తా' అంటూ అందరికన్నా తక్కువకే టెలికం సర్వీసులు అందిస్తామని చెప్పే టెలినార్... 4జీలోనూ ఆ ఒరవడి కొనసాగిస్తానని చెబుతుండటమే అసలు విశేషం. ఇదే జరిగితే కస్టమర్లు చవగ్గా వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందుకునే అవకాశముంది.

దేశవ్యాప్తంగా ఆరు సర్కిళ్లలో 5 కోట్లకుపైగా చందాదారులు

2009 డిసెంబర్లో 2జీ సేవలతో ప్రస్థానాన్ని ప్రారంభించిన టెలినార్‌కు (గతంలో యునినార్) దేశవ్యాప్తంగా ఆరు సర్కిళ్లలో 5 కోట్లకుపైగా చందాదారులున్నారు. వీరిలో 23 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. 2017 కల్లా ఈ సంఖ్యను 50 శాతానికి చేర్చాలన్నది సంస్థ లక్ష్యంగా కనిపిస్తోంది. 

 

 

ఫిబ్రవరి 9న వారణాసిలో టెలినార్ ప్రయోగాత్మకంగా

ఫిబ్రవరి 9న వారణాసిలో టెలినార్ ప్రయోగాత్మకంగా 4జీ సేవలను ఆరంభించింది. తక్కువ స్పెక్ట్రమ్‌పై వేగవంతమైన మొబైల్ బ్రాడ్ బ్యాండ్‌ను అందించే టెక్నాలజీని ఈ సంస్థ వినియోగిస్తోంది. ఇందులో భాగంగానే వారణాసిలో 1.4 మెగాహెర్ట్జ్‌పై సేవలను ప్రారంభించింది.

తెలుగు రాష్ట్రాల్లో 4జీ సేవలు ఏప్రిల్-జూన్ మధ్య ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో 4జీ సేవలు ఏప్రిల్-జూన్ మధ్య ప్రారంభం కానున్నాయి. వారణాసిలో ప్రయోగాత్మకంగా కొన్నాళ్లు పరీక్షించాక... అక్కడి లోటుపాట్లను సరిచేస్తూ తెలుగు రాష్ట్రాల్లో 4జీ సేవల్ని ప్రారంభించనున్నట్లు టెలినార్ వర్గాలు తెలియజేశాయి.

 

 

2017 చివరినాటికి 24,000 టవర్లను

2017 చివరినాటికి 24,000 టవర్లను నూతన టెక్నాలజీతో సంస్థ అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందుకోసం హువావేకు రూ.1,300 కోట్ల పనులను అప్పగించింది.

 

 

ఏపీ సర్కిల్‌లో ఆధునీకరణ 50 శాతానికి పైగా

ఏపీ సర్కిల్‌లో ఆధునీకరణ 50 శాతానికి పైగా పూర్తయింది కూడా. హువావే అభివృద్ధి చేసిన లీన్ జీఎస్‌ఎం సొల్యూషన్‌తో నెట్‌వర్క్ సామర్థ్యం 30 శాతం దాకా పెరుగుతుంది.

 

 

4జీ సేవలను ఆగస్టుకల్లా 5-8 నగరాల్లో ప్రవేశపెడతామని

4జీ సేవలను ఆగస్టుకల్లా 5-8 నగరాల్లో ప్రవేశపెడతామని టెలినార్ సీఈవో సిగ్వే బ్రెకీ చెప్పారు. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు.

 

 

వాయిస్ కస్టమర్లు లేనట్లయితే ఇప్పటికే పెద్ద ఎత్తున 4జీలో

స్పెక్ట్రమ్‌ను పెంచుకునేందుకు మరో టెలికం కంపెనీతో చర్చిస్తున్నట్టు తెలియజేశారు. ‘‘మాకు మరింత స్పెక్ట్రమ్ కావాలి. వాయిస్ కస్టమర్లు లేనట్లయితే ఇప్పటికే పెద్ద ఎత్తున 4జీలో విస్తరించి ఉండేవారం'' అని బ్రెకీ చెప్పారు.

 

 

నిబంధనలను అనుసరించి, తదుపరి వేలంలో పాల్గొనాలా? వద్దా?

నిబంధనలను అనుసరించి, తదుపరి వేలంలో పాల్గొనాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటామని చెప్పారాయన. స్పెక్ట్రమ్ ధర చాలా ఎక్కువగా ఉందని, రిలయన్స్ జియో ప్రవేశిస్తే 4జీలో పోటీ మరింత పెరుగుతుందని చెప్పారు.

 

 

అత్యంత పోటీ ఉన్న భారత టెలికం మార్కెట్లో

అత్యంత పోటీ ఉన్న భారత టెలికం మార్కెట్లో పెద్ద కంపెనీలు సైతం లాభాల కోసం ఇబ్బంది పడుతున్నాయని, జియో రాకతో ఇది మరింత తీవ్రమవుతుందని వ్యాఖ్యానించారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Telenor offers 35000 seconds of free calling at only Rs 99
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot