రూ.47కే 56జీబి 4జీ ఇంటర్నెట్

రిలయన్స్ జియో దెబ్బకు టెలికం సంస్థలు వరస పెట్టి కొత్త ఆఫర్లను అనౌన్స్ చేస్తున్నాయి. ఈ క్రమంలో టెలినార్ ఇండియా కూడా సంచలన ఆఫర్‌తో ముందుకొచ్చింది.

Read More : మళ్లీ ఆధార్ వెరిఫికేషన్, వివరాలు చెప్పకపోతే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే..

సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆఫర్‌లో భాగంగా రూ.47కే 56జీబి 4జీ డేటాను టెలినార్ అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ 56జీబి డేటాను రోజుకు 2జీబి చొప్పున వినియోగించుకోవల్సి ఉంటుంది.

ఎలా తెలుస్తుంది..?

ఈ స్పెషల్ ప్లాన్‌కు ఎంపికైన టెలినార్ యూజర్లకు ఆఫర్‌కు సంబంధించి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో అందుతుంది. జియో ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌కు పోటీగా టెలినార్ ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఇతర ప్లాన్‌లతో విశ్లేషించి చూస్తే..

టెలినార్ ఆఫర్ చేస్తున్న కొత్త ప్లాన్‌ను ఇతర టెల్కోలు ఆఫర్ చేస్తున్న ప్లాన్‌లతో విశ్లేషించి చూసినట్లయితే భారీ వ్యత్యాసమే కనిపిస్తోంది. 28 రోజులు పాటు రోజుకు 2జీబి డేటాను ఆఫర్ చేసేందుకు జియో రూ.499ని వసూలు చేస్తుండగా, 28 రోజులు పాటు రోజుకు 1జీబి డేటాను ఆఫర్ చేసేందుకు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ లు రూ.350 వరకు ఛార్జ్ చేస్తున్నాయి. మర వైపు, 28 రోజులు పాటు రోజుకు 2జీబి డేటాను ఆఫర్ చేసేందుకు రూ.339 వసూలు చేస్తోంది.

రూ.11కే 1జీబి 4జీబి డేటా

రూ.47 ప్యాకేజీ తరహాలోనే పలు ఆసక్తికర ఆఫర్లను టెలినార్ ఇప్పటికే మార్కెట్లో అనౌన్స్ చేసింది. వాటిలో రూ.11 ప్లాన్‌లో భాగంగా రోజుకు 1జీబి 4జీ డేటాను పొందే వీలుంటుంది.

డేటా ప్లాన్స్ అదిరేలా ఉన్నప్పటికి..

టెలినార్ లాంచ్ చేసిన 4జీ డేటా ప్లాన్స్ అదిరేలా ఉన్నప్పటికి ఈ నెట్‌వర్క్
కవరేజ్ సర్కిల్స్ మాత్రం కొన్నే ఉన్నాయి. టెలినార్ ఆఫర్ చేస్తున్న 4జీ సర్వీసులు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, ఈ ఆఫర్ కోసం మీరు ట్రై చేసి చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Telenor RC47 Will Now Give You 56GB 4G Data For 28 Days, Only For Selected Users. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot