తెలుగు మాట అప్లికేషన్‌ను ఆవిష్కరించిన మంత్రి పొన్నాల

|

ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా సంక్షిప్త సందేశాలను (ఎస్ఎంఎస్‌లను) తెలుగులో పంపుకునేందుకు వీలుగా రాష్ట్ర సమాచార శాఖ రూపొందించిన ‘తెలుగు మాట'అప్లికేషన్‌ను రాష్ట్ర ఐటీశాఖా మంత్రి పోన్నాల లక్ష్మయ్య సోమవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు.

 
తెలుగు మాట అప్లికేషన్‌ను ఆవిష్కరించిన మంత్రి పొన్నాల

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాట అప్లికేషన్‌ను యాపిల్ యూజర్లు ఐట్యూన్స్ అప్లికేషన్ స్టోర్ ద్వారానూ, ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్టే స్టోర్ ద్వారానూ ఉచితంగా పొందవచ్చని చెప్పారు. ‘తెలుగు మాట' యాప్ ద్వారా యాపిల్ ఇంకా ఆండ్రాయిడ్ యూజర్లు తమతమ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ పీసీలలో నేరుగా తెలుగులో సంభాషించుకునే వీలుకలుగుతుందని వివరించారు.

తెలుగుభాషను సాంకేతికంగా ఉపయోగించుకునే దిశలో ఇది మరొక అడుగని మంత్రి అన్నారు. అంతర్జాలం ద్వారా తెలుగు భాషను ప్రపంచ భాషగా తిర్చిదిద్దడమే లక్ష్యంగా ‘తెలుగు మాట' అప్లికేషన్ ను రూపొందించినట్లు తెలిపారు. ‘తెలుగు విజయం ప్రాజెక్టు' క్రింద యూనికోడ్ కన్సార్టియంలో ప్రపంచంలోనే శాశ్వత సభ్యత్వం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రం మనదేనని ఈ సందర్భంగా మంత్రి పొన్నాల పేర్కొన్నారు . కార్యక్రమానికి మరో ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలుగు భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ ఈ అప్లికేషన్ సౌలభ్యతతో కొత్త సంవత్సరం శుభాకాంక్షలను తెలుగులో పంపించే అవకాశం కలిగిందన్నారు.

ఇన్స్‌స్టాల్ చేసుకునే విధానం:

తెలుగు మాట అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఇంకా ఐవోస్ (యాపిల్) ప్లాట్‌ఫామ్‌ల కోసం అందుబాటులో ఉంచారు. ఒత్సాహికులు teluguvijayam.org వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆ తరువాత ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్స్‌స్టాలింగ్ ప్రక్రియ పూర్తిఅయిన వెంటనే ‘తెలుగు మాట' అప్లికేషన్ మీ ఫోన్‌లో ప్రత్యేక్షమవుతుంది. తెలుగు మాట ఆప్షన్‌ను ఆన్ చేసుకున్న వెంటనే యాప్ పనిచేయటం ప్రారంభిస్తుంది.

ఆండ్రాయిడ్ యూజర్లు తెలుగ మాట అప్లికేషన్ ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్

యాపిల్ యూజర్లు తెలుగ మాట అప్లికేషన్ ను యపిల్ ఐట్యూన్స్ స్టోర్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. డౌన్‌లోడ్ లింక్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X