ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

|

ప్రజాజీవితాన్ని మరింత సుఖవంతం చేస్తూ ప్రపంచ దిశనే మార్చేసిన వినూత్నఆవిష్కరణలు చాలానే ఉన్నాయి. 100ల ఏళ్ల క్రితం ప్రపంచపు పరిస్థితులను చరిత్ర ఆధారంగా మనం పరిశీలించినట్లయితే మనుగడ ఎంత కష్టతరంగా ఉండేదో అర్థమవుతుంది. క్రమక్రమంగా తన ఆలోచనలకు పొదునుపెడుతూ వచ్చిన మనిషి ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణల వైపు దృష్టిని మళ్లించి ప్రపంచాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచపటంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యంపోసిన పది అత్యుత్తమ ఆవిష్కరణలను మీకు పరిచయం చేస్తున్నాం. ఆ వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

 

టెక్ చిట్కా: టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

దున్నే నాగలి (The Plow):

నాగలి (Plow), ఒక ముఖ్యమైన వ్యవసాయ పనిముట్టు. వ్యవయసాయదారులు దీనిని ఉపయోగించించి భూమిని దున్ని పంటలు పండిస్తారు. నాగలికి చాలా పేర్లు ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల వారు నాగలిని మడల, హలం ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆధునిక వ్యవసాయానికి నాగలి ఎంతో ప్రేరణగా నిలిచింది.

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

చక్రం (The Wheel):

చక్రం (Wheel) మనిషి కనుగొన్న మొట్టమొదటి పరికరం. చక్రం అనేది చుట్టూ తిరిగే గుండ్రటి పరికరం. రవాణా ఇంకా ఇతర పరిశ్రమల్లో చక్రాలు క్రీలకంగా వ్యవహరిస్తున్నాయి. 3100 బీ.సీ కాలంలో చక్రాలను కనుగొన్నట్లు చరిత్ర చెబుతోంది.

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు
 

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

శీతలీకరణం (Refrigeration):

ఈ కృత్రిమ శీతలీకరణ వ్యవస్థను ఆలివర్ ఇవాన్స్ ఇంకా కార్ల్‌వోన్ లిండేలు వృద్ధిచేశారు. ఈ వ్యవస్థ ఆధారంగానే చల్లటి ఐస్‌క్రీమ్‌లను మనం తినగలుగుతున్నాం. రిఫ్రీజరేషన్ వ్యవస్థ కేవలం గృహవినియోగానికే కాకుండా శాస్త్ర సాంకేతిక, వైద్య రంగాల్లో ఉపయోగపడుతోంది.

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

స్టీమ్ ఇంజన్ (Steam Engine):

జేమ్స్ వాట్ ‘స్టీమ్ ఇంజన్'ను ప్రయోగాత్మకంగా ప్రపంచానికి పరిచయం చేశాడు. 1804లో స్టీమ్ ఇంజన్‌తో నడిచే రైలు వేల్స్‌లో మొదటిసారి ప్రయాణించింది.

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

ప్రింటింగ్ ప్రెస్ (The Printing Press):

కమ్యూనికేషన్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘ప్రింటింగ్ ప్రెస్'ను ముందుగా కనుగొన్నది జోహాన్ గుటెన్‌బర్గ్ అనే జర్మనీ దేశస్తుడని అనుకుంటారు, కాని నిజానికి ‘ప్రింటింగ్ ప్రెస్'ను కనుగొన్నది చైనా దేశస్తులే...

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

కమ్యూనికేషన్ పరికరాలు (Communication Devices):

మొబైల్.. టెలీఫోన్.. టీవీ.. రేడియో వంటి కమ్యూనికేషన్ పరికరాలు నేటి తరానికి మరింత సుపరిచితం. టెలిఫోన్‌ను ఆలగ్జేండర్ గ్రాహం బెల్ కనుగొన్నారు. టెలివిజన్‌ను జాన్‌లాగీ బైర్డ్ వృద్ధి చేయగా, రేడియోను మార్కోని సృష్టించారు.

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

లైట్ బుల్బ్ (Light Bulb):

కాంతిని ప్రసరించే విద్యుత్ బల్బ్లులు రాత్రుళ్లు నిత్యావసరంలా మారిపోయాయి. లైట్ బుల్బును తొలిగా కనుగొన్నది థామస్ ఎడిసన్.

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

ఆటోమొబైల్ (Automobile):

ఆటోమొబైల్ ప్రయాణం, కార్ల్ బెంజ్, 1885 ఆవిష్కరణతో ప్రారంభమైంది. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆటోమొబైల్ రంగం ఆపారంగా విస్తరించింది.

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

కంప్యూటర్ (Computer):

ప్రపంచాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న రంగాలలో కంప్యూటింగ్ రంగం ఒకటి. కంప్యూటర్‌ను వృద్ధి చేయటంలో చార్లెస్ బెబేజ్ ఇంకా అలెన్ టర్నింగ్‌లు కీలక పాత్ర పోషించారు.

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

ప్రపంచాన్నే మార్చేసిన 10 అద్భుతాలు

ఇంటర్నెట్ (Internet):

ఇంటర్నెట్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్‌లను కలుపుతున్న ఓ వ్యవస్థ. ఈ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకోవచ్చు. తొలిగా ఈ వ్యవస్థను అమెరాకా భద్రతా విభాగంలో వినియోగించారు. ఈ సర్వీస్ ఆధారంగా అనేక కమ్యూనికేషన్ సేవలను పొందగలుగుతున్నాం. ఇంటర్నెట్‌ను తెలుగులో అంతర్జాలంగా పిలుస్తారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X