నాగలి నుంచి ఇంటర్నెట్ వరకు.. బతుకు నేర్పిన ఆవిష్కరణలు

క్రమక్రమంగా తన ఆలోచనలకు పొదునుపెడుతూ వచ్చిన మనిషి, ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణల వైపు దృష్టిని మళ్లించి ప్రపంచాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు.

నాగలి నుంచి ఇంటర్నెట్ వరకు.. బతుకు నేర్పిన ఆవిష్కరణలు

Read More : ప్రపంచాన్ని కన్నీరు పెట్టించిన ఫోటోలు!

నాగలి నుంచి ఇంటర్నెట్ వరకు, చక్రం నుంచి స్మార్ట్‌ఫోన్ వరకు ఎన్నో విప్లవాత్మక ఆవిష్కరలను మారుతోన్నకాలాన్నిబట్టి మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచాన్ని పురోగతి వైపు నడిపించిన 10 ముఖ్యమైన ఆవిష్కరణల వివరాలను ఇప్పుడు తెలుసుుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దున్నే నాగలి

నాగలి (Plow), ఒక ముఖ్యమైన వ్యవసాయ పనిముట్టు. వ్యవయసాయదారులు దీనిని ఉపయోగించించి భూమిని దున్ని పంటలు పండిస్తారు. నాగలికి చాలా పేర్లు ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల వారు నాగలిని మడల, హలం ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆధునిక వ్యవసాయానికి నాగలి ఎంతో ప్రేరణగా నిలిచింది.

చక్రం (Wheel)

చక్రం,  మనిషి కనుగొన్న మొట్టమొదటి పరికరం. చక్రం అనేది చుట్టూ తిరిగే గుండ్రటి పరికరం. రవాణా ఇంకా ఇతర పరిశ్రమల్లో చక్రాలు క్రీలకంగా వ్యవహరిస్తున్నాయి. 3100 బీ.సీ కాలంలో చక్రాలను కనుగొన్నట్లు చరిత్ర చెబుతోంది.

Steam Engine

జేమ్స్ వాట్ ‘స్టీమ్ ఇంజన్'ను ప్రయోగాత్మకంగా ప్రపంచానికి పరిచయం చేశాడు. 1804లో స్టీమ్ ఇంజన్‌తో నడిచే రైలు వేల్స్‌లో మొదటిసారి ప్రయాణించిం

The Printing Press

కమ్యూనికేషన్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘ప్రింటింగ్ ప్రెస్'ను ముందుగా కనుగొన్నది జోహాన్ గుటెన్‌బర్గ్ అనే జర్మనీ దేశస్తుడని అనుకుంటారు, కాని నిజానికి ‘ప్రింటింగ్ ప్రెస్'ను కనుగొన్నది చైనా దేశస్తులే...

Communication Devices

మొబైల్.. టెలీఫోన్.. టీవీ.. రేడియో వంటి కమ్యూనికేషన్ పరికరాలు నేటి తరానికి మరింత సుపరిచితం. టెలిఫోన్‌ను ఆలగ్జేండర్ గ్రాహం బెల్ కనుగొన్నారు. టెలివిజన్‌ను జాన్‌లాగీ బైర్డ్ వృద్ధి చేయగా, రేడియోను మార్కోని సృష్టించారు.

Refrigeration

శీతలీకరణం : ఈ కృత్రిమ శీతలీకరణ వ్యవస్థను ఆలివర్ ఇవాన్స్ ఇంకా కార్ల్‌వోన్ లిండేలు వృద్ధిచేశారు. ఈ వ్యవస్థ ఆధారంగానే చల్లటి ఐస్‌క్రీమ్‌లను మనం తిన

Light Bulb

లైట్ బుల్బ్ : కాంతిని ప్రసరించే విద్యుత్ బల్బ్లులు రాత్రుళ్లు నిత్యావసరంలా మారిపోయాయి. లైట్ బుల్బును తొలిగా కనుగొన్నది థామస్ ఎడిసన్.

Automobile

ఆటోమొబైల్ : ఆటోమొబైల్ ప్రయాణం, కార్ల్ బెంజ్, 1885 ఆవిష్కరణతో ప్రారంభమైంది. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆటోమొబైల్ రంగం ఆపారంగా విస్తరించింది.

Computer

కంప్యూటర్ : ప్రపంచాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న రంగాలలో కంప్యూటింగ్ రంగం ఒకటి. కంప్యూటర్‌ను వృద్ధి చేయటంలో చార్లెస్ బెబేజ్ ఇంకా అలెన్ టర్నింగ్‌లు కీలక పాత్ర పోషించారు.

Internet

ఇంటర్నెట్ : ఇంటర్నెట్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్‌లను కలుపుతున్న ఓ వ్యవస్థ. ఈ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకోవచ్చు. తొలిగా ఈ వ్యవస్థను అమెరాకా భద్రతా విభాగంలో వినియోగించారు. ఈ సర్వీస్ ఆధారంగా అనేక కమ్యూనికేషన్ సేవలను పొందగలుగుతున్నాం. ఇంటర్నెట్‌ను తెలుగులో అంతర్జాలంగా పిలుస్తారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ten Inventions That Changed The World. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot