టెన్సెంట్ దూకుడు.. డీప్‌సీక్‌ను మించే వేగంతో కొత్త ఏఐ మోడల్ లాంచ్.. దీని ప్రత్యేకతలివే..
Tencent: చైనా టెక్ దిగ్గజం టెన్సెంట్ సంచలనం సృష్టించింది. హున్‌యువాన్ టర్బో ఎస్ (Hunyuan Turbo S) అనే కొత్త ఏఐ మోడల్‌ను డెవలపర్లు, వ్యాపారులకు అందుబాటులోకి తెచ్చింది. దీని స్పీడ్ మామూలుగా లేదు, డీప్‌సీక్-ఆర్1 కంటే కూడా వేగంగా ప్రశ్నలకు సమాధానం చెబుతుందట. చైనాలో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కోసం పెద్ద రేస్ నడుస్తోంది. డీప్‌సీక్ ఏఐ కంపెనీ తీసుకొచ్చిన ఆర్1, వీ3 మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపాయి.
సిలికాన్ వ్యాలీలోనూ డీప్‌సీక్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో టెన్సెంట్ లాంటి పెద్ద కంపెనీలు కూడా తమ ఏఐ టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయక తప్పలేదు. టెన్సెంట్ ప్రకారం, ఈ కొత్త మోడల్ సెకనులోపే ప్రశ్నలకు జవాబులిస్తుందట. వేరే ఏఐ మోడల్స్‌లాగా రెస్పాన్స్ ఇవ్వడానికి టైమ్ తీసుకోదట. దీంతో చైనా ఏఐ కంపెనీల మధ్య పోటీ పెరిగింది.

* హున్‌యువాన్ టర్బో ఎస్ vs డీప్‌సీక్.. ఏది తోపు?
హున్‌యువాన్ టర్బో ఎస్ స్పీడ్‌లో డీప్‌సీక్-ఆర్1ని మించిపోయిందని టెన్సెంట్ గట్టిగా చెబుతోంది. ఇలా ప్రశ్న అడగగానే, అలా జవాబు వచ్చేస్తుందట. "స్లోగా ఆలోచించే" ఏఐ సిస్టమ్స్‌లాగా పాజ్ తీసుకుని, ఆగి ఆగి రెస్పాన్స్ ఇవ్వదట. అంతేకాదు, నాలెడ్జ్, మ్యాథ్స్, రీజనింగ్ లాంటి ముఖ్యమైన విషయాల్లో కూడా డీప్‌సీక్-వీ3తో పోటీ పడుతుందని టెన్సెంట్ చెబుతోంది.
డీప్‌సీక్-వీ3తో పనిచేసే ఏఐ చాట్‌బాట్ అయితే యాప్ డౌన్‌లోడ్స్‌లో ఏకంగా ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీనే దాటేసి రికార్డులు కొల్లగొడుతోంది. మరి టెన్సెంట్ చేస్తున్న ఈ క్లెయిమ్స్‌పై డీప్‌సీక్ ఇంకా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. చైనా గొప్పలు చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. మరి ఇవి నిజమో లేదో తెలియాలి.
* ఏఐ మార్కెట్‌లో డీప్‌సీక్..
డీప్‌సీక్ ఏఐ మోడల్స్ టెక్ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేశాయి. మిగతా ఏఐ మోడల్స్‌లా కాకుండా, ఇవి చాలా ఎఫిషియెంట్‌గా, రియల్ వరల్డ్ అప్లికేషన్స్‌కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. డీప్‌సీక్ టెక్నాలజీ స్పెషాలిటీ ఏంటంటే, కంప్యూటింగ్ పవర్‌ని బాగా ఆప్టిమైజ్ చేస్తుంది, ఎనర్జీ వాడకాన్ని తగ్గిస్తుంది. దీంతో బిజినెస్‌లకి, యూజర్స్‌కి ఖర్చు తగ్గుతుంది.
డీప్‌సీక్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డేటా అనాలిసిస్ లాంటి చాలా పనులు చేయగలదు. మళ్లీ మళ్లీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా డీప్‌సీక్ ఎథికల్ ఏఐకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. బయాస్ తగ్గించడం, ఆటోమేటెడ్ డెసిషన్స్‌లో ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేయడం వీటి ప్రత్యేకతలు. అందుకే డీప్‌సీక్ ఏఐ ప్రపంచవ్యాప్తంగా త్వరగా పాపులర్ అయిపోయింది.
* టెన్సెంట్ వర్సెస్ అలీబాబా..
డీప్‌సీక్ దూకుడు చూసి మిగతా చైనా కంపెనీలు కూడా ఏఐ ఇన్నోవేషన్స్‌లో స్పీడ్ పెంచాయి. రీసెంట్‌గా అలీబాబా క్యూవెన్ 2.5-మాక్స్ మోడల్‌ను లాంచ్ చేసింది. అది డీప్‌సీక్-వీ3 కంటే కూడా సూపర్ అని క్లెయిమ్ చేసింది. ఇప్పుడు టెన్సెంట్ హున్‌యువాన్ టర్బో ఎస్‌తో పోటీకి దిగింది. ఇది మునపటి మోడల్స్‌తో పోలిస్తే తక్కువ ధరకే వస్తోంది.
డీప్‌సీక్ ఓపెన్-సోర్స్, తక్కువ ధర విధానం వల్ల మిగతా ఏఐ కంపెనీలు కూడా ప్రైస్‌లు తగ్గించక తప్పడం లేదని టెన్సెంట్ ఒప్పుకుంది. చైనా ఏఐ కంపెనీల మధ్య పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. అందరూ కలిసి అధునాతన, తక్కువ ధర మోడల్స్‌ని డెవలప్ చేస్తూ ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేస్తున్నారు.
* డీప్‌సీక్‌ను టెన్సెంట్ మోడల్ దాటేస్తుందా..
డీప్‌సీక్ ఏఐ మోడల్స్ ఒక బెంచ్‌మార్క్ సెట్ చేశాయి. టెన్సెంట్ స్పీడ్, తక్కువ ధరల గురించి చెబుతోంది కాబట్టి, హున్‌యువాన్ టర్బో ఎస్ గట్టి పోటీదారుగానే కనిపిస్తోంది. కానీ రియల్ వరల్డ్‌లో ఇది ఎలా పనిచేస్తుందో చూడాలి. డీప్‌సీక్ సామర్థ్యం, అనుకూలత, ఎథికల్ ఏఐ అప్రోచ్‌కి ఇది మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇంకా తెలియాలి.
చైనాలో ఏఐ కాంపిటీషన్ మాత్రం హీటెక్కిపోయింది. దీంతో యూజర్స్‌కి ఫాస్ట్, స్మార్ట్, తక్కువ ధర ఏఐ సొల్యూషన్స్ అందుబాటులోకి రావడం గ్యారెంటీ.


Click it and Unblock the Notifications








