డేగ, డ్రాగన్‌ల మధ్య యుద్ధం..పెంకులు పగిలాయి

|

అగ్రరాజ్యం అమెరికాతో పోటీ పడుతున్న చైనా.. అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించేందుకు ఈ సరికొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. ఇప్పటికే ఉన్న అత్యధ్బుత నిర్మాణానికి తోడు సరికొత్త నిర్మాణాలతో ముందుకు వెళుతోంది. అయితే ఇప్పటికే ఉన్న నిర్మాణం బీటలు వారింది. అత్యాధునిక టెక్నాలజీతో ,కళ్లు మిరుమిట్లు గొలిపే సాంకేతికతతో నిర్మించిన ఈ వంతెన ఇప్పుడు ప్రమాదంలో పడింది. అయినా వెరవక మళ్లీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన కోసం అమెరికాతో ఢీ అంటోంది.. ఆ వంతెనల కథపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

Read more:రష్యా ‘ఉగ్ర'పంజా..మిస్సైల్స్‌తో ముప్పేట దాడి

కిందకు చూస్తే వేల అడుగుల లోతైన లోయ

కిందకు చూస్తే వేల అడుగుల లోతైన లోయ

కిందకు చూస్తే వేల అడుగుల లోతైన లోయ, పైన ఆకాశం.. ఇలాంటి అరుదైన దృశ్యం ఈ గాజు వంతెన సొంతం. అందుకే దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రత్యేక టెక్నాలజీ, డిజైన్‌లతో నిర్మించారు.

ఒకేసారి 800 మంది పర్యాటకులు

ఒకేసారి 800 మంది పర్యాటకులు

ఒక్కొక్కటీ 27 మిల్లీ మీటర్ల మందంలో ఉండే మూడు గాజు పలకలు దీని నిర్మాణానికి వాడారు. ఒక్కో గాజు పలక 1,700 పౌండ్ల బరువును అపుతోంది. దీనిపై ఒకేసారి 800 మంది పర్యాటకులు తిరగవచ్చు. యూ షేప్‌లో నిర్మించిన దీనిపై నుంచి చూస్తే 3,540 అడుగుల లోయ కనిపిస్తుంది.

గాజు వంతెన ఇపుడు ప్రమాదంలో
 

గాజు వంతెన ఇపుడు ప్రమాదంలో

చైనాలో యున్‌టయ్‌ కొండల మధ్య దాదాపు 300 మీటర్ల పొడుగున నిర్మించిన ఆ అపురూపమైన గాజు వంతెన ఇపుడు ప్రమాదంలో పడిందట. ప్రత్యేక టెక్నాలజీతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ వంతెన బీటలు వారింది. అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పర్యాటకులు ఆందోళనలోపడ్డారు. పగుళ్లను గమనించిన పర్యాటకులు అరుస్తూ పరుగులు పెట్టారట.

స్టీల్‌ కప్‌ జారి వంతెన మీద..

స్టీల్‌ కప్‌ జారి వంతెన మీద..

పర్యాటకులు వెళ్తుండగా ఓ మహిళ చేతిలో నుంచి స్టీల్‌ కప్‌ జారి వంతెన మీద పడిందని, దీంతో వంతెన పైపొర మీద పగుళ్లు వచ్చాయని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. యున్టయ్ అధికారులు కూడా ఈ వార్తలను పాక్షికంగా ధ్రువీకరించారు.

ఒక పొరపై ఏర్పడ్డ పగుళ్లను..

ఒక పొరపై ఏర్పడ్డ పగుళ్లను..

మూడు గాజు పొరలతో తయారుచేసిన ఈ వంతెనలోని ఒక పొరపై ఏర్పడ్డ పగుళ్లను తమ భద్రతా సిబ్బంది గుర్తించారని తెలిపారు. పదునైన వస్తువు గట్టిగా తాకడం వల్ల ఇలా జరిగిందని, మరమ్మతు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా చర్చలు

సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా చర్చలు

దీంతో చైనా సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా చర్చలు నడుస్తున్నాయి. అయినా ఇప్పటికీ కొంతమంది ఔత్సాహిక పర్యాటకులు ఆ వంతెనపై నుంచి నడుస్తూ సాహసయాత్ర చేస్తున్న అనుభూతిని పొందుతున్నారట.

పగిలిన వంతెనపై నడుస్తుంటే ..

పగిలిన వంతెనపై నడుస్తుంటే ..

పగిలిన వంతెనపై నడుస్తుంటే తన కాళ్లు కొద్దిగా వణికాయని లీ డాంగ్ వ్యాఖ్యానించాడు. అందరూ పెద్దగా అరుస్తుంటే తాను కూడా పగుళ్లు చూశానని, ఒక్కసారిగా అరుచుకుంటూ.. ముందువాళ్లను తోసుకుంటే ముందుకు పరిగెత్తానని పోస్ట్ చేశాడు.

చైనాలో మరో గాజు వంతెన

చైనాలో మరో గాజు వంతెన

కాగా చైనాలో మరో గాజు వంతెన సిద్ధమవుతోంది. తియాన్మెస్‌ పర్వతం దగ్గర 1,410 అడుగుల పొడవుతో దీనిని నిర్మిస్తున్నారు. 2011లో దీని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే అక్టోబర్ నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తికానుందని చైనా ప్రభుత్వం వెల్లడించింది. ఈ వంతెనపై ఒకేసారి 800 మంది వెళ్లేంత దృఢంగా నిర్మించారని.. దానిపై నిస్సందేహంగా వెళ్లవచ్చునని అధికారులు వెల్లడిస్తున్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద గాజువంతెనగా

ప్రపంచంలోనే అతి పెద్ద గాజువంతెనగా

జియాంగ్జియాజ్ అనే ప్రాంతంలో ఉన్న గ్రాండ్ కాన్యన్లో 380 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ వంతెన చైనాలో ప్రపంచంలోనే అతి పెద్ద గాజువంతెనగా పేరుగాంచింది. దీని మీద నుంచి 3500 అడుగుల లోతున ఉన్న ప్రదేశాన్ని చూడవచ్చు.

ఈ గాజు వంతెన అమెరికాలో ఉన్న గాజు వంతెనను తలదన్నింది.

ఈ గాజు వంతెన అమెరికాలో ఉన్న గాజు వంతెనను తలదన్నింది.

ఈ గాజు వంతెన అమెరికాలో ఉన్న గాజు వంతెనను తలదన్నింది. 

డ్రాగన్ రెడీ

డ్రాగన్ రెడీ

దీంతో అగ్రరాజ్యానికి మళ్లీ కంటి మీద కునుకు లేకుండా చేసేదానికి డ్రాగన్ రెడీ అయిందన్న మాట 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

Read more about:
English summary
Here Write Terror at 3,500 feet as glass walkway in China cracks

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X