టెస్లా హ్యూమనాయిడ్ రోబో వీడియో విడుదల..రోబో సినిమాలో చూసినట్లుగానే..!
సూపర్‌స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా "రోబో".. ఈ సినిమాలో రోబోను చూసిన ప్రజలు ఎంతో ఆశ్యర్యపోయారు. రోబో చేసిన పనులు, మాటలు చూసి ఎగిరి గంతేసినంత పనిచేశారు. అనంతరం ఇది కేవలం సినిమా మాత్రమేనని.. బయట అలాంటి రోబోలు వచ్చే అవకాశం ఇప్పట్లో లేదని చాలా మంది భావించారు. అదో కలలాంటి దంటూ అనేక మంది భ్రమపడ్డారు.
సామాన్యులకు అదో కల కావచ్చు.. కానీ తనకు అదో సరదా అంటూ భావించారో ఏమో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. తన సంస్థ అయిన టెస్లా నుంచి హ్యూమనాయిడ్ రోబోను తయారుచేస్తామని గత సంవత్సరం ప్రకటించారు. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు.

తాము రూపొందించిన హ్యూమనాయిడ్ రోబో (Tesla Bot) వీడియోను టెస్లా యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో రోబోలు కొంచెం నెమ్మదిగా ముందుకు నడవడం గమనించవచ్చు. ఈ రోబోలు కొన్ని పనులను చేయగలవు మరియు వస్తువులను గుర్తించగలవు. ఈ వీడియోను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ షేర్ హోల్డర్ల మీటింగ్‌లో ప్రదర్శించారు.
హ్యూమనాయిడ్ రోబోట్‌గా రూపొందించిన టెస్లా బోట్ గురించి.. గత సంవత్సరం AI దినోత్సవం రోజున తొలిసారిగా బయటకు వచ్చింది. ఆ సమయంలో టెస్లా కేవలం పునర్నిర్మించబడిన వెర్షన్‌ను మాత్రమే చూపింది. ఈ రోబో ముందుకు నడిచే అవకాశం ఉందని చెప్పింది మరియు స్వంతంగా కొన్ని టాస్క్‌ను చేయించింది.
ప్రేక్షకులను అలరించేందుకు అప్పుట్లో కేవలం ప్రొడక్షన్ మోడల్‌ను మాత్రమే చూపించింది. అయితే ప్రస్తుతం టెస్లా విడుదల చేసిన వీడియోలో ఉన్న రోబో.. ప్రొడక్షన్ మోడల్ కంటే ఎంతో భిన్నంగా ఉంది. స్వంతంగా కొంచెం నెమ్మదిగా ముందుకు నడుస్తుంది.
టెస్లా బోట్ ప్రాజెక్టు గురించి కొన్ని హైలెట్స్ బయటకువచ్చాయి. మోటార్ టార్క్ కంట్రోల్, వాతావరణాన్ని గుర్తించడం సహా గుర్తుపెట్టుకోవడం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారుచేయబడిన రోబోట్.. నిపుణుల నుంచి శిక్షణ పొందడం, వస్తువులను మార్చడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు. ఒక కంటైనర్‌లో ఉన్న వస్తువును మరో కంటైనర్‌లోకి మారుస్తున్న టెస్లా బోట్‌ను మనం చూడవచ్చు.
గత ఏడాది అక్టోబర్‌లో ఎలాన్ మస్క్ ప్రకటించిన సరిగ్గా ఏడు నెలల తర్వాత టెస్లా బోట్ ఒక విధమైన ఉత్పత్తిగా మారినట్లు తెలుస్తోంది. టెస్లా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సైబర్ ట్రక్‌ల ఉత్పత్తి తర్వాత.. ఈ హ్యూమనాయిడ్ రోబోట్‌ల తయారీపై దృష్టిపెట్టే అవకాశం ఉంది. భవిష్యత్‌లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెజిలెన్స్ మరింత అభివృద్ధి చెందితే ఇలాంటి నూతన ఆవిష్కరణలు మరెన్నో చూడగలుగుతాం. ప్రస్తుతం ఈ తరహా రోబోటిక్ టెక్నాలజీ జపాన్ అత్యధికంగా వినియోగిస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








