టెస్లా సైబర్ ట్రక్ అద్దం పగిలినా ఆర్డర్లలో దుమ్మురేపింది

By Gizbot Bureau
|

టెస్లా కంపెనీ తాజాగా సైబర్ ట్రక్ పేరుతో తీసుకువచ్చిన పికప్ సైబర్ ట్రక్ అద్దాలపై డెమో సమయంలో అవి పగిలిన విషయం తెలిసిందే. ఈ అద్దం పగిలిన దెబ్బకు టెస్లా షేర్లు శుక్రవారం పడిపోయాయి. దీంతో కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ఆస్తులు ఒక్క రోజులోనే ఐదున్నర కోట్ల వేల రూపాయలకు పైగా ఆవిరయ్యాయి. సైబర్ ట్రక్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్‌ను టెస్లా తయారు చేసింది. గత గురువారం కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ దానిని ఆవిష్కరించారు.

అద్దాలు పగలవని లైవ్‌లో..
 

ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ట్రక్ చాలా గట్టిదని, దీని అద్దాలు పగలవని లైవ్‌లో పరీక్షింపచేశారు. టెస్లా డిజైనర్ మెటల్ బాల్‌తో అద్దాలపై కొట్టగా అవి పగిలిపోయాయి. తొలుత గొడ్డలితో కొట్టగా ట్రక్ డోర్ డ్యామేజ్ కాలేదు. కానీ మెటల్ బాల్‌తో అద్దాలపై కొట్టగా అవి డ్యామేజ్ అయ్యాయి. కేవలం అద్దం పగిలిపోవడం కారణంగా ఎలాన్ మస్క్ భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది.

100 డాలర్ల రీఫండబుల్ అమౌంట్‌

మరో విషయం ఏమంటే అద్దం పగిలినప్పటికీ ఈ పికప్ ట్రక్‌కు ఆదరణ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే తమకు 2 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చినట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ట్రక్కును మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని లాంచింగ్ సమయంలోనే చెప్పారు. టెస్లా వెబ్ సైట్ ద్వారా 100 డాలర్ల రీఫండబుల్ అమౌంట్‌తో ఈ ట్రక్స్‌ను బుక్ చేసుకోవచ్చు.

ప్రొడక్షన్ 2022 నాటికి స్టార్ట్

తమకు వచ్చిన ఆర్డర్స్‌లో 42 శాతం $49,900 విలువ కలిగిన డ్యూయల్ మోటార్ ఆప్షన్ వాహనాలకు, 41 శాతం $69,900 విలువ కలిగిన ట్రిపుల్ మోటార్ ఆప్షన్‌కు వచ్చినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. ప్రొడక్షన్ 2022 నాటికి స్టార్ట్ అవుతుందని చెప్పారు. 17 శాతం మాత్రమే $39,900 విలువ కలిగిన సింగిల్ మోటార్ వర్షన్ వెహికిల్స్‌కు వచ్చినట్లు తెలిపారు. సింగిల్ మోటార్ వర్షన్ వెహికిల్‌కు 100 డాలర్ల డిపాజిట్ ఉండగా, మోడల్ 3 సెడాన్‌కు 1,000 డాలర్ల డిపాజిట్ ఉంది.

ఒక్క రోజులోనే 768 మిలియన్ డాలర్లు కరిగిపోయింది
 

టెస్లా సంస్థ తాజాగా సైబర్ ట్రక్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్‌ను పరిచయం చేసింది. ఈ సైబర్ ట్రక్ వివరాలను వెల్లడిస్తున్న సమయంలో దాని కిటికీ అద్దాలు అసలు పగలవని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత దానిపై మెటల్ బాల్ విసిరి లైవ్‌లో దానిని చూపించాలనుకున్నారు. ఈ డెమో సమయంలో గురువారం కిటికీ అద్దం పగిలిపోయింది. టెస్లా ఈ ప్రయోగం ఫెయిలై, షేర్లు పతనమవడంతో ఎలాన్ మస్క్ ఆస్తులు కూడా కొంతమేర కరిగిపోయాయి. ఆయన సంపద ఒక్క రోజులోనే 768 మిలియన్ డాలర్లు కరిగిపోయింది. ఆయన సంపద 16,00,97,49,80,000కు పైగా ఉంటుంది. కరిగిపోయిన ఆస్తులు మన కరెన్సీలో రూ.5,500 కోట్లకు (768 మిలియన్ డాలర్లు) పైగా ఉంటుంది. కంపెనీ షేర్లు 333.41 డాలర్లకు పడిపోయాయి

Most Read Articles
Best Mobiles in India

English summary
Tesla gets 1.46 lakh orders for 'Cybertruck', reveals Elon Musk

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X