నిరుద్యోగులకు టెస్లా గుడ్ న్యూస్.. ఇండియాలో ఉద్యోగాల జాతర.. మీరూ అప్లై చేసుకోండి!
Tesla India: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, ఇండియాలో దూకుడు పెంచింది. త్వరలోనే మనదేశంలో ఎలక్ట్రిక్ కార్లను అమ్మడం మొదలుపెట్టేందుకు రెడీ అవుతోంది. దీనికి సంకేతంగానే ఉద్యోగుల్ని తీసుకోవడం స్టార్ట్ చేసింది. రీసెంట్‌గా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మన ప్రధాని నరేంద్ర మోదీని అమెరికాలో కలిసిన సంగతి తెలిసిందే. ఆ మీటింగ్ తర్వాతే టెస్లా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఇండియాలో కార్ల అమ్మకాలు ఎప్పుడు మొదలుపెడతారనేది టెస్లా ఇంకా చెప్పకపోయినా, లింక్డ్‌ఇన్‌లో మాత్రం ఏకంగా 13 రకాల ఉద్యోగాల కోసం పోస్టులు పెట్టింది. కస్టమర్లతో డైరెక్ట్‌గా మాట్లాడే ఉద్యోగులతో పాటు, బ్యాక్-ఎండ్ సపోర్ట్ చేసే వాళ్ల కోసం కూడా జాబ్స్ ఉన్నాయి.

* ఏయే ఉద్యోగాలు, ఎక్కడెక్కడ?
టెస్లా చాలా విభాగాల్లో ఖాళీలని భర్తీ చేస్తోంది. కొన్ని ముఖ్యమైన ఉద్యోగాలు చూస్తే, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్.. కస్టమర్ సపోర్ట్ సూపర్‌వైజర్.. కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్.. సర్వీస్ అడ్వైజర్.. ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్.. సర్వీస్ మేనేజర్.. టెస్లా అడ్వైజర్.. పార్ట్స్ అడ్వైజర్.. బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్.. స్టోర్ మేనేజర్.. సర్వీస్ టెక్నీషియన్.
వీటిలో సర్వీస్ టెక్నీషియన్, టెస్లా అడ్వైజర్ లాంటి కనీసం ఐదు రకాల ఉద్యోగాలు ముంబై, ఢిల్లీ రెండిట్లోనూ ఉన్నాయి. మిగతా ఉద్యోగాలు, అంటే కస్టమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ లాంటివి ప్రస్తుతానికి ముంబైలోనే ఉన్నాయి.
* ఇండియా ఎంట్రీకి ఎందుకింత లేట్
టెస్లా ఇండియాలోకి రావాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. కానీ కొన్ని సమస్యలు అడ్డుపడుతూ వచ్చాయి. అందులో ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీలు చాలా ఎక్కువ ఉండటమే ముఖ్యమైన సమస్య. దీనివల్ల టెస్లా కార్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ముందు కార్లు అమ్మడానికి, సర్వీస్ చేయడానికి పర్మిషన్ ఇస్తేనే ఇండియాలో ఫ్యాక్టరీ పెడతామని మస్క్ చాలాసార్లు చెప్పారు.
2022లో మస్క్ ఇండియాకు వచ్చి టెస్లా ఎంట్రీ గురించి మాట్లాడతారని అనుకున్నారు. కానీ అమెరికాలో ఉద్యోగాల కోతలు, కార్ల రీకాల్స్ లాంటి అర్జెంట్ పనులు ఉండటంతో ఆయన పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు. ఏదేమైనా చివరికి టెస్లా ఇండియాలో రావడానికి సిద్ధమయింది ఉద్యోగులతో పాటు కొనుగోలుదారులకు కూడా ఇది గుడ్ న్యూస్.
* ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు పెరుగుతున్న క్రేజ్
ఒకప్పుడు ఇండియాలో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లపై ఇంపోర్ట్ డ్యూటీ ఏకంగా 110% ఉండేది. కానీ రీసెంట్‌గా గవర్నమెంట్ దీన్ని తగ్గించింది. 40 వేల డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై ఇప్పుడు 70% టాక్స్ మాత్రమే ఉంది. ఈ మార్పుతో టెస్లా ఇండియాలోకి రావడం కొంచెం ఈజీ అవుతుంది.
ప్రపంచంలోనే గ్రీన్ హౌస్ గ్యాస్‌లను ఎక్కువగా రిలీజ్ చేసే దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉంది. కానీ 2070 నాటికి నెట్-జీరో ఎమిషన్స్‌ను సాధించాలని ఇండియా టార్గెట్ పెట్టుకుంది. ఇండియాలో మిడిల్ క్లాస్ జనాభా పెరుగుతోంది, ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు మార్కెట్ కూడా ఊపందుకుంటోంది. దీంతో టెస్లాకు ఇండియా ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.
* భవిష్యత్తు సంగతేంటి
టెస్లాకు సలహాలు ఇచ్చే 'ది ఆసియా గ్రూప్ (TAG)' అనే సంస్థ, ఇండియా కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలపై జరిగిన మీటింగ్‌కు రీసెంట్‌గా హాజరైంది. విన్‌ఫాస్ట్, మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, కియా, వోక్స్‌వ్యాగన్, రెనో, మెర్సిడెస్-బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, ఆడి లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈ మీటింగ్‌లో పాల్గొన్నాయి.
ఇండియాలో దిగుమతి చేసుకున్న కార్లతో టెస్లా సక్సెస్ అయితే, ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టే ఆలోచన కూడా చేయొచ్చు. కానీ ఇండియాలో ఎప్పటికప్పుడు మారుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలు, మార్కెట్ పరిస్థితులను టెస్లా ఎలా డీల్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications








