ఆ ఇంట్లో 500 ఫోన్‌లు, 4 లక్షలు సిమ్ కార్డులు

సోషల్ మీడియాలో నకిలీ లైక్స్ దందా రోజురోజుకు పెరిగిపోతోంది. చైనా వస్తువులకు సోషల్ మీడియాలో మరింత హైప్ తీసుకువచ్చేందుకుగాను ముగ్గురు చైనా వ్యక్తులు నిర్వహిస్తోన్న 'click farm'ను థాయ్‌లాండ్ పోలీసులు చేధించారు. వీరిని అదుపులోకి తీసుకున్న థాయ్‌ల్యాండ్ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

500 స్మార్ట్‌ఫోన్‌లు, 4 లక్షలు సిమ్ కార్డులు

కాంబోడియన్ సరిహద్దు ప్రాంతంలో ఈ నకిలీ క్లిక్స్ రాకెట్ నిర్వహించబడుతోంది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆదివారం వీరు ఉంటోన్న ఇంట్లో సోదాలు నిర్వహించగా 10 కంప్యూటర్‌లతో పాటు 500 వరకు స్మార్ట్‌ఫోన్‌లు ఇంకా 4 లక్షల వరకు సిమ్ కార్డులు బయటపడ్డాయి. ఈ సిమ్ కార్డులను సరైన్ ప్రూఫ్స్ లేకుండా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

వేరువేరు అకౌంట్ల నుంచి నకిలీ క్లిక్స్ ..

చైనా కంపెనీలు తమను హైర్ చేసుకున్నాయని, వాళ్ల ప్రొడక్ట్స్ అయిన హెర్బల్ మెడిసన్స్, క్యాండీ ఇంకా టూర్ కంపెనీలకు విస్తృతంగా హైప్ తీసుకువచ్చేందుకుగాను వారివారి సోషల్ మీడియా ప్రొడక్ట్ పేజీలకు వేరువేరు అకౌంట్ల నుంచి నకిలీ క్లిక్స్ ఇస్తున్నామని విచారణలో పట్టుబడినవ్యక్తులు పోలీసులకు వెల్లడించారు. టూరిస్ట్ వీసాల పై ఇండోనేషియాలోకి అడుగుపెట్టిన ఈ చైనా వ్యక్తులు ఈ నకిలీ లైక్స్ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది.

రోజురోజుకు పెరిగిపోతున్న ఆన్‌లైన్ స్కామ్స్..

ఇటీవల కాలంలో ఆన్‌లైన్ వేదికగా అనేక Click farms పేట్రేగి పోతున్నాయి. ఈ రోజుల్లో ఏ ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలన్న ఆయా ప్రొడక్ట్‌లకు సంబంధించి సోషల్ మీడియా హ్యాండిల్స్ నెటిజనులు విస్తృతంగా ఫాలో అయిపోతున్నారు. ఈ క్రమంలో కొత్తగా లాంచ్ అయ్యే ప్రొడక్ట్స్‌కు విస్తృతమైన హైప్ కల్పించేందుకు గంటల్లోనే వేలాది క్లిక్స్ జనరేట్ అయ్యేలా Click farms చూసుకుంటున్నాయి.

ఈ దేశాల్లో జోరుగా Click farms వ్యాపారం...

భారత్, ఫిలిప్పిన్స్, ఇండోనేషియా ఇంకా చైనాల్లో Click farms వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Thai Police Bust 'Click Farm' Working With 500 Smartphones, 400,000 SIM Cards to Boost 'Likes'. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot