ఫేస్‌బుక్ జూకర్స్‌కు ధాయ్‌లాండ్ ప్రభుత్వం వార్నింగ్

Posted By: Super

ఫేస్‌బుక్ జూకర్స్‌కు ధాయ్‌లాండ్ ప్రభుత్వం వార్నింగ్

ధాయ్‌లాండ్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సమాచారం ఫేస్‌బుక్‌లో వారిని అప్రతిష్టలు పాలు చేస్తుండడంతో ధాయ్‌లాండ్ గవర్నమెంట్ ఫేస్‌బుక్ యాజమాన్యానికి వాటికి సంబంధించిన సుమారు 10,000 వేల ఫేస్‌బుక్ పేజీలను తొలగించాల్సిందిగా కొరడం జరిగింది. దీనితో పాటు ధాయ్‌లాండ్ దేశంలో ఎవరైతే ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారో ఆ యూజర్స్ దేశం యొక్క విధివిధానాలను అతిక్రమించిన వారిపై కూడా చర్యలు తీసుకొవడం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చింది.

ఈ సంధర్బంలో ధాయ్ సమాచార, సాంకేతిక మంత్రి అనిధుత్ మాట్లాడుతూ ఫేస్‌బుక్ యూజర్స్ రాయల్ ఫ్యామిలీకి చెందిన సమాచారాన్ని డిలిట్ చేయకపొతే యూజర్స్ ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. గత వారంలో ధాయ్‌లాండ్ రాణిపై అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పంపినటువంటి 61 సంవత్సరాలు వయసు కలిగిన ముసలి వ్యక్తికి 20 సంవత్సరాలు జైలు శిక్షను ధాయ్ ప్రభుత్వం ఖరారు చేసిన సంఘటనను కూడా ఫేస్‌బుక్ యూజర్స్‌కు గుర్తు చేశారు.

అంతేకాకుండా ఫేస్‌బుక్‌లో రాయల్ ప్యామిలీపై వచ్చిన అన్ని రకాల కంటెంట్‌కి, మేసేజ్‌లకు, ఫేస్‌బుక్ సిఈవో మార్క్ జూకర్స్ బర్గ్ భాద్యత వహించాల్సి ఉంటుందని ఇంటర్యూలో తెలిపారు. దీనిపై ఫేస్‌బుక్ సిఈవో మార్క్ జూకర్స్ బర్గ్ తక్షణమే స్పందించి, రాయల్ ప్యామిలీకి సంబంధించిన అన్ని రకాల మేసేజ్‌లను పూర్తిగా తొలగించాల్సిందిగా కొరడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot