గూగుల్ సర్చ్‌ టాప్ పొజిషన్లో సన్నీ అవుట్ ప్రియా ఇన్

|

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ సైట్‌లో 2018 సంవత్సరానికి గాను ప్రపంచ వ్యాప్తంగా ఏడాది గూగుల్ సర్చ్‌లో మోస్ట్ సెర్డ్చ్ పర్సనాలిటీల టాప్ ప్లేస్ అందుకున్న‌ది ఎవ‌రో అని లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో అంద‌రికంటే ముందు నిలిచి అంద‌రికీ షాక్ ఇచ్చింది సోష‌ల్ మీడియా సంచ‌ల‌నం ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. "ఒరు ఆధార్ లవ్" సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన ఈ భామ‌ ఒక్క‌సారి క‌న్నుగొట్టి దేశాన్ని ప‌డ‌గొట్టింది.గతంలో ఈ జాబితాలో స‌న్నీలియోన్ అగ్ర‌స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు ఆ రికార్డ్ ప్రియా వారియ‌ర్ పేరు మీద‌కు వ‌చ్చేసింది. పోర్న్ సైట్స్ బ్యాన్ కావ‌డంతో స‌న్నీ హ‌వా ప‌డిపోయింది.ఈ సారి స‌న్నీలియోన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ల‌కు గూగుల్ టాప్ స‌ర్చింగ్ లో చోటు ద‌క్క‌లేదు.తాజాగా గూగుల్ విడుదల చేసిన మోస్ట్ సెర్డ్చ్ పర్సనాలిటీల లిస్ట్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

 

వోడాఫోన్‌ దూకుడు : రూ.597 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ లాంచ్

ప్రియా ప్ర‌కాశ్ వారియర్

ప్రియా ప్ర‌కాశ్ వారియర్

ప్రియా ప్ర‌కాశ్ వారియర్ నెం.1 స్థానం దక్కించుకుంది. కొన్నేళ్లుగా ఈ జాబితాలో స‌న్నీలియోన్ అగ్ర‌స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు ఆ రికార్డ్ ప్రియా వారియ‌ర్ పేరు మీద‌కు వ‌చ్చేసింది.ఈ ఏడాది సన్నీ లియోన్ సినిమాలు తక్కువగా ఉండటం, పోర్న్ సైట్స్ బ్యాన్ కావ‌డంతో స‌న్నీలియోన్ హ‌వా ప‌డిపోయింది.

నిక్ జొనాస్

నిక్ జొనాస్

గూగుల్ సెర్చ్ లో ప్రియా తర్వాత నిక్ జోనాస్ గురించి ఎక్కువ‌గా వెతికారు. ప్రియాంకా చోప్రానే పెళ్లాడబోయే కుర్రాడు ఎవరు అంటూ ఆయ‌న కోసం చూసారు మ‌న ప్రేక్ష‌కులు.

సప్నా చౌదరి

సప్నా చౌదరి

ఈ లిస్టులో మూడో స్థానంలో హర్యానవి డాన్సర్ సప్నా చౌదరి నిలిచారు. అప్పటికే డాన్సర్‌గా,స్టేజి పెర్ఫార్మర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సప్నా చౌదరి బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యారు.

ప్రియాంక చోప్రా
 

ప్రియాంక చోప్రా

ఈ లిస్టులో నాలుగవ స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచారు. 2018 ప్రియాంకా చోప్రా కు గొప్ప సంవత్సరం అని చెప్పుకోవచ్చు. నిక్ జొనాస్‌తో ఆమె ప్రేమ, పెళ్లి వ్యవహారం అలాగే హాలీవుడ్ మరియు బాలీవుడ్లో చేస్తున్న సినిమాలు హాట్ టాపిక్ అయ్యాయి.

ఆనంద్ ఆహుజా

ఆనంద్ ఆహుజా

ఈ లిస్టులో ఐదవ స్థానంలో సోనమ్ కపూర్ భర్త ఆనంద్ ఆహుజా నిలిచారు.

సారా అలీ ఖాన్

సారా అలీ ఖాన్

ఈ లిస్టులో ఆరవ స్థానంలో సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ కూతురు సారా అలీ ఖాన్ నిలిచారు.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

ఈ లిస్టులో ఏడవ స్థానంలో ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నిలిచారు.

మేఘన్ మార్కెల్

మేఘన్ మార్కెల్

ఈ లిస్టులో ఎనిమిదవ స్థానంలో అమెరికన్ నటి మేఘన్ మార్కెల్ నిలిచారు.

అనూప్ జలోటా

అనూప్ జలోటా

ఈ లిస్టులో తొమ్మిదవ స్థానంలో 65 ఏళ్ల భజన్ మేస్ట్రో అనూప్ జలోటా నిలిచారు.

బోనీ కపూర్

బోనీ కపూర్

ఈ లిస్టులో పదోవ స్థానంలో శ్రీ‌దేవి భ‌ర్త‌ బోనీ కపూర్ నిలిచారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
The 10 most searched celebrities in 2018, according to Google.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X