సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే
టెక్నాలజీ అమిత వేగంగా పుంజుకుంటున్న తరుణంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అనేవి ఇప్పుడు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి.
టెక్నాలజీ అమిత వేగంగా పుంజుకుంటున్న తరుణంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అనేవి ఇప్పుడు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. దిగ్గజ కంపెనీలు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారుచేసే పనిలో బిజీగా ఉన్నాయి. మరి ఈ సెల్ప్ డ్రైవింగ్ కార్ల వల్ల లాభమా నష్టమా అనే విషయాలను ఇప్పటి నుంచే అందరూ విశ్లేషణ చేస్తున్నారు. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ద్వారా రోడ మీద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కొందరు వాదిస్తుండగా దీని వల్ల ట్రాఫిక్ జాం క్లియర్ అయి త్వరగా గమ్యానికి చేరుకోవచ్చని కొందరు చెబుతున్నారు. మరి దీనివల్ల కలిగే ప్రయోజనాలను ఓ సారి పరిశీలిస్లే...

సేఫ్టీ
మానవ తప్పిదాల వల్ల రోడ్ల మీద ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్న విషయాన్ని మనం చూస్తున్నాము. ఇప్పుడు రానున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల ఈ ప్రమాదాలు కొంతమేరకైనా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ మాట్లాడుతూ ఫోన్ డ్రైవింగ్ లాంటి వాటికి రాంరాం పాడవచ్చు. అయితే దీన్ని హ్యాక్ చేయడం వల్ల కూడా అనేక ఇబ్బందులు తలత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లెస్ ట్రాఫిక్
ఈ రోజుల్లో ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత గమ్యానికి చేరాలంటే చాలా కష్టమే. అత్యవసర పని మీద వెళుతున్నప్పుడు రోడ్డు మీద ట్రాపిక్ జాం అయితే ఇక అంతే సంగతులు. దీనికి ప్రధాన కారణం వాహనదారులు రూల్స్ సరిగా పాటించకపోవడమే. అయితే ఇప్పుడు వచ్చేవి సెల్ప్ డ్రైవింగ్ కార్లు కావడంతో దీనికి పూర్తిగా చెక్ పెట్టవచ్చు. అయితే దీనిని కొందరు వ్యతిరేకిస్తున్నారు. నిజ జీవితంలో ఈ టెక్నాలజీ ట్రాఫిక్ ని క్లియర్ చేయలేదని కొట్టి పారేస్తున్నారు.

ఉత్పత్తి పెరుగుదల
దీని ద్వారా లేబర్ కాస్ట్ భారీగా తగ్గి ఉత్పత్తి మరింతగా పెరుగుతుందని కొందరు చెబుతున్నారు. దీని వల్ల ప్రతి ఒక్కరికీ ఓ వాహనం అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం ఈ టెక్నాలజీ వల్ల జాబులు తగ్గిపోతాయని నిరుద్యోగం ప్రబలిపోతుందని వాదిస్తున్నారు.

లో కాస్ట్
దీని వల్ల ప్రతి డ్రైవర్ ఖర్చు యజమానులకు తగ్గుతుంది. ఇన్సూరెన్స్ పాలసీలు లాంటివి ఉండవు. అయితే దీనిపై కూడా కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ముందు ముందు ప్రమాదమేనని చెబుతున్నారు.

పార్కింట్ స్పేస్
కారు బయటకు తీయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు అక్కడ పార్కింగ్ అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. రోడ్డు మీద పార్క్ చేస్తే పోలీసులతో సమస్య..వీటిని అధిగమించవచ్చు.అయితే కొందరు మాత్రం ఇది చాలా ఛాలెంజింగ్ తో కూడుకున్నదని నిజజీవితంలో చాలా కష్టమని వాదిస్తారు.


Click it and Unblock the Notifications








