ఐఫోన్ చరిత్రలో 8 అతిపెద్ద వివాదాలు

Posted By:

ప్రపంచపు అత్యుత్తమ కంపెనీలలో యాపిల్ ఒకటి. తన విప్లవాత్మక ఐఫోన్‌తో మొబైల్ ఫోన్‌ల ప్రపంచాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించిన యాపిల్ స్మార్ట్‌ఫోన్‌‍ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా యాపిల్ ఐఫోన్ చరిత్రలో తలెత్తిన 8 అతిపెద్ద వివాదాలను మీ ముందుంచుతున్నాం....

స్టీవ్ జాబ్స్ ఆలోచల నుంచి పుట్టుకొచ్చిన యాపిల్ ఐఫోన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేసిన యాపిల్ ఐఫోన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన హుందాతనంతో ప్రపంచ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. 2007, జూన్ 29న స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి యాపిల్ ఐఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసారు. అప్పటి నుంచి యాపిల్ ఐఫోన్ అమ్మకాలు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లను శాసిస్తూనే వస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ చరిత్రలో 8 అతిపెద్ద వివాదాలు

యాపిల్ మొదటి ఐఫోన్ 599 డాలర్ల ధర ట్యాగ్‌తో మార్కెట్లో విడుదలైంది. మూడు నెలలు గడిచిందో లేదో ఫోన్ ధరను 399 డాలర్లకు యాపిల్ తగ్గించింది.

ఐఫోన్ చరిత్రలో 8 అతిపెద్ద వివాదాలు

అడోబ్ ఫ్లాష్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికి తొలి రోజుల్లో యాపిల్ ఐఫోన్‌లలో ఫ్లాష్ సపోర్ట్ చేయలేదు. ఈ అంశం పలువురు యాపిల్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది.

ఐఫోన్ చరిత్రలో 8 అతిపెద్ద వివాదాలు

2012లో యాపిల్ విడుదల చేసిన ఐఓఎస్ 6 మ్యాప్స్ ఫీచర్ ఫేలవమైన ఫలితాలతో డిజాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది.

ఐఫోన్ చరిత్రలో 8 అతిపెద్ద వివాదాలు

ఐఫోన్ 4లో యాంటీనా సమస్య.

ఐఫోన్ చరిత్రలో 8 అతిపెద్ద వివాదాలు

చైనాలోని యాపిల్ ఐఫోన్‌ల తయారీ కంపెనీలో దారుణమైన పరిస్థితులు.

ఐఫోన్ చరిత్రలో 8 అతిపెద్ద వివాదాలు

ఫేలవమైన యాపిల్ ఐఓఎస్ 8.0.1 అప్‌డేట్.

ఐఫోన్ చరిత్రలో 8 అతిపెద్ద వివాదాలు

ఐఫోన్ 4 విడుదలవటానికి కొద్ది రోజుల ముందు ఓ ప్రముఖ టెక్నాలజీ వెబ్‌సైట్ ఐఫోన్ 4 ప్రోటోటైప్‌కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది. మొదట్లో ఈ వార్తలను ఖండించిన యాపిల్ తరువాత ఒప్పుకోక తప్పలేదు. వాస్తవానికి ప్రోటోటైప్ దశలో ఉన్న ఐఫోన్ ను యాపిల్ ఉద్యోగి ఓ బార్ లో మరిచిపోయి వెళ్లిపోవటంతో ఆ ఫోన్ ను ఆ వెబ్ సైట్ వేరొకరి వద్ద కొనుగోలు చేసింది.

ఐఫోన్ చరిత్రలో 8 అతిపెద్ద వివాదాలు

యాపిల్ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్‌లు వంగిపోతున్నాయని పలు వినియోగదారులు ఫిర్యాదు చేయటంతో ఒక్కసారిగా మార్కెట్ ఉలిక్కి పడింది బెండ్ గేట్ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌లు కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The 8 Biggest Controversies in iPhone History. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot