ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లు, ఫట్లు
ఈ ఏడాది మరో కొద్ది రోజుల్లో వెళ్లిపోబోతోంది. కాబట్టి ఈ ఏడాది టెక్నాలజీ రంగాన్ని రివ్యూ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల విజయాలు వైఫల్యాలను చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. హార్డ్ వేర్, సాప్ట్ వేర్ రంగంలో ఈ దిగ్గజాలు చాలా ముందుకు దూసుకువెళ్లాయి.

అలాగే కొన్ని విషయాల్లో చతికిలబడ్డాయి. గూగుల్ ఈ విషయంలో చాలా ముందంజలో ఉంది. యాప్స్ తో సరికొత్త ప్రపంచాన్ని వినియోగదారులకు చూపించింది. అలాగే పిక్సల్ ఫోన్లతో దూకుడును కనబరిచింది. ఇక ఆపిల్ విషయానికొస్తే ఈ ఏడాది కొత్త ఫోన్లతో సంచలనాలనే నమోదు చేసిందని చెప్పవచ్చు. ఈ సంధర్భంగా ఈ ఏడాది వీటి నుంచి వచ్చిన హిట్లు , ఫట్లు ఓ సారి మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఆపిల్ న్యూ ఫోన్ విజయం
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆపిల్ ఈ ఏడాది దుమ్మరేపింది. ఆ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లు రికార్డు అమ్మకాలతో దూసుకువెళ్లాయి.

వైఫల్యం
అయితే వినియోగదారులకు ధరలు అధికం అనే అంశం పూర్తిగా నిరాశను మిగిల్చింది.

గూగుల్ ఫిక్సల్ 3 కెమెరా
కెమెరా రంగంలో గూగుల్ కొత్త ఒరవడిని సృష్టించింది. కొత్త జనరేషన్ కెమెరా టెక్నాలజీని ప్రవేశపెట్టి ఓౌరా అనిపించింది.

బగ్స్
అయితే ఈ ఫోన్లు బగ్స్ తో వినియోగదారులను తీవ్రంగా నిరాశపర్చాయి. ఇప్పటికే ఈ వైఫల్యం గూగుల్ ఫోన్లని వెంటాడుతోంది.

మైక్రోసాఫ్ట్ ల్యాపీ
చాలా రోజుల తరువాత మైక్రోసాఫ్ట్ హార్డ్ వేర్ రంగంలో వినియోగదారులకు మంచి అనుభూతిని అందించింది.

ధరలు ఆకాశంలో
అయితే మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన ల్యాపీలు ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్రంగా నిరాశపరిచాయి.

ఆపిల్ కొత్త లోకం
ఆపిల్ నుంచి వచ్చిన కొత్త ఐఫోన్ ,మ్యాక్ బుక్, ఆపిల్ వాచీలు మార్కెట్లో దుమ్మురేపాయి. iOS 12, MojaveOS ఆపరేటింగ్ సిస్టంతో వచ్చిన ఈ గాడ్జెట్లు మార్కెట్లో సత్తా చాటాయి

గూగుల్ పై
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మేకర్స్ ఈ ఏడాది కొత్త ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ పైని అందుకున్నారు. Android Pie 9.0 ద్వారా వినియోగదారులు గూగుల్ పై మరింత ఆసక్తిని కనపర్చారు.

ఆపిల్ పవర్ మ్యాట్
ప్రతి ఏడాది ఆపిల్ అభిమానులు కంపెనీ నుంచి కొత్త ప్రొడక్ట ఏదైనా వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ఏడాది అలాంటిది ఏమి లేదని తేలిపోయింది. గూగుల్ వైర్ లెస్ ఛార్జింగ్ మ్యాట్ విడుదలపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ లేదు.

నో ఆండ్రాయిడ్ అప్ డేట్
ఆండ్రాయిడ్ ఫోన్లకు ఇప్పటిదాకా ఎటువంటి అప్ డేట్ లేదు. Android 9.0 మార్కెట్లోకి వచ్చినా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.

విండోస్ 10 విజయం
మైక్రోసాప్ట్ ఈ ఏడాది విండోస 10 ఫీచర్ తో సరికొత్త ప్రభంజాన్ని సృష్టించింది.

గూగుల్ డేటా బ్రీచ్ ఫట్
గూగుల్ ఏ ఏడాది నిరాశే మిగిల్చిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా డేటా లీక్ వ్యవహారం ఆ కంపెనీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది.

ఆపిల్, మైక్రోసాఫ్ట్ విజయం
ఆపిలల్ మార్కెట్లో 1 బిలియన్ క్యాప్ కి చేరుకుని రికార్డు సృష్టించింది.అలాగే మైక్రోసాఫ్ట్ కూడా మార్కెట్లో దుమ్మురేపే ఫలితాలను రాబట్టింది.

ఆపిల్ హోమ్ ప్యాడ్స్
ఆపిల్ నుంచి గూగుల్, మైక్రోసాప్ట్ కి పోటీగా కొత్తగా ఆపిల్ స్పీకర్స్ ని తీసుకువచ్చింది. స్పీకర్ సెగ్మెంట్లో పాగా వేసింది.


Click it and Unblock the Notifications








