Home
News

నేటితో సెల్‌ఫోన్‌కు 40 సంవత్సరాలు!

అది ఏప్రిల్ 3, 1973.. మోటరోలా ఇంజనీర్ మార్టీ కూపర్ సెల్‌ఫోన్ నుంచి మొట్టమొదటి పబ్లిక్ కాల్ చేసారు. ఆ కాల్ రైవల్ రిసెర్చ్ డిపార్ట్‌మెంట్ బెల్ ల్యాబ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జోయెల్ ఎంగెల్‌కు అందింది. అప్పుడు కూపర్ ఈ విధంగా స్పందించారు ‘జోయెల్, దిస్ ఈజీ మార్టీ, ఐయామ్ కాలింగ్ యూ ఫ్రం ఏ సెల్‌ఫోన్, ఏ రియల్ హ్యాండిల్డ్ పోర్టబుల్ సెల్‌ఫోన్' అంటూ సంభాషణలు సాగాయి. ప్రపంచపు మొట్టమొదటి సెల్‌ఫోన్‌గా ‘మోటరోలా డైనాటాక్ 8000 ఎక్స్' (Motorola DynaTAC 8000x) చరిత్రకెక్కింది.

The cellphone is 40 years old today

కమ్యూనికేషన్ ప్రపంచంలో మొబైల్‌ఫోన్ సరికొత్త అధ్యయనానికి తెరలేపింది. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ఈ బుల్లి సమాచార పరికరం సెకన్ల వ్యవధిలో బంధాలను కలుపుతోంది. ధనిక, పేద అన్నభేదం లేకండా అన్ని వర్గాల ప్రజలకు సెల్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేశాయి.

1876వ సంవత్సరం.. ప్రపంచంలో మొట్టమొదటగా టెలిఫోన్‌ కనుగొనబడింది. అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ పరిశోధనల పర్యవసానంగా ఒకచోటు నుంచి మరో చోటికి మనిషి మాట వినిపించసాగింది. అలా ప్రారంభమైన టెలిఫోన్‌ పరిణామ క్రమం నేడు మనం ఉపయోగిస్తున్న ఆధునిక ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లు, అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ల వరకు విస్తరించింది. 1947లో ట్రాన్సిస్టర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దింతో టెలిఫోన్ కొత్త పోకడలను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఆటో మ్యాటిక్ రీడైలింగ్, నెంబర్ ఐడెంటిఫికేషన్, కాల్ వెయిటింగ్, కాన్ఫిరెన్సింగ్ వంటి ఫీచర్లు అదనంగా జతయ్యాయి. మొబైల్‌ఫోన్‌ చరిత్రను గమనిస్తే 1960లో ప్రపంచంలోని మొట్ట మొదటి కార్‌ఫోన్‌ ఆవిష్కృతమైంది.

అది కూడా పాక్షికంగా వుండే ఆటోమేటిక్‌ సర్వీసు. మనం నేడు వాడుతున్న మొబైల్‌ ఫోనును సెల్‌ఫోన్‌, లేక సెల్యులార్‌ ఫోన్‌ అని కూడా పిలుస్తారు. మొబైల్‌ ఫోన్లకు, కార్డ్‌ లెస్‌ ఫోన్లకు వ్యత్యాసం వుంది. కార్డ్‌లెస్‌ ఫోన్లు బేస్‌ఫోన్లకు కేవలం కొన్ని మీటర్ల వ్యాస పరిథిలోనే పని చేస్తాయి. సాధారణ ల్యాండ్‌లైన్‌ కేవలం టెలిఫోన్‌ సంభాషణకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక మొబైల్‌ ఫోన్ అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X