మొబైల్ డేటా స్పీడ్‌లో నార్త్ కొరియా టాప్, మనం పాక్ కన్నా వెనకేనట !

Written By:

మీ మొబైల్ డేటా చాలా స్లోగా ఉందా..అయితే కళ్లు మూసి తెరిచే లోపు మీరనుకున్న ఫైళ్లు డౌన్‌లోడ్ కావాలా. అయితే మీరు మరేమి ఆలోచించకుంగా నార్త్ కొరియాకు వెళ్లాల్సిందే. జోక్ అనుకుంటున్నారా...ఇది జోక్ కాదు పచ్చి నిజం. ప్రపంచంలో ఇప్పుడు అత్యంత స్పీడు ఇంటర్నెట్ కలిగిన దేశాల్లో నార్త్ కొరియా మొదటి స్థానంలో ఉంది. మన దేశం స్పీడులో ఎన్నో స్థానంలో ఉందో తెలిస్ అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. పాకిస్తాన్ కన్నా తక్కువ స్థానంలో మనం ఉన్నామని వైర్‌లెస్‌ కవరేజీని మ్యాపింగ్‌ చేసే బ్రిటన్‌ సంస్థ ఓపెన్‌ సిగ్నల్‌ కొన్ని గణాంకాలను రిలీజ్ చేసింది. అవేంటో ఓ సారి చూద్దామా..

వినియోగదారులను తీవ్ర నిరాశకు గురిచేసిన షియోమి,ఆ రెండు ఫోన్లే కారణం !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాకిస్తాన్, శ్రీలంకతో పోల్చితే..

మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంకతో పోల్చితే మన దేశం 4జీ స్పీడు చాలా తక్కువని బ్రిటన్‌ సంస్థ ఓపెన్‌ సిగ్నల్‌ చెబుతోంది. ఈ కంపెనీ మొత్తం 88 దేశాల్లో 4జీ ఎల్‌టీఈ స్పీడ్‌కు సంబంధించిన ఫిబ్రవరి నెల నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో మనం చివరి స్థానంలో ఉన్నామట..చిత్రంగా ఉంది కదూ..

సగటు డౌన్‌లోడ్‌ స్పీడు..

భారత్‌లో సగటు డౌన్‌లోడ్‌ స్పీడు 6.07 ఎంబీపీఎస్‌ (మెగాబైట్స్‌ పర్‌ సెకండ్‌) అట. అదే పాకిస్తాన్‌లో ఈ వేగం 13.56.. శ్రీలంకలో 13.95 ఎంబీపీఎస్‌గా ఉంది. మొదటి స్థానంలో ఉన్న సింగపూర్‌లో 4జీ స్పీడు 44 ఎంబీపీఎస్‌గా ఉంది.

4జీ కవరేజి విషయంలో

స్పీడు విషయంలో ఎలాగున్నా.. 4జీ కవరేజి విషయంలో మాత్రం మనం 14 స్థానంలో ఉన్నాం. దేశంలో 4జీ కవరేజీ 86.26 శాతంగా ఉంది. ఈ జాబితాలో దక్షిణ కొరియా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 96 శాతం 4జీ కవరేజీ పరిధిలో ఉంది. పాక్‌లో ఇది 66 శాతంగా.. శ్రీలంకలో 45 శాతంగా ఉంది.

4జీ ఎల్‌టీఈకి సంబంధించి..

4జీ ఎల్‌టీఈకి సంబంధించి అడ్వాన్స్‌డ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని దేశాలు స్పీడు విషయంలో ముందంజలో ఉన్నాయని ‘ఓపెన్‌ సిగ్నల్‌' పేర్కొంది.

దక్షిణ కొరియా, సింగపూర్‌ వంటి చోట్ల..

దక్షిణ కొరియా, సింగపూర్‌ వంటి చోట్ల మొబైల్‌ టారిఫ్‌ ఎక్కువగా ఉంటుందని.. దీని వల్ల నెట్‌వర్క్‌పై ఒత్తిడి తక్కువగా ఉండి.. వేగం విషయంలో స్థిరత్వం ఉందని.. భారత్‌ వంటి దేశాల్లో మొబైల్‌ నెట్‌ వినియోగదారులు ఎక్కువని.. దీని వల్ల నెట్‌వర్క్‌పై ఒత్తిడి ఎక్కువగా పడి.. స్పీడు తగ్గుతోందని తెలిపింది.

నెట్‌వర్క్‌ను విస్తృతపరచడమొక్కటే..

ఎల్‌టీఈ అడ్వాన్స్‌డ్‌ నెట్‌వర్క్‌ను విస్తృతపరచడమొక్కటే దీనికి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు మన దగ్గర కూడా 4జీ డౌన్‌లోడ్‌ స్పీడు బాగా పెరుగుతుందని పేర్కొంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The countries with the world’s fastest mobile internet More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot