ఆకుపచ్చ తోరణంగా ఇండియా, నాసా ఏం చెప్పిందో చూడండి

కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న ఇండియాకి ఇది నిజంగా లడ్డు లాంటి వార్తే. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం కన్నా ఇప్పుడు ఇండియా ఆకుపచ్చ తోరణంగా ఉందని , భూమి మొత్తం పచ్చగా కనిపిస్తుందని నాసా తెలిపింది. Nation

|

కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న ఇండియాకి ఇది నిజంగా లడ్డు లాంటి వార్తే. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం కన్నా ఇప్పుడు ఇండియా ఆకుపచ్చ తోరణంగా ఉందని , భూమి మొత్తం పచ్చగా కనిపిస్తుందని నాసా తెలిపింది. National Aeronautics and Space Administration (NASA) ప్రకారం గతం కన్నా ఇప్పుడు ఇండియాలో చెట్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని అందువల్ల భూమి అంతా ఆకుపచ్చ తోరణంగా కనిపిస్తోందని తెలిపింది.

ఆకుపచ్చ తోరణంగా ఇండియా, నాసా ఏం చెప్పిందో చూడండి

భూమి పచ్చదనంలో ఇండియాతో పాటు చైనా కూడా పోటీ పడుతోందని ఈ రెండు దేశాలు భూమిని పచ్చగా ఉంచడంలో ముందంజలో దూసుకుపోతున్నాయని తెలిపింది.

నర్మదా నది తీరంలో

నర్మదా నది తీరంలో

కాగా 5 July 2017న మధ్యప్రదేశ్ లోని నర్మదా తీరంలో ఒక్కరోజులోనే దాదాపు 66 million చెట్లను నాటారని ఇది ప్రపంచ రికార్డును సృష్టించిందని నాసా తెలిపింది. దీంతో పాటు ఉత్తరప్రదేశ్ లో 800,000 volunteer ఒకే రోజులో 50.4 million చెట్లను నాటారని ఇది కూడా ఓ రికార్డని తెలిపింది.

చైనా ఇండియా

చైనా ఇండియా

ప్రపంచ దేశాలతో పోలిస్తే చైనా ఇండియాలే 9శాతం ప్లాన్ ట్ ని గ్రీన్ గా ఉంచుతున్నాయని నాసా తెలిపింది. ఈ రెండు దేశాల్లో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ పచ్చదనం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోందని ఇది అభినందించదగ్గ పరిణామని మసాచూట్స్ లో ఉన్న బోస్టన్ యూనివర్సిటీ లో Department of Earth and Environment ఫ్రొపెసర్ చి చెన్ తెలిపారు.

నాసా డేటా

నాసా డేటా

కాగా నాసా గత 20 ఏళ్ల కిత్రం ఉన్న డేటాతో ఇప్పుడు లభించిన డేటాతో పోల్చి చూసి ఈ విషయాన్ని తెలిపింది. దీనికోసం నాసా రెండు శాటిలైట్లను వినియోగించింది. ఇవి అత్యంత ఎక్కువ రిజల్యూషన్ తో కూడుకున్నవి. కాబట్టే హై రిజల్యూషన్ ఫోటోలు వచ్చాయని అవి పచ్చదనంతో నిండి ఉన్నాయని తెలిపింది.

 డ్యామేజికి ఆస్కారం లేదు

డ్యామేజికి ఆస్కారం లేదు

కాగా నాసా ఇంకా ఏం చెప్పిందంటే ఇండియా చైనాలు ప్రకృతిని ఎలాంటి ధ్వంసం చేయడం లేదంటోంది. కేవలం ఫీల్డ్ లో అలాగే అడవుల్లో మొక్కలు పెచండం ద్వారానే ఇది సాధ్యమవుతుందని తెలిపింది. అయితే బ్రెజిల్ , ఇండోనేషియాలతో పోలిస్తే ఈ రెండు దేశాలు చాలా మెరుగ్గా ఉన్నాయని పచ్చదనంలో పోటీ పడుతున్నాయని తెలిపింది .

సముద్ర జలాలన్నీ

సముద్ర జలాలన్నీ

ఇదిలా ఉంటే 2100 నాటికి సముద్ర జలాలన్నీ కలుషితమైపోతాయని అమెరికాలోని మసాఛుసెట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) హెచ్చరించింది. ఈ శతాబ్దం ముగిసేనాటికి ప్రపంచంలో ఉన్న సముద్రాల్లో 50 శాతం జలాలు రంగు మారిపోతాయని ఎంఐటీ నివేదికలో వెల్లడించింది.

 తీవ్ర రూపం దాల్చే ప్రమాదం

తీవ్ర రూపం దాల్చే ప్రమాదం

వాతావరణ ప్రభావం ఇప్పటికే సముద్ర జలాల్లో కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయని, రానున్న దశాబ్దాల్లో ఇది తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నీలి రంగు నుంచి ఆకుపచ్చ వర్ణంలోకి జలాలు మారిపోతాయని నేచర్ కమ్యూనికేషన్ జర్నల్‌లో తెలిపారు. ఎంఐటీ నిపుణుల అధ్యయన నివేదిక తాజా సంచికలో ప్రచురించారు.

ఉపగ్రహం ద్వారా

ఉపగ్రహం ద్వారా

సముద్ర తీరం, పర్యావరణానికి సంబంధించి ఉపగ్రహం ద్వారా మార్పులను గమనించినట్టు పరిశోధకులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో సంభవిస్తున్న వాతావరణం, ఉష్ణోగ్రతలు, సముద్ర జలాల తీరుతెన్నుల పరిశీలించిన నిపుణులు 2100 నాటికి తీవ్రమైన మార్పులుంటాయని హెచ్చరించారు.

జలాలు ఆకుపచ్చగా

జలాలు ఆకుపచ్చగా

ఈ శతాబ్దం చివరినాటికి సగం సముద్రాల్లో జలాలు కలుషితం(రంగు) మారిపోతాయని నిర్ధారించారు.నీలి రంగులో ఉన్న నీళ్లు మరింత ముదురు రంగులోకి మారతాయి. అలాగే కొన్ని జలాలు ఆకుపచ్చగా మారిపోతాయని ఎంఐటీ ముఖ్య పరిశోధకుడు స్ట్ఫోనీ డుక్టివిజ్ వెల్లడించారు.

Best Mobiles in India

English summary
The Earth is Greener Than it Was Two Decades Ago, And it is Because of India And China

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X