‘యాపిల్ కంప్యూటర్ వాచ్’, స్మార్ట్‌ఫోన్‌లకు ముగింపా..?

Posted By: Staff

 ‘యాపిల్ కంప్యూటర్ వాచ్’, స్మార్ట్‌ఫోన్‌లకు ముగింపా..?

 

స్మార్ట్‌ఫోన్‌ల శకం ముగింపు దశకు చేరుకోనుందా..?, ఈ అలజడిని ముందుగా పసగిట్టిన యాపిల్, ప్రత్నామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందా..? అవుననే అంటున్నాయి తాజాగా వెబ్ ప్రపంచాన్ని అలుముకున్న రూమర్లు. యాపిల్ భవిష్యత్ ఆవిష్కరణకు సంబంధించి యాపిల్ ఆసియా పంపిణీ వర్గాలు కీలక సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెక్163 డాట్ కామ్ వెలువరించిన వివరాల మేరకు  ఇంటెల్ , యాపిల్ భాగస్వామ్యంలో బ్లూటూత్ ఆధారిత ఐవోఎస్ వాచ్ రూపుదిద్దుకుంటోంది. వాచ్ స్ర్కీన్ పరిమాణం 1.5 అంగుళాలు, ఇండియమ్ టిన్ ఆక్సైడ్‌తో డిస్‌ప్లే నిర్మాణం చేపట్టినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.

టెక్నాలజీ మాయ!  (ఫోటోలు)

ఐఫోన్5కు పది పత్ర్యామ్నాయాలు!

ఈ ఆవిష్కరణకు సంబంధించి  ముఖ్యమైన అంశాలు:

- ‘‘ధరించదగిన కంప్యూటింగ్’’(వేరబుల్ కంప్యూటింగ్)  భవిష్యత్ లో మరింత ప్రాముఖ్యతను సంతరించుకోనుందని  నిపుణులు అంచనా వేస్తున్నారు.

-    ఈ ఐడియాను ఇప్పుటికే వినియోగదారులు స్వాగతిస్తున్నట్లు కిక్‌స్టార్టర్ డాట్‌కామ్ పేర్కొంది. ఈ  ప్రయోగానికిగాను 70,000 మంది $10 మిలియన్ నిధులను సమకూర్చినట్లు సదరు సైట్ వెల్లడించింది.

-     యాపిల్, ఇంటెల్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవటం మరో చర్చనీయాంశం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot