3డి టెలివిజన్‌ ఛానల్‌ ప్రారంభం..!

Posted By:

3డి టెలివిజన్‌ ఛానల్‌ ప్రారంభం..!

 

చైనా దేశపు మొట్ట మొదటి 3డి ఛానల్ నూతన సంవత్సర రోజున ట్రైయిల్‌గా తన కార్యక్రమాలను బ్రాడ్‌కాస్ట్ చేసింది. చైనా 3డి టివి ట్రైయిల్ ఛానల్‌ని సిసిటివి, చైనా సెంట్రల్ టెలివిజన్‌లతో పాటు, మరో ఐదు లోకల్ టెలివిజన్ స్టేషన్స్ షెంజు, జింగు, షాంఘై, తియాజింన్, బీజింగ్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

చైనా దేశపు మొదటి 3డి ఛానల్‌ని అధికారకంగా చైనీస్ నూతన సంవత్సరం, స్పింగ్ ఫెస్టివల్ రోజున(జనవరి 23) విడుదల చేయనున్నారు. ఈ ఛానల్ రోజుకీ 13.5 గంటలు చొప్పున కార్యక్రమాలను ప్రసారం చేయనుంది. ఈ 3డి ఛానల్ ప్రసారం చేయనున్న అన్ని కార్యక్రమాలను 3డి ఎఫెక్టులతో ప్రేక్షకులు వీక్షించవచ్చని అన్నారు.

చైనా టెలివిజన్ డెవలప్‌మెంట్‌ స్టేట్ అడ్మనిస్టేటర్ ఆఫ్ టెలివిజన్, రేడియో అండ్ ఫిల్మ్ ప్రతినిధి మాట్లాడుతూ చైనాలో 3డి టెలివిజన్ ఛానల్ విడుదల చేయడం ద్వారా టెక్నాలజీ రంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తున్నామని అన్నారు. ఈ పురోగతి మరింత అభివృద్ది చెందాలని తాను కొరుకుంటున్నట్లు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot