పోర్న్ సైట్ యాక్సిస్ కోసం 24వేలకు పైగా రిక్వెస్టులు, ఎంపీలు అంత రసికులా..?

అది ప్రజా ప్రతినిధుల సభ. అక్కడ జరగాల్సింది ప్రజల సమస్యలపై చర్చలు, వాదోపవాదాలు..అయితే అక్కడ పార్లమెంట్‌లో అవేమి జరగడం లేదు.

By Hazarath
|

అది ప్రజా ప్రతినిధుల సభ. అక్కడ జరగాల్సింది ప్రజల సమస్యలపై చర్చలు, వాదోపవాదాలు..అయితే అక్కడ పార్లమెంట్‌లో అవేమి జరగడం లేదు. ప్రజా ప్రతినిధుల సమస్యల కన్నా ఎంపీలకు పోర్న్ సైట్ల మీదనే ఆసక్తి ఎక్కువగా ఉందనే భయంకర నిజాలు బయటకు వచ్చాయి. ఇదంతా ఎక్కడో తెలుసా బ్రిటన్ పార్లమెంట్ లో..అక్కడ ఎంపీలు తమకు పోర్న్ సైట్ చూసే యాక్సిస్ కావాలని అర్జీలు పెట్టుకున్నారట..ఒకటి రెండూ కాదు..ఏకంగా 24,473 విన్నపాలు వచ్చాయట..మరి అక్కడ ఎంపీల ఆసక్తికి అలాంటిదని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.

ఎయిర్‌టెల్ మరో కానుక, ఏడాది పాటు Amazon Prime Membership ఉచితంఎయిర్‌టెల్ మరో కానుక, ఏడాది పాటు Amazon Prime Membership ఉచితం

అశ్లీల వెబ్‌సైట్‌లు యాక్సెస్‌ ఇవ్వాలని..

అశ్లీల వెబ్‌సైట్‌లు యాక్సెస్‌ ఇవ్వాలని..

బ్రిటన్ పార్లమెంటు(హౌజ్‌ ఆఫ్‌ పార్లమెంట్‌)కు సంబంధించి ఇప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పార్లమెంటులో ఉన్న కంప్యూటర్ల నుంచి తమకు అశ్లీల వెబ్‌సైట్‌లు యాక్సెస్‌ ఇవ్వాలని దాదాపు 24,473 విన్నపాలు వచ్చినట్లు బ్రిటన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.

గత ఏడాది జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు ..

గత ఏడాది జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు ..

ఈ ఆసక్తికర విషయాలను ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎఫ్‌ఓఐ) పేరిట బ్రిటన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ సేకరించింది. గత ఏడాది జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు అశ్లీల వెబ్‌సైట్‌లు యాక్సెస్‌ ఇవ్వాలని రోజుకు 160 రిక్వెస్ట్‌లు వచ్చినట్లు తెలిపింది.

ఇప్పటికే పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు..

ఇప్పటికే పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు..

కాగా వెస్ట్‌మినిస్టర్‌లో ఇప్పటికే పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాలపై ప్రధాని థెరిసా మే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకున్నారు.

అశ్లీల వీడియోలు లభించినప్పటికీ..

అశ్లీల వీడియోలు లభించినప్పటికీ..

ఈ కారణంతోనే ఆమె స్నేహితుడైనా క్షమించకుండా మంత్రి డామియన్‌ గ్రీన్‌ను గత ఏడాది తొలగించారు. ఆయన కంప్యూటర్లలో అశ్లీల వీడియోలు లభించినప్పటికీ పోలీసులను తప్పుదారి పట్టించారని ఆరోపణలు రావడంతో ఆయన్ను తొలగించారు.

చాలామంది ప్రభుత్వ పెద్దలు..

చాలామంది ప్రభుత్వ పెద్దలు..

అయితే, తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం చాలామంది ప్రభుత్వ పెద్దలు తమ కంప్యూటర్ల నుంచి అశ్లీల వీడియోల కోసం రిక్వెస్ట్‌లు పంపిస్తున్నట్లు తెలిసింది.కాగా పార్లమెంటులో 8500 వరకు కంప్యూటర్లు ఉన్నాయి.

రిక్వెస్ట్లు మాత్రం భారీ స్థాయిలోనే..

రిక్వెస్ట్లు మాత్రం భారీ స్థాయిలోనే..

ఎంపీలు అలాగే కింది స్తాయి సిబ్బంది అందరికీ అక్కడ కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మొబైల్స్ ఉన్నాయి. వీటికి పోర్న్ వెబ్‌సైట్ యాక్సిస్ తొలగించారు. కాగా రిక్వెస్ట్లు మాత్రం భారీ స్థాయిలోనే వస్తున్నాయట వీటి నుంచి.

పార్లమెంట్ సంగతి అలా ఉంటే..

పార్లమెంట్ సంగతి అలా ఉంటే..

మరి ఆ పార్లమెంట్ సంగతి అలా ఉంటే మిగతా దేశాల పార్లమెంట్స్ సంగతి ఎలా ఉంటుందోనని నెటిజన్లు ఛలోక్తులు విసురుకుంటున్నారు. వారు మరీ అంత రసికులా అంటూ నోరెళ్లబెట్టేవారి సంగతి ఇక చెప్పనే అక్కరలేదు.

Best Mobiles in India

English summary
The Houses of Parliament network blocked 24,473 porn website access attempts in 5 months more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X