ఐఫోన్‌లో i అంటే ఏంటో తెలుసా? దీనికి ఉన్న 5 అర్థాలు తెలుసుకుంటే దిమ్మతిరిగిపోద్ది..
Apple i meaning: ఐఫోన్, ఐపాడ్, ఐమ్యాక్, ఐపాడ్.. ఈ పేర్లు వింటేనే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ గుర్తొస్తుంది. యాపిల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు కోట్లాదిమంది ప్రజల జీవితాల్లో ఓ భాగం అయిపోయాయి. రోజులో చాలా సేపు వీటితోనే గడుపుతున్నారు. కానీ, వీటి పేర్లలో ముందు వచ్చే "i"కి అసలు అర్థమేంటో చాలా మందికి తెలీదు. కొంతమంది దీనర్థం "ఇంటర్నెట్" అనుకుంటారు. కానీ నిజం వేరు. "i" వెనుక ఏకంగా ఐదు విభిన్నమైన అర్థాలు ఉన్నాయి.
అవేంటంటే, ఇంటర్నెట్, ఇండివిడ్యువల్, ఇన్‌స్ట్రక్ట్, ఇన్ఫార్మ్, ఇన్‌స్పైర్. ఈ ఐదు పదాలు యాపిల్ ఫిలాసఫీని, విజన్‌ని తెలియజేస్తాయి. 1998లో ఐమ్యాక్‌ని లాంచ్ చేసినప్పుడు స్టీవ్ జాబ్స్ స్వయంగా ఈ విషయం చెప్పారు. అసలు ఈ పదాలకు యాపిల్ ప్రొడక్ట్స్‌కి లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

* "i" పుట్టుక వెనుక స్టీవ్ జాబ్స్ విజన్..
"i" స్టోరీ 1998లో ఐమ్యాక్‌తో మొదలైంది. ఆ టైమ్‌లో ఐమాక్ ఓ సంచలనం. దాన్ని లాంచ్ చేస్తూ స్టీవ్ జాబ్స్ "i" అంటే జస్ట్ ఇంటర్నెట్ మాత్రమే కాదని, ఇది ఐదు ముఖ్యమైన విలువలను సూచిస్తుందని చెప్పారు. యాపిల్ దేని కోసం నిలబడుతుందో ఈ విలువలు తెలియజేస్తాయి.
వ్యక్తులను శక్తివంతులుగా చేయడం, ఎడ్యుకేషన్‌ను మెరుగుపరచడం, నాలెడ్జ్, క్రియేటివిటీని అందించడం.. ఇవే ఆ విలువలు. అంతేకాదు, "i" అనేది పర్సనల్ ప్రనౌన్‌లా కూడా పనిచేస్తుంది. అంటే వ్యక్తిగత అనుభవానికి ఇది చాలా ముఖ్యం అని చెప్పడం. అందుకే యాపిల్ ప్రొడక్ట్స్ డిజైన్ చేసేటప్పుడు వ్యక్తిగత అనుభవం, నేర్చుకోవడం వంటి వాటిపై ఫోకస్ పెట్టింది.
* యాపిల్ ప్రొడక్ట్స్‌లో "i"కి ఉన్న ఐదు అర్థాలు..
* ఇంటర్నెట్
"i"కి మొదటి, చాలామందికి తెలిసిన అర్థం "ఇంటర్నెట్". యాపిల్ ఐమ్యాక్‌ను తీసుకొచ్చిన టైమ్‌లో ఇంటర్నెట్ బాగా పాపులర్ అవుతోంది. యూజర్లు ఈజీగా ఆన్‌లైన్‌కి కనెక్ట్ అవ్వాలని యాపిల్ అనుకుంది. ఐమ్యాక్ వెబ్ బ్రౌజింగ్ చాలా సింపుల్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా డిజైన్ చేసింది. ఐఫోన్, ఐప్యాడ్ వంటి ప్రొడక్ట్స్‌లోనూ ఇంటర్నెట్‌ను పరిచయం చేసింది.
* ఇండివిడ్యువల్
"i"కి ఇంకో అర్థం "ఇండివిడ్యువల్". యాపిల్ ప్రొడక్ట్స్‌ను ఒక్కో యూజర్‌కి పర్సనల్‌గా, యూనిక్‌గా ఉండేలా డిజైన్ చేస్తారు. కస్టమైజ్ చేసుకునే సెట్టింగ్స్, పర్సనలైజ్డ్ యాప్స్, స్టైలిష్ డిజైన్స్.. ఇలా ప్రతిదీ వ్యక్తులు తమను తాము ఎక్స్‌ప్రెస్ చేసుకునేలా ఉంటాయి. అందుకే యాపిల్‌కి అంతలా కస్టమర్ లాయల్టీ పెరిగింది.
* ఇన్‌స్ట్రక్ట్
"i" అంటే "ఇన్‌స్ట్రక్ట్" అని కూడా అర్థం. యాపిల్ ప్రొడక్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే కాదు, పవర్‌ఫుల్ లెర్నింగ్ టూల్స్ కూడా. యాపిల్ ప్రొడక్ట్స్‌లో ఎడ్యుకేషనల్ యాప్స్, ఇంటరాక్టివ్ లెసన్స్ ఎన్నో ఉన్నాయి. డిజిటల్ లెర్నింగ్‌ని యాపిల్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది. స్టూడెంట్స్, టీచర్స్ కోసం ప్రత్యేకంగా యాపిల్ ఎడ్యుకేషన్ అనే ప్లాట్‌ఫామ్‌ను కూడా స్టార్ట్ చేసింది.
* ఇన్ఫార్మ్ & ఇన్‌స్పైర్
"i" అంటే "ఇన్ఫార్మ్" అని కూడా అర్థం. న్యూస్, రీసెర్చ్, నాలెడ్జ్.. ఇలాంటివి యాపిల్ ప్రొడక్ట్స్‌తో చాలా త్వరగా తెలుసుకోవచ్చు. సఫారీ బ్రౌజర్, న్యూస్ యాప్స్, సిరి వాయిస్ అసిస్టెంట్.. ఇలా చాలా ఉన్నాయి. యూజర్లు ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా, ఇన్ఫార్మ్‌డ్‌గా ఉండాలని యాపిల్ చూస్తుంది.
పుష్ నోటిఫికేషన్స్, రియల్ టైమ్ అప్‌డేట్స్ ద్వారా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకోవచ్చు. చివరిగా "i" అంటే "ఇన్‌స్పైర్". టెక్నాలజీతో క్రియేటివిటీని, ఇన్నోవేషన్‌ను పెంచాలనేది యాపిల్ లక్ష్యం. స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ ఫీచర్స్, యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్.. ఇవన్నీ యూజర్లను కొత్తగా ఆలోచించేలా చేస్తాయి.
ఎంతోమంది ఆర్టిస్టులు, డిజైనర్లు, ఎంటర్‌ప్రెన్యూర్లు తమ ఐడియాలను నిజం చేయడానికి యాపిల్ ప్రొడక్ట్స్‌నే వాడుతున్నారు. క్రియేటివిటీని ఇన్‌స్పైర్ చేయాలనే కమిట్‌మెంట్‌ను యాపిల్ తన స్లోగన్ "థింక్ డిఫరెంట్" ద్వారానే చెప్పేసింది. 1998లో "i"ని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ అది యాపిల్ బ్రాండింగ్‌లో ఓ ముఖ్యమైన భాగం.
కనెక్టివిటీ, ఇండివిడ్యువాలిటీ, ఎడ్యుకేషన్, నాలెడ్జ్, క్రియేటివిటీ.. ఈ కోర్ వాల్యూస్‌ను "i" ఇప్పటికీ చూపిస్తూనే ఉంది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ "i" అర్థం కూడా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు "ఇంటెలిజెన్స్"కి కూడా "i" సింబల్‌గా మారింది. సిరి, స్మార్ట్ కెమెరాలు వంటి వాటిలో యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను యూజ్ చేస్తోంది.
మార్పులు ఎన్ని జరిగినా "i"కి ఉన్న మొదటి ఐదు అర్థాలు మాత్రం ఎప్పటికీ ఉంటాయి. యాపిల్ విజన్‌ను షేప్ చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది యూజర్లను ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటాయి.


Click it and Unblock the Notifications








